#PanjaVaisshnavTej #Uppena
మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేశాడు. హయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన డెబ్యూ హీరోగా రికార్డులు క్రియేట్ చేశాడు. మరి ఈ సినిమాకు వైష్ణవ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి తొలి సినిమా హీరో ఎవరైనా పారితోషికం నామమాత్రంగానే ఉంటుంది. అయితే.. మెగా హీరో బ్రాండ్ ఉంది కాబట్టి.. మనోడికి కాస్త ఎక్కువే ఇచ్చారు. అన్ని ఈక్వేషన్స్ లెక్కలోకి తీసుకొని వైష్ణవ్ తొలి చిత్రం పారితోషికంగా రూ.50 లక్షలు ఇచ్చారు. కాగా.. ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన ఉప్పెన.. మూడో వారంలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికీ ఉప్పెన జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వైష్ణవ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో రెండో చిత్రానికి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఉప్పేన రిలీజ్ కు ముందే క్రిష్ తో సినిమా చేయడానికి సైన్ చేశాడు వైష్ణవ్. ఈ చిత్రానికి రెమ్యునరేషన్ కూడా ముందే మాట్లాడుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ చిత్రానికి రూ .75 లక్షలు మాత్రమే చెల్లిస్తారు.అయితే. బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్‌లోనూ మరో సినిమా చేయబోతున్నాడు వైష్ణవ్. ఇది కూడా ఉప్పెనకు ముందే అగ్రిమెంట్ కావడం విశేషం. కానీ.. పారితోషికం విషయంలో పాత ఒప్పందాన్ని పక్కనబెట్టి మంచి అమౌంట్ నే ఫిక్స్ చేశారట. ఈ కొత్త రేట్ ప్రకారం వైష్ణవ్ కు 2.5 కోట్లు ఇవ్వబోతున్నారు. ఈ విధంగా మూడో చిత్రానికే స్టార్ హీరో అయిపోయాడు వైష్ణవ్.
Please Share this article
Related:
Tagged with:
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category