#KrackOnJan9th #KrackUSA premieres on Jan8thCollision @RaviTeja_offl @shrutihaasan @megopichand @MusicThaman @TagoreMadhu #KrackOnJan9th #Raviteja
రాజా ది గ్రేట్’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక సతమతమవుతున్నాడు మాస్ మహా రాజా రవితేజ. 2017లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రవి నాలుగు సినిమాల్లో నటించగా ఇవేవి ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మన దగ్గర వంద శాతం ఆక్యుపెన్సీ అమలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాను. అదే జరిగితే ఇండస్ట్రీకి లాభదాయకంగా ఉంటుంది. థియేటర్లలో సినిమా చూడటానికి వచ్చేవారందరూ జాగ్రత్తల్ని పాటించమని కోరుతున్నా.
యాభై శాతం ఆక్యుపెన్సీకి సంబంధించి నాకు ఎలాంటి భయాలు లేవు. ఈ నిబంధన ఉన్నా సినిమాలు చూడటానికి జనాలు వస్తారనే నమ్మకముంది.
సాధారణ సమయాలతో పోలిస్తే సంక్రాంతి సినిమాలకు మంచి సీజన్‌గా ఉంటుంది. సంక్రాంతికి సినిమాల్ని చూడటానికి అందరూ ఆసక్తిని చూపుతుంటారు. నేను అలా సినిమాల్ని చూసినవాడినే. గతంలో సంక్రాంతి సమయంలో విడుదలైన ఐదారు చిత్రాలు ఆడిన దాఖలాలున్నాయి. మా సినిమా విజయవంతమవుతుందనే నమ్మకముంది. అందుకే పోటీని పట్టించుకోవడం లేదు.
పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అభిమానులకు పరిపూర్ణ విందుభోజనంలా ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. నా శైలి వినోదం మిస్ కాకుండా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోగా నాకు మంచి సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది. గోపీచంద్‌తో నా కలయికలో హ్యాట్రిక్ హిట్ వస్తుందనే విశ్వాసమున్నది. నిజజీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొంది యథార్థ ఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు.
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే. ‘విక్రమార్కుడు’లో విక్రమ్సింగ్రాథోడ్ క్యారెక్టర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ ఎనర్జీ ప్రతి సినిమాలో కనిపించేలా శ్రమిస్తుంటా. అలాగని ‘విక్రమార్కుడు’తో ఈ సినిమాకు ఎలాంటి పోలికలు ఉండవు.
సినిమాల విషయంలో నేను ఎలాంటి లెక్కలు వేసుకోను. కమర్షియల్ సినిమాలే చేయాలి.. ప్రయోగాత్మక కథల్ని ఎంచుకోవాలి అనుకుంటూ సినిమాలు చేయడం నచ్చదు. నాకు నచ్చిందే చేస్తుంటా. ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. సినిమా బాగుంటే అన్ని కలిసొస్తాయి. బాగలేకపోతే ఏదీ వర్కవుట్ కాదు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నేనెప్పుడూ సంతోషంగానే కనిపిస్తా. నా వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు కనిపించదు.
లాక్డౌన్ చాలా అద్భుతంగా గడిచింది. వర్కవుట్స్ చేశాను. సినిమాలు చాలా చూశాను. చూడాల్సిన కంటెంట్ చాలా ఉందని అర్థంచేసుకున్నా. ఐ యామ్ ఏ ఫ్యామిలీమ్యాన్. భార్యాపిల్లలతో సంతోషంగా ఈ విరామ సమయాన్ని ఆస్వాదించా. బోర్‌గా ఫీలయిన క్షణం ఒక్కటి లేదు.
మహాధన్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం చదువుపైనే వాడి దృష్టి ఉంది. అనిల్‌రావిపూడి బలవంతంతోనే ‘రాజా ది గ్రేట్'లో నటించాడు. మళ్లీ సినిమాలు చేసే ఆలోచన మహాధన్‌కు లేదు. భవిష్యత్తులో నటనను కెరీర్‌గా ఎంచుకుంటాడో లేదో తెలియదు. నేను వాడిని బలవంతపెట్టను. పిల్లల అభీష్టానికే అన్నీ వదిలేస్తాను.
మా పిల్లలిద్దరూ నాకంటే చాలా ముదుర్లు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సోషల్‌మీడియాకు సంబంధించి కొత్త విషయాల్ని వారి నుంచి తెలుసుకుంటుంటా.
సలహాలు ఉచితమే కాబట్టి ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ రెడీగా ఉంటారు. మా పిల్లలకు నేను ఎలాంటి సినిమా చేసినా ఇష్టమే. కొన్ని సందర్భాల్లో వారికి నచ్చింది చెబుతుంటారు.
కరోనా ప్రబలకుండా సెట్స్‌లో భద్రతా చర్యల్ని చేపట్టాం. అందువల్లే ఎలాంటి భయాలు లేకుండా షూటింగ్ చేయగలిగాం. మూడు వందల మంది యూనిట్ సభ్యుల మధ్య ఇటీవలే సెట్ సాంగ్‌ను షూట్ చేశాం. కనీస జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అవరోధాల్ని అధిగమిస్తూ సాఫీగా షూటింగ్‌లను చేసుకోవచ్చనే ధైర్యం వచ్చింది. చాలా మంది జాగ్రత్తల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నేను సెట్స్‌లో ఉంటే మాస్క్ ధరించకుండా ఎవరైనా కనిపిస్తే అస్సలు సహించను. మాస్క్ ధరించాల్సిందేనని వారికి చెబుతుంటా. రక్షణ చర్యల విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉంటా.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category