సినిమా : బ్రోచేవారెవ్వరురా రేటింగ్ : 2.75/5నిర్మాత : విజయ్ కుమార్ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : వివేక్ ఆత్రేయనటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, శివాజీ రాజా తదితరులు
కొన్ని సినిమాలు టైటిల్ టోన్ మనసులు లాగేస్తాయి. బ్రోచేవారెవరురా టైటిల్ ఆ కోవకే చెందుతుంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాల్సిందే అంటూ చిత్ర బృందం బాగా ప్రచారం చేసింది. ఈ సినిమాను ఆడపిల్లల కోసమే ఒప్పుకొన్నానని శ్రీవిష్ణు ఒకానొక సందర్భంలో చెప్పారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరు గొప్పగా మాట్లాడుకుంటున్న ఈ సినిమాలో అంతగా ఏమున్నదో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.
చిత్ర కథ :విశాల్ (శ్రీ విష్ణు), విశాక్ (ప్రియదర్శి), ర్యాంబో(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. అయితే అప్పటికే ఇంటర్ మూడు సార్లు ఫెయిల్ అయి... ఇంకా చదువుతూనే ఆకతాయి కుర్రాళ్ళుగా కాలం గడుపుతుంటారు. ఈ క్రమంలో వారు చదివే కాలేజీ లోనే నివేద థామస్(మిత్ర) కూడా జాయిన్ అవుతుంది. అదే కాలేజీ ప్రిన్సిపల్ అయినా తండ్రితో తనకున్న సమస్యల కారణంగా నివేదా థామస్, శ్రీవిష్ణు గ్యాంగ్ తో స్నేహం చేస్తుంది.
ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల... నివేదా తన తండ్రి నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో శ్రీవిష్ణు బ్యాచ్, ఆమెకు ఎలా సాయం చేశారు? ఆ సాయం కారణంగా వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆ సమస్యల నుంచి వారు ఎలా బయటపడ్డారు? ఆ తప్పు వల్ల సత్యదేవ్ (రాహుల్) లైఫ్ లో ఎలా టర్న్ అయ్యింది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడల్సిందే.
నటీనటుల ప్రతిభ : మిత్ర పాత్రలో నివేదా థామస్ అద్భుతంగా నటించింది. తండ్రి ప్రేమకు దూరమైన మిత్ర క్యారెక్టర్లో నివేదా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగానూ నివేదా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగే రాహుల్ పాత్రలో శ్రీ విష్ణు మెప్పించాడు. తనకు అలవాటైన నటనతో రాహుల్ పాత్రలో ఈజీగా జీవించేశాడు. సినీ హీరోయిన్ షాలినీగా నివేధా పేతురాజ్, డైరెక్షన్ కోసం ప్రయత్నించే విశాల్గా సత్యదేవ్ బాగానే నటించారు. శ్రీ విష్ణు స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గుర్తుండే పాత్రలో నటించారు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక నైపుణ్యం :మొదటి సినిమా మెంటల్ మదిలో సినిమాతో సెన్సిటివ్ లవ్ స్టోరీ ఎంచుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి దానికి క్రైమ్ ప్లస్ కామెడీ థ్రిల్లర్ ని ఎంచుకోవడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తనలో కథకుడికి మంచి పదును పెడుతూ ప్రేక్షకుల మెదళ్ళకు చిక్కుముడులు అందిస్తూ సాగించిన డ్రామా ఆకట్టుకునేలా ఉన్నది. అయితే కమర్షియల్ అంశాలకు చోటు ఇవ్వకుండా రాసుకున్న ఆత్రేయ కామెడీ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటె ఇదో హిలేరియస్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయేది.
ఇన్నేసి పాత్రల ట్విస్టులను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రెజెంట్ చేసిన తీరుని చూస్తే ఇంకాస్త గ్రిప్పినే నేరేషన్ కానక రాసుకుంటే బాగుండేది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీతం మరి గొప్పగా ఆకట్టుకోలేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ ట్రాక్ అయినా క్యాచికి నూట చేసి ఉంటె ఇంకాస్త బాగుండేది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం పరవాలేదు.
టెక్నీకల్ గా తన కెమెరా వర్క్ పై కామెంట్స్ రాకుండా మంచి క్వాలిటీతో చూపించాడు. ఓవరాల్ గా కొంత ట్రిమ్మింగ్ అవసరం అనిపించినప్పటికీ రవితేజ గిరజాల ఎడిటింగ్ పాస్ అయిపోయింది. మాన్యం బ్యానర్ వాల్యూస్ భారీగా లేకపోయినా సబ్జెక్టుకు తగ్గట్టు బాగున్నాయి
ప్లస్ పాయింట్స్ :నటీనటుల ప్రతిభపాత్రల చిత్రీకరణకామెడిట్విస్టులు
మైనస్ పాయింట్స్ :పాయింట్ పరంగా కొత్త కథేం కాదుఅక్కడక్కడా కథ నెమ్మదించడం
విశ్లేషణ : ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సరదాగా సాగుతూ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్టైన్ గా నడిపించినప్పటికీ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా నడిపారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సిక్వెన్స్ లో వచ్చే ఛేజింగ్ స్లో గా సాగుతుంది. అయితే శ్రీవిష్ణు, నివేదా థామస్, నివేత పేతురేజ్,స్ సత్యదేవ్ అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ నటనతో అలరించారు. ఈ సినిమాని చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు ఆనందంలో ఎటువంటి సందేహం లేదు.
చివరిగా: బ్రోచేవారెవరురా.. ఆక్టటుకునే కిడ్నాప్ డ్రామా
Please Share this article
Related:
కుమారికి ఎసరు పెట్టిన నివేదా
మణిరత్నం సినిమాలో కొచ్చాడైయాన్ ఫేం
నాని హీరోయిన్ ను హెచ్చరించారట
నితిన్ కు వరుణ్ తేజ్ షాక్
అఖిల్ కి డిసెంబర్ స్పెషల్
Tagged with: brochevarevarura vijay kumar vivek sagar vivke atreya srivishnu priaydarshi nivedha thamas niveda peturaj rahul ravindra
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలకు లైన్ క్లియర్
కోహ్లీ బ్యాటింగ్ పై అమితాబ్ ట్విట్
ప్రియుడి గురించి స్పందించిన దిశ పటాని
వెంకీ మామ సెన్సార్ పూర్తి
విడుదలకు సిద్దమైన సూసైడ్ క్లబ్
విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక
మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్
జయలలిత బయోపిక్ కి భారీ డిమాండ్
కెజిఎఫ్ ఖాతాలో మరో రికార్డ్
జబర్దస్త్ లో నాగబాబుపై పంచులు పడుతున్నాయి
పవన్ కామెంట్స్ కు పూనమ్ కౌర్ కౌంటర్
అల డిజిటల్ రైట్స్ కి భారీ ధర
దమ్మున్న నాయకుడు కెసిఆర్ : పోసాని
నేను డేటింగ్ చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిగింది : దీపికా
అసురన్ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ
ఈ అమ్మడు ఏమి చేయాలనీ అనుకుంటుంది
Read More From This Category