హీరో శ్రీకాంత్ మరో సినిమాతో సిద్ధమయ్యాడు. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హారర్-కామెడీ సబ్జెక్ట్ తో రా..రా అనే సినిమా చేశాడు. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయంటున్నాడు శ్రీకాంత్. అంతేకాదు.. ఈ సినిమాకు దర్శకుడు లేడు. దర్శకుడు లేకుండా సినిమా ఎలా వచ్చింది..? ఆ వివరాలన్నీ మనతో పంచుకున్నాడు శ్రీకాంత్. ఇది నా 125వ సినిమా అనుకుంటామొదటిసారి నా కెరీర్ లో హారర్ కామెడీ సబ్జెక్ట్ చేశాను. నాకు చాలా కొత్తగా అనిపించింది. సినిమా కూడ బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. రేపు రిలీజ్ అవుతున్న మా సినిమా నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. దెయ్యాల సెంటిమెంట్హారర్ సినిమాలు చాలా వచ్చాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తోంది. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. కానీ హారర్ లోనే ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఈ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అది. ఇందులో దెయ్యాలు మనుషులకి భయపడతాయ్. అలాగే వాటికి మనుషులకి మధ్య చిన్న సెంటిమెంట్ కూడా ఉంది.దెయ్యంతో ప్రేమఇందులో నేను సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తాను. హిట్ కోసం హారర్ సినిమా చేయాలనుకుని చివరికి దెయ్యాలతోనే సినిమా చేస్తాను. దెయ్యంతో ప్రేమలో కూడా పడతాను. చివరికి ఏం జరిగిందనే విషయం సినిమా చూసి మీరే తెలుసుకోవాలి. నిజమే.. దర్శకుడు లేడుమా సినిమాకి దర్శకుడు లేడు. సినిమా మధ్యలో నిర్మాతకు, దర్శకుడికి పడలేదు. చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించాను కానీ కుదర్లేదు. దాంతో దర్శకుడు తప్పుకున్నాడు. నేను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో నిర్మాతనే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాత కంటే నాకెవరూ ఎక్కువ కాదు. ఇక దర్శకుడి విషయానికొస్తే కథ అతడిది కాదు కాబట్టి వేరే దర్శకుడ్ని పెట్టి తీశాం. అతని పేరు మాత్రం చెప్పను. విలన్ పాత్రలకు విరామంయుద్ధం శరణం సినిమాలో విలన్ గా నటించాను. నా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మరో 2-3 విలన్ రోల్స్ కూడా వచ్చాయి. కానీ దేన్నీ ఒప్పుకోలేదు. హీరోగా చేతిలో 3 సినిమాలున్నప్పుడు, సేమ్ టైం విలన్ గా చేయడం మంచిది కాదనిపించింది. అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టాను. కొన్నాళ్లు ఆగి మళ్లీ చేస్తాను. ఆపరేషన్ 2019ఆపరేషన్ దుర్యోధన కాన్సెప్ట్ కు దగ్గరగా ఆపరేషన్ 2019 అనే సినిమా చేస్తున్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆ సినిమా ఉంటుంది. సినిమా మొత్తం పొలిటికల్ జానరే. నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారా లేకపోతే ప్రజలే నాయకుల్ని మోసగిస్తున్నారా అనేది అందులో చూపిస్తాం. సినిమా చాలా కొత్తగా ఉంటుందని మాత్రం చెప్పగలను.ఆ సినిమాలో నేను లేనుదిల్ రాజు గారు తీయబోతున్న శ్రీనివాస కల్యాణం అనే సినిమాలో నేను కూడా ఉన్నానని, ఓ కీలక పాత్ర కోసం నన్ను తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అవి నా చెవిన కూడా పడ్డాయి. కానీ నేను ఆ ప్రాజెక్టులో లేను. ప్రస్తుతం ఉన్న సినిమాలతోనే నేను బిజీగా ఉన్నాను. చిన్నోడు కూడా నటిస్తున్నాడుపెద్దబ్బాయ్ రోషన్ హీరోగా మారాడు. ఇప్పుడు మా చిన్నబ్బాయ్ రోహన్ కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ షూటింగ్ లోనే ఉన్నాడు. అది కూడ హారర్ సినిమానే. ప్రభుదేవాతో కలిసి అందులో నటిస్తున్నాడు మావాడు. ప్రభుదేవా కొడుకు పాత్ర అది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆ సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుంది. పెద్దోడు అమెరికాలో ఉన్నాడురోషన్ ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదు. నిర్మలా కాన్వెంట్ సినిమా అతడిలో మంచి ఉత్సాహం తీసుకొచ్చింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. మరో మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా వస్తాడు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో యాక్టింగ్ లో డిప్లమా కోర్స్ చేస్తున్నాడు.
Please Share this article
Related:
Tagged with:
`Rx100` హిందీ రీమేక్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది
వెంకటేష్, మీనా 'దృశ్యం -2' ప్రారంభం
విజయేంద్ర ప్రసాద్ ‘సీత’ అఫిషియల్ అనౌన్స్మెంట్
వకీల్‌సాబ్ నుండి రెండో పాటకు రేపే ముహూర్తం!
నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్ వచ్చేసింది
బన్నీ ‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' విడుదల తేదీ ఖరారు
రికార్డులు సొంతం చేసుకుంటున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట
నాంది హిందీ రీమేక్ హీరో ఎవరో తెలుసా
హీరోను 'అన్నా' అని పిలిచిన నటి లావణ్య త్రిపాఠి
కమల్ టైటిల్ తో రానున్న దేవరకొండ, ఫస్ట్ లుక్ విడుదల
కృతిశెట్టి చిన్నప్పటి యాడ్స్ చూశారా
పూజా హెగ్డే ఇంట విషాదం
అల్లు అర్జున్ సినిమాలో జయమ్మ
ఆచార్య సెట్లో ‘కామ్రేడ్ మూమెంట్' చరణ్ ఎమోషనల్ ట్వీట్
రకుల్ అందులో బాగా నష్టపోయిందట
Read More From This Category