సినిమా : అశ్వద్ధామ రేటింగ్ : 2.5/5నిర్మాత : ఉష మూల్పూరి సంగీతం : శ్రీ చరణ్ పాకాల దర్శకత్వం : రమణ తేజ నటీనటులు : నాగశౌర్య, మొహరీన్, ప్రిన్స్, పోసాని కృష్ణ మురళి తదితరులు
వరుసగా ప్రేమ కథల్లో నటించి విజయాలు అందుకొని, లవర్ బాయ్ గా, చాకోలెట్ బాయ్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నాగశౌర్య. అయితే మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా ఎదగాలనే తపనలో ఉన్నాడు. అందుకే మధ్య మధ్యలో జాదూగాడు వంటి కథలను ఎంచుకున్నాడు. ఆ మధ్య నిర్మాతగా, నటుడిగా చేసిన నర్తనశాల చాలా దెబ్బకొట్టింది. అందుకే ఈసారి జాగ్రత్త పడి, ఇప్పటి జనరేషన్ కు నచ్చే కథను చేయాలనుకున్నాడు. అందుకే అశ్వద్ధామ వంటి కథతో వచ్చాడు. తన స్నేహితుడు రమణ తేజ ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశాడు. మరి ఈ ప్రయత్నం ఎలా సాగింది. అశ్వద్ధామతో నాగశౌర్య ఏమి చెప్పాలనుకున్నాడు? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. చిత్ర కథ :గణ(నాగశౌర్య) అమెరికా నుంచి యుఎస్ కి చెల్లి నిశ్చితార్ధం కోసం వస్తాడు. పెళ్ళికి రెండు రోజులు ఉందనగా ప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుండగా అడ్డుపడుతాడు. తనకు తెలియకుండానే తాను గర్భవతి అయ్యానని, ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని చెల్లెలు చెప్పడంతో అన్నగా ఆమెకు అండగా నిలబడి కాబోయే బావ సాయంతో అబార్షన్ చేయిస్తాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి చేస్తాడు. కానీ అసలు తన చెల్లెలు ఏమి జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమంలో సిటీలో తన చెల్లెలు లాగే కొంతమంది అమ్మాయిలు మాయమవుతున్నారని.....వారందరూ మళ్ళీ ఇళ్లకు తిరిగి వస్తున్నారని, అయితే వారు గర్భవతులు అవుతున్నారు అని తెలుస్తుంది. దాంతో అసలు ఇదంతా చేస్తున్నది ఎవరు? అనే విషయాన్ని పసిగట్టాలని అనుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో ఐదుగురు వ్యక్తులు కిడ్నప్ చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. సిటీలో జరుగుతున్నా కిడ్నాప్ లకు కారణం ఎవరు? అనే విషయాన్నీ గణ ఎలా కనుక్కుంటాడు? అసలు కిడ్నాప్ లకు కారణమైన వ్యక్తి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటుల ప్రతిభ :నాగశౌర్య పూర్తి స్థాయి మాస్ పాత్ర చేశాడు. ఇంతకు ముందు అతన్ని ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్స్ లో చూయినప్పటికీ, ఇంతకుముందు జాదూగాడు లో మాదిరిగానే ఇందులో ఎబ్బెట్టుగా అనిపించలేదు. పాత్రకు ఫిట్ అనిపించాడు. అందుకోసం పెర్ఫెక్ట్ లుక్ లోకి మారాడు. చెల్లికి జరిగిన అన్యాయానికి లోలోన నారాయకయాతన అనుభవిస్తూ ప్రతీకారం కోసం ప్రయత్నించే పాత్రలో నాగశౌర్య ఎమోషన్స్ బాగా పలికించాడు.
పెర్ఫార్మెన్స్ పరంగా శౌర్య ఇది వన్ అఫ్ త బెస్ట్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మొహరీన్ కౌర్ పాత్రా సినిమాలో నామమాత్రమే. హీరో చెల్లిగా చేసిన అమ్మాయి పరవాలేదు. విలన్ పాత్రధారి ఆకట్టుకున్నాడు. అతను కొత్తవాడే అయినప్పటికీ పాత్రకు తగ్గ వెయిట్ తీసుకొచ్చాడు. హరీష్ ఉత్తమన్ బాగా చేశాడు. ప్రిన్స్ - సత్య - జయప్రకాష్ - పవిత్ర లోకేష్ - పోసాని.. వీళ్లెవరికీ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు.సాంకేతిక నైపుణ్యం :మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ లో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన శ్రీ చరణ్ జస్ట్ ఓకే అనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరో నాగ శౌర్య కథ బాగా రాసుకున్నాడు. అయితే ఆలోచన బాగున్నా దాన్ని తెరకెక్కించడంలో కొద్దిగా తడపడ్డారు. రమణ తేజ డైరక్షన్ టాలెంట్ ఓకే అనేలా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంతా పెట్టారు.ప్లస్ పాయింట్స్ :కథ, కథనంనాగశౌర్య నటనబ్యాగ్రౌండ్ మ్యూజిక్మైనస్ పాయింట్స్ :కొన్ని సాగదీత సీన్స్పాటలుక్లైమాక్స్ సాదాసీదాగా ఉండటంవిశ్లేషణ :అశ్వద్ధామ సినిమాతో యాక్షన్ హీరోగా మారాలన్న నాగశౌర్య చాలా వరకు విజయం సాధించాడు. యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్స్ పండించి మాస్ హీరో రేంజ్ నటన కనబరిచారు. మొదటి సగం మంచి సస్పెన్స్ తో సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించింది. స్క్రీన్ ప్లే ఇంకా బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటె మరోస్థాయిలో ఉండేది. అయితే ఎక్కడ నిరాశపరచకుండా సినిమా సాగింది. ఇక నాగశౌర్య చేసిన ఈ నూతన ప్రయత్నం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. చివరిగా:హింస ఎక్కువైనా అశ్వద్ధామ థ్రిల్ పంచుతాడు .
Please Share this article
Related:
ద్రువలో నటిస్తున్న పోసాని
టీజర్ తో అదరగొడుతున్న అవసరాల
సెప్టెంబర్ 9న జ్యో అచ్చుతానంద
అవసరాలకి మంచి ఛాన్స్ ఇస్తున్నారుగా?
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `లక్ష్మీ బాంబ్`
Tagged with: ashwaddama nagashourya moharin prince posani krishna murali usha mulpuri sri charan pakala ramana teja
నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్ వచ్చేసింది
బన్నీ ‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' విడుదల తేదీ ఖరారు
రికార్డులు సొంతం చేసుకుంటున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట
నాంది హిందీ రీమేక్ హీరో ఎవరో తెలుసా
హీరోను 'అన్నా' అని పిలిచిన నటి లావణ్య త్రిపాఠి
కమల్ టైటిల్ తో రానున్న దేవరకొండ, ఫస్ట్ లుక్ విడుదల
కృతిశెట్టి చిన్నప్పటి యాడ్స్ చూశారా
పూజా హెగ్డే ఇంట విషాదం
ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!
Read More From This Category