హీరో రామ్‌చరణ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ధృవ' చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో రామ్ చరణ్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎలా ఫీలవుతున్నారు?- విడుదల సమయంలో ఉండాల్సిన టెన్షన్, కాన్ఫిడెన్సూ ఉంది. రీమేక్ కాబట్టి ఇంకాస్త ఎక్కువ టెన్షన్ ఉంది. తమిళంలో నిరూపించుకున్న సినిమా కంటే మించి ఉండాలని ప్రయత్నించాం.
రీమేక్ చేయడానికి కారణం? - రీమేక్ చేయడంలో తప్పేంటి?, కథ బాగుంటే ఏదైనా చేస్తాం. ఇలాంటివే చేయాలనే రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదు. నిర్మాత ఎన్వీప్రసాద్ ఈ సినిమా తీసుకొచ్చారు. బాగా నచ్చింది. ఎందుకు చేయకూడదనిపించింది. నిజం చెప్పాలంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్స్‌కి పూర్తి భిన్నంగా, కొత్త కోణంలో ఉండే సబ్జెక్ట్ ఇది. బాగుంటుందని ట్రై చేశాం. ఒకే తరహా పాత్రలు, చిత్రాలు కాకుండా కొంచెం భిన్నంగా ఉండే సినిమా చేయాలని చేశాం. ఎప్పుడూ ట్యాంక్‌బండ్‌పై విగ్రహంలా ఒకేలా ఉండలేం కదా!. పైగా పక్కా మాస్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ నన్ను ఈ కథలో చూడాలనుకున్నారు. ఆయనే నన్ను కొత్తగా చూడాలనుకుంటున్నారు. నాపై నమ్మకంతో ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు కాన్ఫిడెంట్‌గా కొత్తగా చేయకూడదు అనిపించింది. గత చిత్రాల ఇమేజ్గాని, ఫలితాలు గాని చూసుకుని సినిమా చేయకూడదు. దేనికదే కొత్తగా చేయాలి. కథను అర్థం చేసుకున్న విధానం మారినప్పుడు అన్నీ కొత్తగానే ఉంటాయి.
అరవింద్ స్వామితో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి?- తమిళ 'తని ఒరువన్'లో అరవింద్ స్వామి ప్రతి నాయకుడిగా చేశారు. ఆ పాత్రకు ఆయన తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు. పైగా ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా రోజులవుతుంది. అన్ని రకాలుగా బాగుంటుందని ఎంపిక చేశాం. సీనియర్ యాక్టర్ కదా మొదట్లో ఆయనతో కలిసి నటించేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఉండేది. క్రమంగా ఆయనతో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. అది ఎంతగా అంటే సినిమాలో కొట్టే సీన్లు ఉంటే కొట్టడానికి ఇబ్బంది పడేంతగా.
డైరెక్టర్ ఛాయిస్ ఎవరిది?- ఈ సినిమా అనుకోవడానికే ముందే దర్శకుడు సురేందర్‌రెడ్డి, నేను కలిసి ట్రావెల్ అవుతున్నాం. ఇతర స్క్రిప్ట్‌ల గురించి చర్చిస్తున్న టైమ్‌లోనే ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. అయితే సొంత కథతోనే సురేందర్ రెడ్డికి సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా బాగుండటంతో చేయమని చెప్పాం. ఆయన మొదట ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత నెమ్మదిగా కథని ఓన్ చేసుకుని చాలా కష్టపడి చేశారు. ఇతరుల కథను ఓన్ చేసుకుని సినిమా చేయడం అంత ఈజీ కాదు. నటుడికి కూడా అది కష్టమే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా చేస్తున్నప్పుడు దాన్ని పాడు చేయకుండా, దానికంటే బెటర్‌గా చేయాలని ఉంటుంది. ఆ టైమ్‌లో ఆటోమేటిక్‌గ్గా ఒత్తిడి ఉంటుంది. సురేందర్‌రెడ్డి కష్టపడి తమిళం కంటే బెటర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
రకుల్‌ను వెంటనే తీసుకున్నారు?కొత్తవారు ఇంకా ఎవరున్నారు చెప్పండి? ఆ అమ్మాయి నటిగా ఇన్వాల్వ్ అయి చేస్తుంది. 'నాన్నకు ప్రేమతో'లో ప్రూవ్ చేసింది. కొత్తవారు వస్తే వారినే పెట్టుకునేవాళ్లం. అయినా లక్కీగా నాకు మళ్ళీ ఆమెనే కుదిరింది.
కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ మీదేనా?25 ఏళ్ల కుర్రాడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇంతకు ముందు కీ బోర్డు ప్లే చేశాడు. సౌండింగ్ కొత్తగా ఇచ్చాడు. ట్రైలర్లోనే అది తెలుస్తుంది.
పాత్ర కోసం మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకున్నారని ప్రతి ఒక్కరూ చెప్పటానికి రీజన్?- నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. సినిమా చూసినప్పుడు ఫస్ట్ నాకు క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఫిజిక్ పరంగా ఫిట్‌గా ఉండాలనిపించింది. చాలా కష్టపడ్డాను. అయితే ఇలా ఎప్పుడో చేయాల్సింది. దీనికి కుదిరింది. అన్ని సినిమాలకు కష్టపడ్డట్టే ఈ సినిమాకీ కష్టపడ్డాను. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. సినిమాలోనూ, పాత్రలోనూ ఆ కష్టం కనిపిస్తుంది.అలాగని ప్రత్యేకంగా డైట్లాంటివేమీ చేయలేదు.
సిద్ధార్థ అభిమాన్యు పాత్ర మీకెందుకు నచ్చింది?- ఇన్స్పైరింగ్ రోల్. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. పాజిటివ్, రియల్ ఎమోషన్స్ ఉన్న పాత్ర. పాత్ర విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. 'జంజీర్' తర్వాత రీమేక్ చేస్తున్న సినిమా కాబట్టి క్యారెక్టర్ గురించి ఆలోచించాను తప్ప కథ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే తమిళంలో నిరూపితమైంది.
'బ్రూస్లీ' సినిమా ఫలితం మీలో తీసుకొచ్చిన మార్పేమిటి?- కథలు ఎంచుకునే విధానం మారిందనిపించింది. 'బ్రూస్లీ'నే కాదు ప్రతి సినిమా ద్వారా నేను చాలా నేర్చుకుంటా. నటన పరంగా ఇంకా బెటర్‌గా చేసేందుకు ప్రయత్నిస్తాను.
మెగాస్టార్ 150వ సినిమా అప్డేట్స్?- టాకీపార్ట్ కంప్లీట్ అయింది. ఓ సాంగ్ నేటితో పూర్తవుతుంది. ఆడియో ఫంక్షన్ ఎక్కడని చెప్పలేను, కానీ క్రిస్మస్కి ఉంటుంది. సినిమా విడుదల జనవరి 12 లేదా 13న ఉంటుందనుకుంటున్నాం. వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి నిర్మాతగా నేనేం చూసుకోవాల్సిన పనిలేదు. వినాయక్‌గారే దర్శకుడు, నిర్మాత. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. ఈ సినిమాలో నేను కూడా ఓ సాంగ్‌లో కనిపిస్తాను.
యాదృఛ్ఛికంగా మీరు, చిరంజీవి, పవన్‌కళ్యాణ్ రీమేక్‌లే చేస్తున్నారు కదా!- రీమేక్‌లు చేయకూడదనే పట్టింపులేవీ మేం పెట్టుకోలేదు. కథ బాగుంటే చేయడం తప్ప రీమేక్ గురించి ఆలోచించం. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మన ప్రేక్షకులకు కూడా చూపించాలనే ఫీలింగ్‌తోనే చేస్తాం.
సిక్స్‌ప్యాక్ ఈ సినిమాకే చేయడానికి?కథ డిమాండ్ చేసింది.
ఉపాసన..హెల్త్ టిప్స్ ఇచ్చిందని తెలిసింది?అటువంటిది లేదు. చక్కటి శిక్షకులు, డైటీషియన్స్ ఉన్నారు. వారి ప్రకారం నడుచుకున్నాను.
ఇది ఎలాంటి సినిమా?పూర్తి ఎంటర్టైనర్. కథపరంగానే సాగుతుంది. 'మగధీర 'చూసినా అందులో పెద్దగా కథ ఉండదు. ఎమోషనల్ రన్ అవుతుంది. 'సరైనోడు'లో కథ కంటే కామెడీ ఉంటుంది. అదే జనాలను కూర్చోపెడుతుంది.
అన్ని సీరియస్ పాత్రలే చేస్తున్నారే?దర్శకుడు సుకుమార్‌తో చేసేది పూర్తి వి రుద్ధం గా ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాన్న సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా చేస్తా.
మణిరత్నం కథ రెడీ చేస్తున్నారని చెప్పారు?అవును.. ఇంకా చర్చలు జరుగుతున్నాయి.
పొగడ్తలు ఎలా స్వీకరిస్తారు?చాలా ఇబ్బందిగా ఉంటాయి.. కానీ వారి గౌరవాన్ని స్వీకరించాలి
హార్రర్ మూవీస్ సక్సెస్ అవుతున్నాయి కదా. అటువంటి సినిమా చేయడానికి మీరేమైనా ప్లాన్ చేస్తున్నా?ఇంట్రెస్ట్ అయిన కథ దొరకలేదు.
సెంటిమెంట్‌ను నమ్ముతారా?నమ్మను. నా లక్కీ నెంబర్ 9అని కెటిఆర్అన్నారు. ఆయనకు అలా అనిపించిందేమో.సినిమా నిడివి ఎక్కువగా ఉందనిపించ లేదా?కంటెంట్ బాగుంది. రన్ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. దాంతో ఎక్కడా ఎక్కువ అనిపించదు. తమిళ వర్షన్ ఎక్కడా ఎడిట్ చేలేదు. అప్పటికే వారు క్లీన్‌గా స్క్రీన్‌ప్లే చేశారు. దాన్ని పాడుచేయలేదు. అన్ని సీన్లు ఒకదానికొకటి లింక్ ఉంటుంది.
సినిమాను మీ నాన్నగారు చూశారా?ఇంకా చూడలేదు ఎల్లుండి చేస్తారు.
నెక్ట్స్ సినిమాలు?- నాన్నగారి సినిమా 'ఖైదీ నంబర్ 150' విడుదలైన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది 'ధృవ' చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకతంలో ఓ సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాను. బహుశా అది నెక్ట్స్ ఇయరే కావచ్చు. హీరోగా ఇతర భాషల్లో చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు.
Please Share this article
Related:
Tagged with: dhruva ram cahran interview dhruva specails dhruva highlights
నేను మా ఇంట్లో ఎలా ఉంటానో -కల్యాణ్‌రామ్ ఇంటర్వ్యూ
ఊరంతా ఏమనుకుంటున్నారు?- శ్రీనివాస్ అవసరాల
చరణ్ చేయకపోతే నేనే చేస్తా - వరుణ్ తేజ్
అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టా
స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా-లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
సంపూర్నేష్‌బాబు ఇంటర్వ్యూ
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ జోడి బాగాలేదా ? డాలీ ఇంటర్వ్యూ
ఎన్ని సినిమాలైనా ఆడతాయి-శర్వానంద్ ముచ్చట్లు
ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ -చిరంజీవి ఇంటర్వ్యూ హైలైట్స్
ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే
అదే జనాలను కూర్చోపెడుతుంది-చరణ్ ఇంటర్వ్యూ
విలన్‌గా నటించాలనే నా కోరిక తీరిపోయింది
నా దగ్గర పదేండ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయి-పూరీ ఇంటర్వ్యూ
త్వరలోనే నిర్మాతగా
మెచ్చ్యూరిటీ పెరిగిందిరామ్ ఇంటర్వ్యూ
Read More From This Category