#Krithishetty #Ramcharan తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. గతేడాది ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. నాని శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస విజయాలు అందుకొంది. దాంతో కృతి శెట్టి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ఈమె కోసం నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ కస్తూరి.
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్.. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తోంది కృతి శెట్టి. ఇక ఇప్పుడు ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈమె ఓకే చేసే పనిలో పడింది. మరీ ముఖ్యంగా ఈమెకు ఇష్టమైన హీరోతో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లో కృతి శెట్టి మనసు దోచిన ఆ హీరో ఎవరో కాదు.. రామ్ చరణ్. ఉప్పెన సినిమా సమయంలోనే ఈ విషయం గురించి ఓపెన్ అయింది కృతి శెట్టి.తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అప్పట్లో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా కృతి శెట్టి పేరు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు వర్క్ అవుట్ అయింది అంటే కృతి రేంజ్ మారిపోవడం ఖాయం. బిగ్ లీగ్‌లోకి ఎంట్రీ ఈజీగా దొరికినట్లే. మరోవైపు మెగా కాంపౌండ్‌లోకి ఒకసారి వస్తే అవకాశాలు కూడా వాటంతట అవే వస్తాయి. మొత్తానికి ఉప్పెన హీరోయిన్ కెరీర్ ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతుంది
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
హనీమూన్ అయిపోయింది షూటింగ్‌లకు నయనతార
ఆహాలో సమ్మతమే రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?
వెంకటేశ్‌తో ప్రియాంక జవాల్కర్ డేటింగ్‌పై ఫుల్ క్లారిటీ
ఆ యాంకర్ వెంట పడుతోన్న అరియానా
రిటైర్మెంట్ ప్రకటించిన నాజర్
భార్యకి ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు
పెళ్లైన రెండు నెలలుకే అలియా కి మూడో నెల-ఆడు మగాడ్రా బుజ్జీ !!
ప్రతి అడుగులో అతనే -అవికా గోర్!
కేతిక శర్మ-చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు- టీజర్ టాక్
నీ చారెడు కళ్లే అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
విజయ్ కనకమేడలతో అల్లరి నరేష్ మూవీ!
ఎన్టీఆర్ ను ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా
ఆ వంకాయను చూస్తే శ్రీదేవి బుగ్గల్లా కనిపించట్లేదా-చిరు
సమంత బాటలోనే నిహారిక
శ్రావణభార్గవి-హేమచంద్ర మధ్య చిచ్చు పెట్టిన ఆ స్టార్ సింగర్ ఎవరు ?
రామ్ పోతినేనిపెళ్లికి ముహూర్తం ఫిక్స్ అమ్మాయి ఎవరంటే?
Read More From This Category