#getwellsoonmaheshbabuanna #MaheshBabu ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏదైన గ్రహణం పట్టిందా అనే అనుమానం కలుగుతుంది.ఒకవైపు లెజండరీ నటులు అనారోగ్యంతో మరణిస్తుంటే మరోవైపు హీరోలు పలు సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం తర్వాత అడివి శేష్, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా పలువురు స్టార్స్ ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారనే వార్త ఆందోళన కలిగిస్తుంది.
సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మహేష్ మోకాలికి మైనర్ గాయం అయినట్టు తెలుస్తుండగా, దీనిపై మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.
దీంతో మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదని తెలుస్తుంది. సంక్రాంతికి రావలసిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ వలన ఏప్రిల్‌కి వెళ్లింది. ఇప్పుడు ఈ పరిస్థితులలో మళ్లీ చిత్ర విడుదల తేది మారుస్తారా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఇక మహేష్ బాబుకి సర్జరీ అని తెలిసి ఆయన అభిమానులు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ లో #getwellsoonmaheshbabuanna అనే హాష్ స్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category