పవన్ రాకపోవడంపై
ప్రతి ఫంక్షన్ కి అందరు హాజరవ్వాలని కుటుంబ సభ్యులు రూల్ పెట్టుకొలేదు. మిగతా హీరోలు కూడా ఆహ్వానం ఇస్తే రాలేదు. వాళ్ళ ఉత్సాహం కొద్ది వాళ్ళొచ్చారు. కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం వలన రాలేకపోయాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి దూరం లేదు. ఎప్పుడు కలిసినా ఆనందంగానే ఉంటాం.
సురేఖ పవన్ ఇంటికి వెళ్లలేదు, మేం బాగానే ఉన్నా ఖైదీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు హీరో పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు తన భార్య సురేఖ అతని ఇంటికెళ్లినట్టు ప్రచారం జరిగింది, అసలు పవన్ ఇంటికి తన భార్య సురేఖ ఎందుకు వెళుతుందని, ఇలాంటి ఆలోచనలు తమలో లేవని, మీకెందుకు వస్తాయని చిరంజీవి ప్రశ్నించారు. తామంతా బాగానే ఉన్నామని చిరంజీవి స్పష్టం చేసారు.
సిక్స్ ప్యాక్
సిక్స్ ప్యాక్ అనేది తనకు పెద్ద విషయం కాదని మ. ‘నా కొడుకులాగా నన్నుకూడా కండలు పెంచమంటారా?’ అని ప్రశ్నిస్తూనే కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. తాను కనుక ఫోకస్ చేస్తే ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ సాధించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాగబాబు నాలాంటి వాడు కాదు
గతంలో తమ గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యామని చెప్పారు. కానీ, దీనిపై తాను ఎలాంటి భావన వ్యక్తం చేయలేదన్నారు. తనది చాలా సున్నిత మనస్తత్వమన్నారు చిరంజీవి. నాగబాబు కామెంట్స్ మీద అందరికీ నాలాగే సున్నిత మనస్తత్వం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మనస్తత్వం ఉంటుంది, నాగబాబు నాలాగా సాఫ్ట్ కాదు.... అలా మాట్లాడటంలో తప్పులేదనేది నా భావన అని చిరంజీవి తెలిపారు. ఈ గొడవ ఎందుకు మొదలైంది, దానికి కారణం ఏమిటనే దానిపై స్పందించడానికి చిరంజీవి నిరాకరించారు చిరంజీవి.
కొత్త తరహా పాత్రలు చేయడానికి నేను వెనుకంజ వేయను
రీఎంట్రీ మూవీగా ‘కత్తి’ లాంటి కమర్షియల్ టచ్ ఉన్న సినిమానే ఎంచుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా మున్ముందు ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధం అంటున్నాడు. ఈ విషయంలో ఆయన విక్టరీ వెంకటేష్ ను ఉదాహరణగా చూపించడం విశేషం. భవిష్యత్తులో తాను బయోపిక్స్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తానని చిరు వెల్లడించాడు. ‘‘ఏవైనా కొత్త తరహా ఆసక్తికరమైన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధం. వెంకటేష్ ‘గురు’లో అలాంటి పాత్రే చేస్తున్నాడు. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలే కానీ.. పెద్ద వయస్కుడిగా కనిపించే పాత్ర చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. బాలీవుడ్ లో బయోపిక్స్‌కు బాగా స్కోప్ ఉంది. నేను ఆ తరహా సినిమాలు చేయనని అనను. ఐతే ఎవరైనా వ్యక్తి పాత్రను నేను చేయాలంటే ముందు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని.. ఆ తర్వాత సినిమా చేస్తా. మొత్తంగా కొత్త తరహా పాత్రలు చేయడానికి నేను వెనుకంజ వేయను’’ అని సురేందర్ రెడ్డితో, బోయపాటి శ్రీనుతో చర్చలు జరుగుతున్నాయి. ఖైదీ నంబర్ 150 విడుదలయ్యాక గానీ తదుపరి సినిమా ఏదనేది చెప్పలేను. మెగా హీరోల మధ్యన పోటీ అనేదే ఉండదు. అందరూ సరైన దారిలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ తమ కెరీర్ నిర్మించుకుంటున్నారు. ధృవ చూసిన తర్వాత చరణ్ సరైన కథలు ఎంచుకుంటున్నాడన్న నమ్మకం కలిగింది. నటనపరంగానూ ధృవలో చరణ్ నటన టాప్ క్లాస్ ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. చరణ్ సరైన దారిలోనే వెళుతున్నాడనుకుంటా
డాన్స్ స్టెప్స్ నిజం చెప్పాలంటే నాలో డ్యాన్స్ ఎప్పుడూ అలాగే ఉంది. తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేయాల్సి వచ్చినా బయట ప్రాక్టిస్ చేసింది లేదు. సెట్లో దేవిశ్రీ ప్రసాద్ బీట్ వినడం, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసింది చేయడం అన్నీ ఎప్పట్లానే జరిగిపోయాయి.రాఘవ లారెన్స్ వీణ స్టెప్‌కి ఎక్స్టెన్షన్ చేద్దామంటే ఈ సినిమాలో అది చేశాం. కచ్చితంగా అభిమానులకిది మంచి కిక్ ఇస్తుందని అనుకుంటున్నా. నా కొత్త లుక్కు క్రెడిట్ అంతా రామ్ చరణ్‌కే దక్కాలి. నాకు పర్సనల్ ట్రైనర్లా మారి ఏం తినాలి, తినకూడదు అని ఒక పర్ఫెక్ట్ డైట్ చూసుకున్నాడు. ఎక్కువగా ప్రొటీన్ షేక్ తీసుకుంటూ డైట్ పాటించా
హీరోల మధ్యన పోటీ
హీరోల మధ్యన పోటీతత్వాన్ని నేనసలు వీటిని పెద్దగా పట్టించుకోను. నా వరకూ నా సినిమా ఎలా వస్తుందన్నది వీటన్నింటికంటే ముఖ్యం. ఇకపోతే హీరోలు కూడా మేమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వాలి. మొన్నీమధ్యే చరణ్, మహేష్ కలిసి ఒక హాలిడే ట్రిప్‌కు వెళ్ళారు. ఈ ఒక్కటి చాలు హీరోలంతా ఎలా కలిసే ఉన్నారో చెప్పడానికి!
రాజకీయాలు
రాబోయే రోజుల్లో రాజ్యం కాంగ్రెస్ దేనని, పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మొసళ్ళను పట్టడం కోసం నీళ్ళన్నీ తోడేసారని, చిన్న చిన్న చేపలు ఎండిపోతున్నాయని, దేశవ్యాప్తంగా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, 50, 60 రోజులు గడిచినా కష్టాలు తీరలేదని, దీంతో ప్రజలు కసి తీర్చుకోవాలన్న నిర్ణయంతో ఉన్నారని, అందుకే తదుపరి ఎన్నికలలో ప్రజలు యూపీఏకే పట్టం కడతారు
గౌతమిపుత్ర
ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఉండేదే! వాటిని సీరియస్‌గా తీసుకోకుంటే బాగుంటుంది. నన్నడిగితే సంక్రాంతి సీజన్లో చాలా సినిమాలు ఒకేసారి వచ్చినా ఆడతాయని చాలాసార్లు ఋజువైంది. ఈ సంక్రాంతికి కూడా నా సినిమాతో పాటు, శాతకర్ణి కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.
Please Share this article
Related:
Tagged with: chiranjeevi interview nagababu varmakhidi no 150
నాకు నిజమైన పోటీ ఎవరంటే ? -రామ్
ముసలి హీరో కి ఓకే చెప్పిన శృతి హసన్
ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కౌశల్
జనవరి 26న ఓటిటిలో క్రాక్’
తారక్ త్రివిక్రమ్ సినిమా తరువాత ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్?
మహేశ్‌బాబు అందానికి కారణం ఏంటో తెలుసా ? విష్ణు
నమ్రత పోస్ట్ హర్ట్ అయిన ఎంఎస్ రాజు
చిరంజీవితో నయనతార?
హిందీ క్రాక్ లో సోనుసూద్
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
Read More From This Category