సినిమా: కనులు కనులను దోచాయంటే రేటింగ్ : 2.5/5నిర్మాణ సంస్థ : కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : ఆంటోని జోసెఫ్ సంగీతం : మసాలా కేఫ్ దర్శకతం : దేసింగ్ పెరియసామి నటీనటులు : దుల్కర్ సల్మాన్, రీతూవర్మ, రక్షణ, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ తదితరులుదుల్కర్ సల్మాన్ తెలు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఓకే బంగారం సినిమాతో ఆకట్టుకున్న అయన మహానటి తో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభావం చూపించాడు. అయన ఒక భాషకంటూ పరిమితం కాకుండా సౌత్ నుంచి హిందీ వరకు ఆయా కథలను బట్టి పలు భాషల్లో నటిస్తుంటారు. ఇటీవల తమిళం, తెలుగు అభిమానుల కోసం ఓ సినిమా చేశాడు. ఇది దుల్కర్ నటించిన 25వ సినిమా కావడం విశేషం. తెలుగు లో 'కనులు కనులను దోచాయంటే' పేరుతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?దుల్కర్ సల్మాన్ మరోసారి తన ప్రభావం చూపాడా? తదితర విషయాలను తెలుసుకునే ముందు కథేమిటో తెలుసుకుందాం?
సినిమా కథ:ఆరేళ్లుగా సిద్దార్థ్(దుల్కర్ సల్మాన్),కల్లీస్ (రక్షన్ ) మంచి స్నేహితులు. సిద్దార్థ్ యాప్ డెవలపర్ గా, కల్లిస్ యానిమేటర్ గా పనిచేస్తూ రిచ్ లైఫ్ ను అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ మీరా(రీతూ వర్మ) శ్రేయా(నిరంజని)లతో తోలి చూపులోనే ప్రేమలో పడతారు. వారి వెంటపడి వారి ప్రేమను పొందుతారు. అయితే మరోవైపు నగరంలో ఆన్ లైన్ క్రైమ్ తో పాటు ఖరీదైన కార్లను ఖరీదైన వస్తువులను దొంగతనాలకు గురవుతుంటాయి.
అయితే ఈ కేసులతో పాటు మరో కీలకమైన కేసును అనఫీషియల్ గా డీల్ చేస్తుంటాడు పోలీస్ కమిషనర్ ప్రతాప్ సింహ(గౌతమ్ మీనన్). మరోవైపు లవ్, పెళ్లి, ఎంజాయ్ అని సిద్దార్థ్ , కెల్లీస్,మీరా, శ్రేయా లు గోవాకు వెళతారు. అయితే అక్కడ మీరా గురించి సిద్దార్థ్ కు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి? ప్రతాప్ వెతుకుంటున్న ఆ మోసగాళ్లు ఎవరు? సిద్దార్థ్, మీరాల ప్రేమ పెళ్లిళ్లు ఎంతవరకు వెళ్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటుల ప్రతిభ :దుల్కర్ సల్మాన్ మరోసారి తన సత్తా చాటాడు. తన 25వ సినిమా కథను పూర్తిగా డిఫరెంట్ గా ఉండలేనా ప్లాన్ చేసుకున్నాడు. నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. ఇక రీతూ వర్మ కూడా చాలా బాగా నటించింది. పెళ్లి చూపులు తర్వాత మరోసారి ఈమె మంచి నటనను ప్రదర్శించింది. హీరో స్నేహితుడు పాత్రలో రక్షణ్ చాలా బాగా నటించాడు. గౌతమ్ మీనన్ అందరికి సర్ ప్రైస్ ప్యాకేజ్. అయన మంచి దర్శకుడే అనుకుంటారు కానీ, అంతకంటే మంచి నటుడు కూడా. అనీష్ కురివిల్ల సెకండ్ హాఫ్ అంతా చాలా బాగున్నాడు. ఇక సినిమాలో నటించిన మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. సాంకేతిక నైపుణ్యం :ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. అనువాద సినిమా అయినా కూడా పాటలు బాగున్నాయి. అందులో లిరిక్స్ బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వరం బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా నీట్ గా ఉన్నది. ల్యాగ్ సీన్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటె బాగుండేది. క్లైమాక్స్ కూడా అక్కడక్కడా ల్యాగ్ అయినట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాను తెరకెక్కించిన లొకేషన్స్ చాలా బాగున్నాయి. దర్శకుడు దేసింగ్ తోలి సినిమాకే మంచి కథను ఎంచుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా చక్కగా అల్లుకున్నాడు. అనువాద సినిమానే అయినా కూడా దుల్కర్ సొంత వాయిస్... రీతువర్మ తెలుగు అమ్మాయి కావడంతో మన సినిమా చూసినట్లే అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ : డిఫరెంట్ కాన్సెప్ట్క్రైమ్ సీన్స్మైనస్ పాయింట్స్ :స్లో నెరేషన్నిడివిఅన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంవిశ్లేషణ :లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా చాలావరకు ఆకట్టుకుంది. సమకాలీన హైటెక్ మోసాలను ప్రస్తావిస్తూ..... లవ్ ఎమోషన్స్ ని మిక్స్ చేసి తీసిన ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా, సిట్యువేషనల్ కామెడీ మరియు సీరియస్ క్రైమ్ తో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచదు. కాకపోతే సెకండ్ హాఫ్ ప్రారంభమైన సన్నివేశాలు, క్లైమాక్స్ ఇంకా ఆసక్తికరంగా రాసుకొని ఉంటె సినిమా మరో స్థాయిలో ఉండేది. చివరిగా :ఇందులో జోడి ప్రేక్షకుల మనసుని దోచేస్తుంది.
Please Share this article
Related:
Tagged with: kanulu kanulanu dochayante dulkar salman ritu varma rakshana niranjani goutham vasudevan
నితిన్ ‘చెక్’ ఫస్ట్ డే కలెక్షన్స్
డైరెక్టర్ శంకర్ - చరణ్ కాంబోకు భారీ బడ్జెట్
నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా అర్జున్ కపూర్ - రకుల్ మూవీ
భారీగా రెమ్యునరేషన్ పెంచిన ఉప్పెన బ్యూటీ
కాజల్ డ్రెస్‌పై కామెంట్ చేసిన సామ్
శ్రీ విష్ణు ‘గాలి సంపత్’ ట్రైలర్ వచ్చేసింది
‘చావుకబురు చల్లగా’ నుండి అనసూయ మాస్ సాంగ్ చూసారా
‘ఉప్పెన’ సినిమాలో సుకుమార్ షేర్ ఎంతో తెలుసా ?
కోవిడ్ వారియర్స్ కోసం టాలీవుడ్ హీరోల క్రికెట్
వైష్ణవ్‌తేజ్‌కు, కృతిశెట్టికి ఖరీదైన కానుకలు ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్
హీరో యశ్ గజకేసరి టీజర్ విడుదల
నాగార్జున తో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం
ప్రభాస్ వంద కోట్ల పారితోషికం
షూటింగ్లో నితిన్పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్
తెల్లవారితే గురువారం టీజర్
మార్చిలో నిహారిక తమిళ సినిమా
Read More From This Category