సినిమా : ఓ పిట్ట కథ రేటింగ్ : 2.25/5నిర్మాత : వి. ఆనంద ప్రసాద్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు దర్శకత్వం :చెందు ముద్దు నటీనటులు : విశ్వంత్, సంజయ్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి
సినిమాల్లో చిన్న పెద్ద అనే తేడాలు ఎప్పుడో చెరిగిపోయాయి. నవతరం దర్శకుల ఆలోచనలే వేరుగా ఉంటున్నాయి. కొన్నేళ్లుగా కొత్త కథలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. దాంతో ఏ సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చిన దాని ప్రత్యేక దృష్టితో చూడాల్సిందే. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న సినిమాలపై మరిన్ని అంచనాలు పెరిగిపోతుంటాయి. అలా ఓ పిట్టకథ విడుదలకు ముందే మంచి ప్రచారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈ పిట్టకథ ఎలా ఉన్నది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. సినిమా కథ :ఓ పిట్టకథ టైటిల్ కు తగ్గట్లుగానే స్టోరీలైన్ చాలా సింపుల్ గా ఉంది. వెంకటలక్ష్మి సినిమా థియేటర్ యజమాని వీర్రాజు తన ఒక్కగానొక్క కూతురు వెంకటలక్ష్మి(నిత్యాశెట్టి) అల్లారుముద్దుగా పెంచుతాడు. తల్లి లేని పిల్ల కావడంతో కూతురుకి ఎలాంటి లోటు రానివ్వడు. వీర్రాజు థియేటర్లో పనిచేసే ప్రభు(సంజయ్ రావు) , వెంకటలక్ష్మి ప్రేమించుకుంటారు. ఈ విషయం వీర్రాజుకు తెలియదు. ఈ సమయంలో అకస్మాత్తుగా చైనా నుంచి వీర్రాజు చెల్లెలి కొడుకు క్రిష్()విశ్వనాథ్ ఊడిపడుతాడు. మరదల్ని పెళ్లి చేసుకుంటానని మేనమామకు ఒప్పిస్తాడు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి కనిపించకుండా పోతుంది. అసలు వెంకటలక్ష్మి ఏమైంది? ప్రభు ఏమైనా చేశాడా? ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఎలా ముగిసింది? అనేదే సినిమా. నటీనటుల ప్రతిభ :విశ్వాంత్ తన హ్యాండ్సమ్ లుక్‌తో క్రిష్ క్యారెక్టర్లో అందరిని మెప్పించాడు. డైలాగ్ డెలివరీలో లవర్ బాయ్‌గా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ తనయుడు సంజీవ్ ఫస్ట్ సినిమా అయినా.. మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో.. ప్రభు పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీతో.. బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. వెంకటలక్ష్మీ పాత్రలో నటించిన నిత్యా శెట్టి బ్యూటిఫుల్ లుక్స్‌తో.. ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక బ్రహ్మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన సీనియార్టీకి తగ్గ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మిగతా నటీనటులు తమ పాత్రలప పరిధిమేర మెప్పించారు. సాంకేతిక నైపుణ్యం :ఈ సినిమా టెక్నీకల్ గా చాలా రిచ్ గా ఉంది. ముఖ్యంగా సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. అరకు పేరుతో చూపించిన ఊటీ అందాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే, కాకినాడ చుట్టూ ఉన్న పల్లె అందాలను, బీచ్ సోయగాలను కూడా అంతే బాగా చూపించారు. ముఖ్యంగా ఊటీలో డ్రోన్ షాట్లు చాలా బాగున్నాయి. ఇక ప్రవీణ్ లక్కరాజు సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. ఆయన స్వరపరిచిన రెండు పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు చందు మంచి స్టోరీ లైన్ తో మరియు కొన్ని సస్పెన్స్ సీన్స్ తో పర్వాలేదనిపించారు.ప్లస్ పాయింట్స్:స్క్రీన్ ప్లేసంజయ్, విశ్వాంత్ల నటననిత్యాశెట్టి అందం, అభినయంమైనస్ పాయింట్స్:స్లో నెరేషన్పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్పలు సీన్లలో లోపించిన నాటకీయతవిశ్లేషణ : ఓ పిట్టకథ అంటూ వచ్చిన ఈ సినిమా కొన్ని చోట్ల సస్పెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అక్కడక్కడా కామెడీ టచ్ తో బాగానే పరవాలేదని అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో చివరి 30 నిమిషాల ప్లే దర్శకుడు చందు బాగా తెరకెక్కించారు. ఆ 30 నిమిషాల సినిమా చాలా బాగుంది. కానీ, అప్పటివరకు సినిమా పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగకపోవడం, కొన్ని సీన్స్ రిపీట్ డ్ కావడం, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే ఈ సినిమా ఓవరాల్ గా సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షుకులకు నచ్చుతుంది. ఇక మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు.చివరిగా:పిట్ట ఘనం.. కూత కొంచెం!
Please Share this article
Related:
చివరి నిమిషంలో గ్యారేజ్ కు రిపెర్స్
దాసరి స్వయంగా విడుదల చేసిన ట్రాప్
రకుల్ కి థాంక్స్ చెప్పిన బ్రహ్మాజీ
రక్షక భటుడు హిట్ అవుతుంది: బ్రహ్మానందం
జయాపజయాలతో మాకు సంబంధంలేదు
Tagged with: o pittakatha vishwanth sanjay rao nithya shetti brahmaji balaraju srinivas bhogireddy bhadraji
నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్ వచ్చేసింది
బన్నీ ‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' విడుదల తేదీ ఖరారు
రికార్డులు సొంతం చేసుకుంటున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట
నాంది హిందీ రీమేక్ హీరో ఎవరో తెలుసా
హీరోను 'అన్నా' అని పిలిచిన నటి లావణ్య త్రిపాఠి
కమల్ టైటిల్ తో రానున్న దేవరకొండ, ఫస్ట్ లుక్ విడుదల
కృతిశెట్టి చిన్నప్పటి యాడ్స్ చూశారా
పూజా హెగ్డే ఇంట విషాదం
ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!
Read More From This Category