#PradeepManchiraju #AnchorPradeep #30rojulloPreminchatamela #30RojulloPreminchadamElaTrailer #YouthStarMania #PradeepMachiraju #loveofmylife #Betterhalf #Lifeline #love
ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌కు దర్శక నిర్మాతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందులో సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కూడా వచ్చారు. జనవరి 29న సినిమా విడుదల కానుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని.. నీలినీలి ఆకాశం పాట ఉన్నంత అందంగా సినిమా కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఈ సినిమాలో అందమైన కథతో పాటు అద్భుతమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయని చెప్పాడు.
అందరూ మాట్లాడుతుండగా దర్శకుడు మున్నా కూడా స్టేజీపైనే ఉన్నాడు. హీరో ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కింద పడిపోయాడు. అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రదీప్ మాట్లాడుతున్నపుడు వెనకాల నిలబడిన దర్శకుడు మున్నా కళ్లు మూసి బరువుగా తెరుస్తున్నాడు. అలా కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈయన.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని ప్రదీప్ గమనించలేదు. తన స్పీచ్ కొనసాగిస్తున్నాడు. కానీ వెంటనే దర్శకుడు మున్నా పక్కనే ఉన్న నిర్మాతతో పాటు మరికొందరు కూడా అక్కడ గుమిగూడి వెంటనే నీళ్లు ఇచ్చారు. చాలా సేపటి నుంచి నిలబడే ఉండటం.. లైట్ ఫోకస్ కూడా పడటంతో కాస్త కళ్లు తిరిగినట్లు అయ్యాయని చెప్పాడు మున్నా.
వెంటనే అక్కడే ఫస్ట్ ఎయిడ్ తీసుకుని వెంటనే మళ్లీ స్టేజీపైకి వచ్చాడు. తన సినిమా గురించి మాట్లాడాడు. కంగారు పడాల్సిందేం లేదని.. ఊరికే అలా కళ్లు తిరగడంతోనే కింద పడిపోయాడని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సూపర్ హిట్ అయింది. అదే సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.
Please Share this article
Related:
Tagged with:
అన్న చెప్పిన టిప్ ను పాటించిన వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమా యూనిట్ ను మెచ్చుకున్న బన్నీ
విజయ్ సరసన పూజా హెగ్డే
సముద్రఖని ‘ఆకాశవాణి’ టీజర్
రాధే శ్యామ్ లో ఎన్ని పాటలో తెలుసా ?
తేజాతో ప్రియా ప్రకాశ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
పవన్ - రానా సినిమా ఫొటో లీక్
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్‌ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
Read More From This Category