#KaranJohar #DrugsInBollywood #SushantSinghRajput #DeepikaPadukone #NCB #FinalReport4SSR #SSRMurderNotSuicide
డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో క్షతిజ్ రవి ప్రసాద్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్సీబీ నోటీసుల ప్రకారం నిన్న ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన క్షితిజ్ ని అదుపులోకి తీసుకొని ఎన్సీబీ విచారిస్తోంది. ఇక డ్రగ్ పెడ్లర్ అంకుష్ అర్నెజా ను విచారించగా.. క్షితిజ్ తన నుండి డ్రగ్స్ కొనుగోలు చేసాడని వెల్లడించాడు. ఈ క్రమంలో అతని నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా గంజాయి మరియు చిన్న మొత్తంలో వీడ్ దొరికినట్లు తెలుస్తోంది. క్షితిజ్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటాడని గుర్తించిన అధికారులు.. అతన్ని అదుపులోకి తీసుకొని నిన్నటి నుండి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీబీ విచారణలో అతను చెప్పిన విషయాలు సంతృప్తికరంగా లేకపోవడంతో 24 గంటల విచారణ అనంతరం.. తాజాగా క్షితిజ్ ని అరెస్ట్ చేశారు.
కాగా డ్రగ్స్ సరఫరాదారులుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించిన క్షితిజ్ రవి ప్రసాద్ మరియు అనుభవ్ చోప్రాలు కరణ్ జోహార్ కు అత్యంత సన్నిహితులని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కరణ్ జోహార్ వీటిని ఖండిస్తూ కరణ్ ఓ లేఖ విడుదల చేశారు. 'ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలో అనుభవ్ చోప్రా ఉద్యోగి కాదు. 2011-12 మధ్య కాలంలో కేవలం 2 నెలలు మాత్రమే మా సంస్థలో పనిచేశాడు. క్షితిజ్ ప్రసాద్ మా సంస్థలో ఓ ప్రాజెక్టు కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అంతకుమించి ఆ ఇద్దరు వ్యక్తులతో వాళ్ల వ్యక్తిగత జీవితాలతో నాకు ధర్మ ప్రొడక్షన్స్ కు ఎలాంటి సంబంధమూ లేదు. నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు' అని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.
Please Share this article
Related:
Tagged with: ncb
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
మోహన్ దాస్ టీజర్ చూశారా?
రష్మిక మందన్న లేటెస్ట్ హాట్ ఫోటోస్
Read More From This Category