#Koushal #Bigboss2 #HousewarmingCeremony #BiggBoss #BiggBoss2Telugu #BiggBossTelugu2
నటుడు కౌశల్ ఓ ఇంటివాడయ్యాడు. తన భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలో కౌశల్ తన భార్యా పిల్లలతో కలిసి సంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం చేస్తున్నట్లుగా ఉంది. పట్టు వస్త్రాలు ధరించిన కౌశల్ దంపతలిద్దరూ ఇంటి గుమ్మం ముందు గుమ్మడి కాయ కొట్టి నూతన గృహంలోకి అడుగు పెట్టారు. కౌశల్ టెలివిజన్ నటుడు, మోడల్, బిజినెస్ మాన్ , యాడ్స్ కు దర్శకత్వం చేస్తాడు. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ బుల్లి తెరతో పాటు అనేక సినిమాలలో నటించాడు. చక్రవాకం సీరియల్, రాజకుమారుడు, వెంకీ, మిస్టర్ పెరఫెక్ట్ వంటి అనేక సినిమాల్లో కౌశల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.
అలాగే ద లుక్స్ ప్రొడక్షన్స్ అనే మోడల్ మేనేజ్మెంట్ ఏజన్సీని స్థాపించి సుమారు 230కి పైగా వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు. తెలుగు టీవీ చరిత్రలో సంచలనం సృష్టించిన బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్, నాని చేతుల మీదుగా కౌశల్ బిగ్‌బాస్ ట్రోఫిన్ గెలుచుకోవడంతో పాటు.. రూ.50 లక్షల నగదును అందుకున్నాడు. బిగ్‌బాస్ ముందు వరకు కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కౌశల్.. బిగ్‌బాస్ విజేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category