‘జయం’ లాంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నితిన్.. ఆ తరువాత రెండు మూడు హిట్ సినిమాలు చేసినా.. ఆ తరువాత కథల ఎంపికలో లోపాల వల్ల దాదాపు పది సంవత్సరాలు హిట్‌కు దూరంగానే ఉన్నాడు. ఆ తరువాత తన సొంత బ్యానర్లో ‘ఇష్క్’ సినిమాతో సక్సెస్ సాధించి.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలతో హిట్స్ అందుకుని ‘అఆ’ తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ‘లై’, ‘ఛల్ మోహనరంగా’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాల ఫ్లాప్‌లతో డీలా పడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్టే లక్ష్యంగా ‘ఛలో’ వంటి హిట్ సినిమా దర్శకుడు వెంకీ కుడుములతో జతకట్టాడు.
దర్శకుడు వెంకీ కుడుముల తను తీసుకునే సబ్జెక్ట్ సీరియస్‌గా ఉన్నా.. దానిచుట్టూ కామెడీతో కథను అల్లుకుని, ‘ఛలో’ సినిమాను సక్సెస్ చేశాడు. మళ్ళీ నితిన్‌తో చేసిన ‘భీష్మ’ కూడా అదే ఫార్మాట్‌తో వెళ్లాడు అనిపించేలా.. టీజర్స్.. ట్రైలర్స్ ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి అన్ కాంప్రమైజ్ ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమా.. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చింది. మరి దాదాపు ఏడాదిన్నార తరువాత వచ్చిన ‘భీష్మ’ సక్సెస్‌ను అందించిందా.. వెంకీ కుడుముల మరో సారి మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా.. అనేది చూద్దాం..
విడుదల తే్ది: ఫిబ్రవరి 21, 2020బ్యానర్: సీతారా ఎంటర్టైన్మెంట్స్తారాగణం: నితిన్, రష్మిక మందన్న, నరేష్, సంపత్, రఘు బాబు, బ్రహ్మజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, సుభలేకా సుధాకర్, సత్యన్, జెస్సెన్ గుప్తా, మైమ్ గోపి, సత్య, ప్రవీణ, కళ్యాణి నటరాజన్
కథ, స్క్రీన్ ప్లే & డైలాగులు:వెంకి కుడుముల
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
ఎడిటర్: నవీన్ నూలి
కళా దర్శకుడు: సాహి సురేష్
స్టంట్స్: వెంకట్
సాహిత్యం: శ్రీ మణి & కసర్ల శ్యాం
సంగీత దర్శకుడు: మహతి స్వరా సాగర్,నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
రేటింగ్: 3.25 / 5.0
భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ యజమాని భీష్మ( అనంత్ నాగ్) స్వయం శక్తితో పైకి వచ్చినవాడు. తన కంపెనీతో వ్యవసాయ రంగానికి సాయిం చేస్తున్నవాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. దాంతో...వారసులు లేని ఆయన.... తను రిటైర్ అయితే...తన కంపెనీని నిలబెట్టే వారసుడు కోసం సెర్చింగ్ లో ఉంటాడు. తనలాగే కష్టపడే తత్వం ఉండే వాడు తన కంపెనీకి వారసుడు అయితే బాగుంటుందని ఆయన భావన. మరో ప్రక్క ఈయన పేరు గల అల్లరి కుర్రాడు భీష్మ (నితిన్). జీవితంలో ఏ విధమైన లక్ష్యం లేకుండా సింగిల్ గా లైఫ్ వెళ్ల దీస్తూంటాడు. అయితే అతని జీవితం...చిత్ర (రష్మిక)తో ప్రేమలో పడ్డాక టర్న్ తీసుకుంటుంది. ఆమె భీష్మ కంపెనీలో జాబ్ చేస్తూంటుంది. మనవాడి చేష్టలకు..ఆమె కూడా కొద్ది రోజులుకు జూ.భీష్మ తో ప్రేమలో పడుతుంది. అయితే ఈ విషయం ఆమె తండ్రి ఎసీపి దేవా (సంపత్)కు తెలుస్తుంది. దాంతో ఆయన నా కూతురునే లైన్లో పెట్టాలని చూస్తావా అని సీరియస్ అవుతాడు."
నితిన్ ని కాల్చి పారేస్తానంటూ ఎగురుతాడు. అప్పుడు తన కొడుకుని రక్షించుకోవటానికి అప్పటికప్పుడు ..ఓ అబద్దం ఆడతాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్ నాగ్) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది.
తనపై నిరంతం నిఘా పెట్టే ప్రక్క కంపెనీ ఎంప్లాయి రఘుబాబు,తనతో పాటు తిరుగుతూ తన వెనకే గోతులు తీసే వెన్నెల కిషోర్ ని సైలెంట్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అటు కెరీర్ ని, ఇటు ప్రేమని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడు, రాఘవన్ ని ఏం మైండ్ గేమ్ లు ఆడి ఎదుర్కొన్నాడు.. అసలు అంత పెద్ద భీష్మ కంపెనీ బాధ్యతలు నితిన్ చేతిలో ఎలా పెట్టారు..? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ప్లస్ పాయింట్స్ :
నితిన్ మరియు రష్మికాల మధ్య కెమిస్ట్రీనితిన్,వెన్నెల కిషోర్ ల మధ్య కామెడీపాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్హిలేరియస్ కామెడీ ట్రాక్స్
మైనస్ పాయింట్స్ :
కాస్త అంచనా వెయ్యగలిగే కథనంఅక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
వీక్ గా అనిపించే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్
నితిన్ తనకు బాగా అలవాటైన జానర్ కాబట్టి చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ చెలరేగిపోయాడు. తన గత సినిమాలతో పోలిస్తే.. ‘భీష్మ’లో చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపించాడు. నటన పరంగా చాలా ఇంప్రూమెంట్ చూపించాడు. తన కామెడీ టైమింగ్స్.. డాన్స్‌లతో ఆకట్టుకున్నాడు.
చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది
ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. నితిన్ – రష్మిక పెయిర్ కూడా ఆన్ స్క్రీన్ వాటే వాటే బ్యూటీ అనేలా ఉంది.వెన్నల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ లతో కాంబినేషన్ సీన్స్ లో కామెడీ టైమింగ్ అదిరింది.
వెన్నెల కిషోర్ ట్రాక్ మనల్ని మరోసారి కడుపుబ్బా నవ్విస్తుంది. సంపత్ రాజ్, నరేష్, బ్రహ్మాజీల బెస్ట్ పెర్ఫార్మన్స్ తో వీరి ట్రాక్స్ కూడా సూపర్బ్ గా పేలాయి. మెయిన్ గా ప్రీ ఇంటర్వల్ దగ్గర వచ్చే 30 నిమిషాలు భీభత్సంగా నవ్విస్తుంది. అలాగే సెకండాఫ్ లోని మొదటి 40 నిమిషాలు ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. . అలాగే సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ కీలక పాత్రలో అందరినీ మెప్పించాడు.
నెగటివ్ షేడ్స్ లో జిష్హు షేన్ గుప్తా మరోసారి మెప్పించాడు, జిష్షు గుప్త మరోసారి టాలీవుడ్ లో మంచి హాట్ టాపిక్ అవుతాడని చెప్పాలి. ఇక రేష్, రఘుబాబు వంటి మిగతా నటీనటులందరూ.. తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. హెబ్బా పటేల్ అతిధి పాత్రలో మెరిసింది.
సాయి శ్రీరామ్ విజువల్స్ నయనానందకరంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా క్లాస్ గా, ప్రతి యాక్టర్ ని ఎంతో అందంగా చూపించడం వలన కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. సాగర్ స్వర మహతి అందించిన సింగల్, వాటే బ్యూటీ సాంగ్స్ విజువల్ గా కూడా సూపర్బ్, మిగతావి జస్ట్ ఓకే.. కానీ నేపధ్య సంగీతంలో మాత్రం ది బెస్ట్ ఇచ్చి సినిమాని మరో లెవల్ లో కూర్చో బెట్టాడు.
నవీన్ నూలి ఎడిటింగ్ చాలా స్పీడ్ గా, క్లైమాక్స్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది.
వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చాలా బాగుంది. స్పెషల్లీ సెకండాఫ్ లో పొలంలో వచ్చే ఫైట్ లో నితిన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ సూపర్బ్.
వాటే బ్యూటీ సాంగ్ లో జానీ మాస్టర్ స్టెప్స్ అదుర్స్.
ఇక దర్శకుని విషయానికి వచ్చినట్టయితే వెంకీ తన మొదటి చిత్రం “ఛలో” కు తీసుకున్న కామెడీ ఫార్ములాలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి.చాలా రోజులుగా నితిన్ కోరుకుంటున్న అద్భుతమైన విజయాన్ని కూడా ఇచ్చాడు .
తన మొదటి సినిమాలానే ఇందులో కూడా తను స్ట్రాంగ్ అయిన కామెడీ అనే బ్రహ్మాస్త్రంతో అందరినీ మెప్పించాడు. రైటర్ తానే కావడం వలన స్టోరీ లైన్ చాలా చిన్నదైనప్పటికీ ట్రీట్మెంట్, కామెడీ అండ్ టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించేసాడు. తాను రాసుకున్న సీన్స్, కామెడీ అన్నీ వర్కౌట్ అయ్యాయి కానీ ఎప్పటిలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి తేల్చేసాడు. కథలో హీరో – విలన్ కి గట్టి పోటా పోటీ సీన్స్ పెట్టే ఆస్కారం ఉన్నప్పటికీ సరిగా వాడుకోలేదు. చాలా సింపుల్ గా ఫినిష్ చేసేసాడు. కథ పరంగా చాలా సింపుల్ అయినప్పటికీ తన మార్క్ కామెడీ, లవ్ సీన్స్, టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పించి చాలా మంది దాటలేని ద్వితీయ విజ్ఞాన్ని విజయవంతంగా దాటేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై అందంగా కనిపించి, ఆహ్లాదాన్ని పంచిందని చెప్పాలి.
కాకపోయే ఈ సినిమా తాలూకా మెయిన్ థీమ్ పాయింట్ మాత్రం పెద్ద కొత్తగా లేకపోవడం మైనస్ అని చెప్పాలి.అలాగే సెకండాఫ్ పై పెట్టిన శ్రద్ద ఫస్టాఫ్ పై మిస్సయినట్టు క్లియర్ గా తెలుస్తుంది.అలాగే మహతి అందించిన పాటలు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్ గా బాగున్నాయి.అలాగే సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.
హీరో నితిన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది దానికి తోడు త్రివిక్రమ్ తో తీసిన “అఆ” తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కూడా నితిన్ కొట్టలేదు.దీనితో ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని వెంకీ కుడుములతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు.అయితే ఈ చిత్రం నుంచి చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా అవి మంచి వైరల్ అయ్యేవి. అలా పాటలతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగినట్టు అనిపిస్తుంది.మరీ గొప్పగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ప్రతీ ఆర్టిస్టు మంచి నటనతో అలాగే ఆలోచింపజేసే కథనంతో మెల్లగా కొనసాగుతుంది.
అలాగే నితిన్ లోని ఓ సరికొత్త యాంగిల్ ను వెంకీ ప్రెజెంట్ చెయ్యగా దానికి నితిన్ పూర్తి న్యాయం చేకూర్చారు.అయితే ట్రైలర్ తోనే కథ తాలూకా థీమ్ ఏమిటి అన్నది రివీల్ చేసేసిన దర్శకుడు సినిమా చూస్తున్నంతసేపు దానిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగున్ను అనిపిస్తుంది.ఇలా ఫస్టాఫ్ అంతా ఒకే అనిపించే నరేషన్ తో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ మరియు ఇంటర్వెల్ లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ లో అన్ని అంశాల మోతాదును దర్శకుడు పెంచేశారని చెప్పాలి.ముఖ్యంగా కామెడీ సీన్స్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి.ఇలా కామెడీ మాత్రం సెకండాఫ్ లో మంచి ఎస్సెట్ గా నిలుస్తుంది.”ఛలో” చిత్రంతో వెంకీ చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యిందని చెప్పాలి.అలాగే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు నితిన్, కేజీయఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్,అలాగే ఆసక్తికరంగా మారే కథనాలు బాగున్నాయి.
చాలా కాలం తర్వాత నితిన్ నుంచి వచ్చిన “భీష్మ” ఎంటర్టైన్మెంట్ పరంగా మరో హిట్ బొమ్మ పడింది అని చెప్పాలి.
Please Share this article
Related:
Tagged with: .bheeshma movie review bheeshma movie rating nithin rashmika venki kudumula
‘మేజర్‘ సినిమా విడుదల తేదీ వచ్చేసింది
‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ మూవీ రివ్యూ
బంగారు బుల్లోడు రివ్యూ
రివ్యూ : రెడ్ మూవీ
‘క్రాక్’ మూవీ రివ్యూ
నిశ్శబ్దం రివ్యూ
కెమెరాలు షేక్ అయ్యేలా శృతి బోల్డ్ పర్ఫార్మ్
ఓ పిట్టకథ మూవీ రివ్యూ
పలాస మూవీ రివ్యూ
రాహు మూవీ రివ్యూ
హిట్ మూవీ రివ్యూ
కనులు కనులను దోచాయంటే మూవీ రివ్యూ
ప్రెజర్ కుక్కర్ మూవీ రివ్యూ
భీష్మ రివ్యూ
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ
Read More From This Category