సినిమా : జానూ రేటింగ్ : 2.5/5నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు , శిరీష్ సంగీతం: గోవింద్ వసంతదర్శకత్వం : ప్రేమ్ కుమార్ నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్, వర్ష , రఘు బాబు, గౌరీ, సాయి కుమార్ తదితరులు. పక్క పరిశ్రమల్లో విజయవంతమైన కథల్ని రీమేక్ చేయడం మాములే. అయితే క్లాసిక్ అనిపించుకున్న సినిమాను రీమేక్ చేయడానికి మాత్రం వెనకాడుతుంటారు నిర్మాతలు. 96 తమిళంలో క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా. దాన్ని ఎంతో ఇష్టపడి తెలుగులో జాను సినిమాగా రీమేక్ చేశాడు దిల్ రాజు.
అయన నిర్మాణంలో రూపొందిన తోలి రీమేక్ సినిమా ఇదే. మాతృకను తెరకెక్కించిన దర్శకుడిని జాను సినిమా బాధ్యతలనుఅప్పగించారు . ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే సమంత, శర్వానంద్ జంటగా నటించారు. మరి మాతృకలో మ్యాజిక్ పునరావృతం అయిందా? జాను ఎలా ఉంది? వంటి విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. చిత్ర కథ :కె.రామచంద్ర(శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. ఓ పని కోసం తన స్టూడెంట్‌తో వైజాగ్ వచ్చిన రామచంద్ర అక్కడ స్కూల్, థియేటర్‌ను చూడగానే తన గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అప్పుడు తనతో పాటు 10వ తరగతి చదువుకున్న మురళి(వెన్నెలకిషోర్), సతీష్(తాగుబోతు రమేశ్)లకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ క్రమంలో అందరూ హైదరాబాద్‌లో రీ యూనియన్ కావాలనుకుంటారు.
అన్నట్లుగానే అందరూ కలుసుకుంటారు. అప్పుడు రామచంద్ర, జానకి దేవి(సమంత అక్కినేని)ని కలుసుకుంటాడు. దాదాపు 17 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న ఇద్దరూ రీ యూనియన్ పార్టీ తర్వాత జానకితో కలిసి రామచంద్ర ఆమె ఉండే హోటల్‌కి వెళతాడు. అప్పుడు ఇద్దరూ 10వ తరగతి చదువుకునేటప్పుడు ఇద్దరి మధ్య పరిచయం, ఎలా విడిపోయాం అనే సంగతులను గుర్తుకు తెచ్చుకుంటారు.
జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అసలు రామచంద్ర ఎందుకు పెళ్లి చేసుకోడు? రామచంద్ర, జాను ఎందుకు విడిపోతారు? అసలేం జరిగింది? చివరికి ఇద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.నటీనటుల ప్రతిభ :రామ్ పాత్రలో శర్వానంద్ పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. శర్వానంద్ తప్ప ఈ పాత్రలో మరొకరు చేరలేరు . ఇక జానకి అలియాస్ జానుఆ సమంత ది బెస్ట్ అనిపించుకుంది. 96 లో త్రిషను మరిపించేలా సమంత నటన ఉంది. పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న సమంత జానూగా ప్రేక్షకులలో మరోసారి కొన్నాళ్ళు నిలిచిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్, జానుగా నటించిన వారు కూడా బాగా చేశారు. వర్ష , శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్, రఘుబాబులతో పాటు సినిమాలో నటించిన మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. సాంకేతిక నైపుణ్యం: సాంకేతిక పరంగా ఈ సినిమా ఉన్నతంగా ఉన్నది. గోవింద్ వసంత సంగీతం, మహేంద్రన్ జై రాజ్ కెమెరా పనితనం, మిర్చి కిరణ్ మాటలు మెప్పిస్తాయి. ప్రేమ్ కుమార్ భావోద్వేగాలపై పట్టు కోల్పోకుండా కథను నడిపించిన విధానం మెప్పిస్తుంది. దిల్ రాజు చేఇస్నా తోలి రీమేక్ ఇది. అయన సంస్థ స్థాయికి తగ్గట్లుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ :శర్వానంద్, సమంతల నటనబ్యాక్ గ్రౌండ్ స్కోర్మైనస్ పాయింట్స్ :పాటలు విశ్లేషణ :మొత్తంగా చెప్పాలంటే జాను సినిమా ఒరిజినల్ 96 మూవీలోని అన్ని ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కిన పెర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పాలి. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు జానూ సినిమాను బాగా ఆస్వాదిస్తారు. అయితే 96 సినిమా చుసిన వారికి కొంచెం స్లోగా సాగిందనే భావన కలుగుతుంది. సమంత, శర్వానంద్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనడంలో సందేహం లేదు. జాను మరియు రామ్ పాత్రల్లో వారు లీనమై నటించారు. జాను పేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. మల్టీఫ్లేక్స్ ప్రేక్షకులను ఈ సినిమా మరింతగా ఆకట్టుకుంటుంది. చివరిగా : శర్వానంద్, సమంత జాను.. ప్రేమ ఎప్పటికి ఒక అందమైన జ్ఞాపకమే..!
Please Share this article
Related:
'సత్య 2' హిట్ అవుతుందట: శర్వానంద్
శర్వానంద్ ఆశలన్ని ఆ రెండిటిపైనే.....
శర్వానంద్ ఇకపై సినిమాల్లో నటించడా.....?
మరో సినిమాని నిర్మిస్తున్న శర్వానంద్ !
Tagged with: sharvanand samantha jaanu dil raju vennela kishor raghu babu sai kumar
నేను ఐటెంగాళ్ కాదు, స్పెషల్ హీరోయిన్: అనసూయ భరద్వాజ్
`Rx100` హిందీ రీమేక్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది
వెంకటేష్, మీనా 'దృశ్యం -2' ప్రారంభం
విజయేంద్ర ప్రసాద్ ‘సీత’ అఫిషియల్ అనౌన్స్మెంట్
వకీల్‌సాబ్ నుండి రెండో పాటకు రేపే ముహూర్తం!
నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్ వచ్చేసింది
బన్నీ ‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' విడుదల తేదీ ఖరారు
రికార్డులు సొంతం చేసుకుంటున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట
నాంది హిందీ రీమేక్ హీరో ఎవరో తెలుసా
హీరోను 'అన్నా' అని పిలిచిన నటి లావణ్య త్రిపాఠి
కమల్ టైటిల్ తో రానున్న దేవరకొండ, ఫస్ట్ లుక్ విడుదల
కృతిశెట్టి చిన్నప్పటి యాడ్స్ చూశారా
పూజా హెగ్డే ఇంట విషాదం
అల్లు అర్జున్ సినిమాలో జయమ్మ
ఆచార్య సెట్లో ‘కామ్రేడ్ మూమెంట్' చరణ్ ఎమోషనల్ ట్వీట్
Read More From This Category