నేను సినిమాని డబ్బు కోసమో, దాన్ని ఒక పనిగా భావించో చేయను. పూర్తిగా ప్యాషన్‌గా ఫీలై చేస్తాను. నచ్చితేనే చేస్తాను' అని అంటున్నారు దర్శకుడు డాలీ. పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్ జంటగా డాలీ దర్శకత్వంలో రూపొందిన 'కాటమరాయుడు' చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో సోమవారం దర్శకుడు డాలీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..ఓపెనింగ్స్ బాగున్నాయి.. శుక్రవారం విడుదలైన సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసి బాగా ఎంజారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటన బావుందని సినిమా చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా లవ్ సీన్స్‌లో పవన్ నటన ఆకట్టుకుంటోంది. అలాగే ఇంతకు ముందు సినిమాల్లో చూడని విధంగా పవన్‌ను చూపించానని చాలా మంది అభినందించారు. పవన్ పిలిచారు.. 'గోపాల గోపాల' సినిమా తర్వాత మనం కలిసి పనిచేద్దామని పవన్ అన్నారు. ఆయన కోసం ఓ కథ రెడీ చేసుకుంటున్నాను. ఆ కథ ఇంకా పూర్తవలేదు. ఈ క్రమంలో ఓ రోజు పవన్ పిలిచి మనం సినిమా చేద్దామని చెప్పారు. 'వీరం' సినిమా చూశా. మంచి లేయర్ ఉంది. పవన్‌లో లవ్ యాంగిల్‌ను ఎలివేట్ చేసి చాలా కాలం అయ్యింది. లవ్ షేడ్స్‌లో మార్పులు చేసి కళ్యాణ్‌కి వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. కథాపరంగా మేజర్ లేయర్ ఉంచి మిగిలినది మార్చాం. ఫస్టాఫ్ వీలైనంతగా మార్చాం. సెకండాఫ్్లోనే కథ ఉంటుంది. ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కథ అనుకున్నప్పుడు లిమిటేషన్స్ ఉండవు. అలా ఉంటే కథ ఆగుతుంది. సినిమాలో ట్విస్టు ఉంటుంది. అది చివర్లో ఉంటే బాగుంటుందని చివర్లో పెట్టాం. అది బాగా వర్కౌట్ అయ్యింది. ట్రయిన్ ఫైట్ విషయంలో కూడా అలాగే చేశాం. ఇది మక్కీకి మక్కీ రీమేక్ కాదు. రీమేక్ అయినా మక్కీకి మక్కీ చేయడమంటే నాకిష్టం ఉండదు. రీమేక్ సినిమాలకు బౌండరీలుంటాయి. మామూలు సినిమాలకు బౌండరీలు ఉండవు. పవన్‌తో చేసిన జర్నీని మరిచిపోలేను. ఆయనతో ఇంకా కలిసి పనిచేయాలనుంది. ఆయనతో మాట్లాడుతుంటే కొత్త విషయాలు చెబుతుంటారు. ఈ సినిమా బెటర్‌గా చేసేందుకు ట్రై చేశాం. ఆయన కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. అయితే కథపై మనకు క్లారిటీ ఉంటే అమితాబ్ బచ్చన్నైనా, పవన్ కళ్యాణ్నైనా సులభంగానే హ్యాండిల్ చేయవచ్చు. ఏ సీన్ ఎలా చేయాలనే దానిపై క్లారిటీ ఉంటే సినిమా సాఫీగా సాగిపోయింది. అయితే దర్శకత్వం విషయంలో ప్రతి డైరెక్టర్ కథని చెప్పే తీరు వేరు వేరుగా ఉంటుంది. నేను నా స్టయిల్లో చెబుతాను. 'వీరం' లైన్ మన లైన్ సేమ్. కానీ దాన్ని చెప్పే తీరులోనే మార్పు ఉంటుంది. ఈ చిత్రం ఇంత బాగా వచ్చిందంటే దానికి మా టీమ్ వర్కే కారణం. పంచెకట్టు ముందే అనుకున్నా.. పవన్‌కి ఇమేజ్ ఎక్కువగా పనిచేస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటికి తీసుకురావాలి. కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోని పంచెకట్టులో చూపిస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఆ విషయం చెప్పినప్పుడు కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు. తొలి రోజు పంచెకట్టులో వచ్చినప్పుడు బాగా వర్కౌట్ అవుతుందనిపించింది. అలాగే పంచెకట్టులోనే ఫైట్ పెట్టాం. దానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆయన పంచెకట్టే సినిమాకి స్పెషల్ ఎట్రాక్షక్ అయ్యింది. ఇమేజ్ ఉన్న హీరోలు ఎలా చేసినా తమ మార్క్ మాత్రం ఎక్కడో చూపించాలి. అమీర్ ఖాన్ 'దంగల్'లో కూడా ఎక్కడో ఒక చోట అమీర్ ఇమేజ్ కనిపిస్తుంది. అలాగే 'సుల్తాన్'లోనైనా సల్మాన్ మీసం తిప్పుతాడు. అలా తిప్పాలి. ఫ్యాన్స్ కూడా అలాంటివే ఎక్కువగా కోరుకుంటారు.
శృతిహాసన్ ని కాస్ట్యూమ్స్ పాటల్లో హాట్‌గా చూపించాలని మేము భావించలేదు. ముంబయికి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ ఆమె కాస్ట్యూమ్స్ రూపొందించారు.
పనిగా భావించను.. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. రోజూ సినిమాలు చూసేవాడిని. ఎన్ని సినిమాలు చూసినా కిక్నిచ్చేవి. అయితే దర్శకత్వం పరంగా సినిమాను నేను డిప్లమాటిక్‌గా చూడను. డబ్బుకోసమో, పని కోసమో సినిమా చేయను. ప్యాషన్‌గా చేస్తాను. ఒక పనిగా సినిమా అనుకుంటే అది ప్యాషన్ అవ్వదు. జెన్యూన్‌గా చేస్తేనే సినిమా అవుతుంది. కథకు కనెక్ట్ అవ్వకపోతే సినిమా చేయలేను. ఒక సినిమా విజయం సాధిస్తే పెద్ద హీరోతో వెంటనే సినిమా చేసేద్దామని నేను ఆలోచించను. నాకు నచ్చి చేయాలి. పైరసీని ప్రోత్సహించకండి.. ఈ సినిమాకు జరిగినంత పైరసీ ఏ సినిమాకు జరిగి ఉండదు. మన ఇండియాలో సినిమా మేజర్ ఎంటర్టైన్మెంట్. అలాంటి రిలాక్సేషన్‌ను పైరసీ ద్వారా చంపకూడదని నా మనవి. థియేటర్లో ఉండే బ్యూటీ పైరసీలో ఉండదు. అందరూ థియేటర్లోనే సినిమా చూడాలని కోరుకుంటున్నా. పైరసీని ప్రోత్సహించకండి.
Please Share this article
Related:
Tagged with:
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
మార్చి 11న మంచు విష్ణు మోసగాళ్లు
క్రాక్’ 13 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి
ప్రామిస్ చేస్తున్న ప్రదీప్ మాచిరాజు
స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
సమంత పాత్రని ఎమోజీగా
రష్మిక కు బిగ్ షాక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు
Read More From This Category