సినిమా: హిట్ రేటింగ్ : 2.5/5నిర్మాణ సంస్థ : వాల్ పోస్టర్ సినిమా నిర్మాత : ప్రశాంతి త్రిపిర్నేని సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : శైలేష్ కొలను నటీనటులు : విశ్వక్ సేన్, రుహాణి శర్మ, మురళి శర్మ, నవీన రెడ్డి, హరితేజ, శ్రీనాథ్ మాగంటి, చైతన్య తదితరులు అ ! సినిమాతో నిర్మాతగా మారిన నాచురల్ స్టార్ నాని.... తన బ్యానర్ లో తీసిన రెండో సినిమా హిట్. యూత్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాని కొత్త దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ఆసక్తికరమైన ప్రోమోలతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచిన ఈ మిస్టరీ థ్రిల్లర్ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలు ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. చిత్ర కథ : విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సిటీలో క్రైమ్ రేటు తగ్గించడానికి హోమిసైడ్ ఇంటెర్వెషన్ టీమ్(హిట్) లో సభ్యుడుగా ఉంటాడు. పలు కేసులను సాల్వ్ చేసే క్రమంలో చిన్నపుడు అతని జీవితంలో జరిగిన కొన్ని ఘటనలకారణంగా తను మానసికంగా ఇబ్బంది పడుతుంటాడు. డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినిపించుకోదు. తన డిపార్ట్మెంట్ కు చెందిన లేడీ ఆఫీసర్ నేహా (రుహాణి శర్మ)ను ప్రేమిస్తాడు. నేహా కోరిక మేరకు ఆరు నెలలు సెలవు తీసుకుంటాడు. రెండు నెలల తర్వాత నేహా మిస్ అయ్యిందని తెలిసిన తర్వాత విక్రమ్ లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాడు.
కానీ నేహా కేసు ని మరో ఆఫీసర్ కంట్రోల్ లో ఉంటుంది. అయినా కూడా నేహా ఇంట్లోకి వెళ్లిన విక్రమ్ కొన్ని క్లూలు సేకరిస్తారు. అదే సమయంలో నేహా హ్యాండిల్ చేసిన ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసుకి, నేహా కనపడకుండా పోవడానికి ఏదో సంబంధం ఉందనిపించడంతో విక్రమ్ ప్రీతీ కాసిని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. క్రమంగా ప్రీతీ కేసులో అనుకోని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? అసలు ప్రీతీ ఎవరు? ఆమె కనపడకుండా పోవడానికి, నేహా కనపడకుండా పోవడానికి గల కారణాలు ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటుల ప్రతిభ : విశ్వక్ సేన్ ఈ సినిమాకు పెర్ఫక్ట్ ఛాయస్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాఫ్ఫాడించాడు. ఈ కుర్ర నటుడు సీరియస్ పాత్రలో మెప్పించాడు. ఫలక్ నామా దాస్ కంటే కూడా ఇందులోనే బాగా నటించాడు విశ్వక్. రుహాణి శర్మది చిన్న పాత్రే. కానీ ఉన్నంతసేపు బాగానే ఉంది. మరో కీలక పాత్రలో మురళి శర్మ బాగా నటించాడు. ఆయనతో పాటు భాను చందర్, ప్రీతీ అనే అమ్మాయిగా సాహితి బాగున్నారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. సాంకేంతిక నైపుణ్యం:ఈ సినిమాలో దర్శకుడు, హీరోల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ముఖ్యంగా పాటలు లేని సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ దే ప్రధాన ఆకర్షణ అయి ఉండాలి. ఈ విషయంలో వివేక్ సాగర్ వందశాతం మార్కులు సంపాదించాడు. ఎడిటింగ్ బాగుంది. అయితే అక్కడక్కడా సేమ్ సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో కాస్త ల్యాగ్ అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు శేలేష్ కొలను తను రాసుకున్న కథ కంటే కూడా స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా రాసుకున్నాడు. తోలి సినిమానే అయినా కూడా అద్భుతంగా వర్కౌట్ చేసుకున్నాడు. క్రైమ్ జోనర్ ప్రేక్షకుకు హిట్ పండుగే. ప్లస్ పాయింట్స్ : విశ్వక్ సేన్ నటనకథనంఇన్వెస్టిగేషన్ సీన్స్‌బ్యాగ్రౌండ్ మ్యూజిక్మైనస్ పాయింట్స్ :స్లో నెరేషన్, నిడివిబలమైన క్లైమాక్స్ లేకపోవడంవిశ్లేషణ :విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ మూవీ చాలావరకు ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అలరించే అంశాలు. అయితే కథలో కొన్ని మలుపులు గట్టి స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం మంచిగా రాసుకొని ఉంటె సినిమా మరోస్థాయిలో ఉండేది. క్రైమ్ థ్రిల్లర్స్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ మరియు మల్టీఫ్లేక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. చివరిగా :హిట్.. థ్రిల్లర్ ప్రియుల కోసం
Please Share this article
Related:
సమంత కాదు తమన్నా
లఘు సినిమాలో నటిస్తున్న సునీత
నెట్లో సందడి చేస్తున్న అమలాతో సమంత ఫోటో
రెండు సార్లు పెళ్లి చేసుకోబోతున్న సమంత, చైతు
శ్రీను వైట్ల సినిమాకు ఒకే చెప్పిన ప్రేమమ్ హీరో
Tagged with: vishwak sen ruhani sharma murali sharma naveena reddy haritea srinath maganti chaitanya hit review
నాకు నిజమైన పోటీ ఎవరంటే ? -రామ్
ముసలి హీరో కి ఓకే చెప్పిన శృతి హసన్
ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కౌశల్
జనవరి 26న ఓటిటిలో క్రాక్’
తారక్ త్రివిక్రమ్ సినిమా తరువాత ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్?
మహేశ్‌బాబు అందానికి కారణం ఏంటో తెలుసా ? విష్ణు
నమ్రత పోస్ట్ హర్ట్ అయిన ఎంఎస్ రాజు
చిరంజీవితో నయనతార?
హిందీ క్రాక్ లో సోనుసూద్
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
Read More From This Category