#Krack #aha #ott #Raviteja #HBdRaviteja
క్రాక్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్నది. విడుదలైన వారం రోజుల్లోనే సినిమా దాదాపు 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అది కూడా కేవలం 50 ఆక్యుపెన్సీతోనే. 100 శాతం ఉండుంటే కచ్చితంగా ఇప్పటికే 30 కోట్ల షేర్ దాటిపోయేది. సినిమాలు విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటిటిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకుంటున్నారు . ఈ మేరకు ముందుగానే ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ మధ్య డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. వారం రోజుల తర్వాత అంటే జనవరి 1న ఈ సినిమా ఓటిటిలో విడుదల చేశారు.
జీ స్టూడియోస్ ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగబోతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తుండటంతో ఓటిటిలో కాస్త ఆలస్యంగా రానుంది. ఒకవేళ థియేటర్స్ లో సరైన రెస్పాన్స్ రాకపోయుంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు వారాల్లోనే సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే మంచి వసూళ్లతో దూసుకుపోతుండటంతో మరో రెండు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాను జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఓటిటిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆహా ఓటీటీ సంస్థ ఈ సినిమాను భారీ రేట్ కు సొంతం చేసుకున్నది. దాదాపు 10 కోట్లకు క్రాక్ సినిమా రైట్స్ సొంతం చేసుకుంది ఆహా. అయితే మరీ అంత త్వరగా ఓటిటి విడుదల చేస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు అభిమానులు. కానీ అలాంటిదేం ఉండదని.. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్రాక్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.
Please Share this article
Related:
Tagged with: 26
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category