#deepikapadukone #gehraiyaan దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
నిత్యం పనిలో బిజీగా ఉంటూ భార్యను పట్టించుకోని ఒక భర్త. భర్త ప్రేమకోసం ఆరాటపడే భార్య దీపికాకు, కజిన్ అనన్య తనకు కాబోయే భర్త సిద్ధాంత్ ను పరిచయం చేస్తుంది. అయితే అనన్య తన ఫియాన్సీ సిద్ధాంత్ ను దీపికా కు పరిచయం చేసిన తర్వాత అతడు దీపికాను ఇష్టపడతాడు. భర్త నుంచి దొరకని ప్రేమ సిద్ధాంత్ నుంచి దొరకడంతో దీపికా కూడా అతడితో ప్రేమలో పడి శారీరక కోరికలు తీర్చుకోవడం వరకు వెళ్తోంది. ఆ తరువాత వారి ఇద్దరి రిలేషన్ గురించి అనన్యకు, దీపికా భర్తకు తెలియడం, ఆ తరువాత వారు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి..? చివరికి ఆ ప్రేమ జంటలు ఏం అయ్యాయి..? అనేది కథగా చూపించారు. నలుగురు వ్యక్తుల మధ్య ఉన్న విచిత్రమైన బంధాలను చాలా సున్నితంగా చూపించారు. ఇక దీపికా, సిద్ధాంత్ మధ్య హాట్ లిప్ కిస్ లు వేడి పెంచుతున్నాయి. పెళ్లి తరువాత దీపికా ఇంత బోల్డ్ గా నటించడం ఇదే మొదటిసారి.. మరి అమ్మడి హాట్ సీన్స్ తో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుతుందో చూడాలి.
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category