#Nazar తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలో విలన్ గా, ఫాదర్ గా అనేక పాత్రలు పోషించి మెప్పించారు. తమిళం, తెలుగు, కన్నడం, మళయాల, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ్ లో దాదాపు హీరోలందరితో నటించారు. ప్రత్యేకంగా తెలుగు, తమిళ సినిమాలతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ సినీ అగ్ర శ్రేణి నటుల్లో నాజర్ కూడా ఒకరు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాల్లో నాజర్ అనేక విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు. ఆయన ఎన్నో సినిమాలకు ఉత్తమ నటుడిగా కూడా అనేక అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం నాజర్ తమి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
కాగా నాజర్ సినిమాల్లోకి రాకముందు కోరమాండల్ హోటల్లో కేటరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారట. కొన్ని కథలు, కవితలను మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ల కోసం రాసే వారు. కాగా 1985లో నాజర్ సినీ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు ఆయన దక్షిణాది, ఉత్తరాది కలిసి 300 సినిమాలకు పైగా నటించారు. తమిళంలో ప్రముఖ దర్శకులతో పనిచేశారు. అలాగే పలు సినిమాలూ నిర్మించారు. ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో బిజ్జల దేవుడిగా.. భల్లాల దేవుడి తండ్రిగా కనబర్చిన నటన అద్బుతమని చెప్పవచ్చు.
నాజర్ సినీ ప్రయాణం ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణ్ అగతికల్ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన వేలైకారన్ సినిమా నాజర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన నాయకన్.. తెలుగులోనాయకుడుగా వచ్చిన సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈయన నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.
సడెన్ గా నిర్ణయం..
అయితే ప్రస్తుతం నాజర్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నాజర్ కంటే వయసులో పెద్దవాళ్లు కూడా ఇంకా యాక్టివ్ గా నటిస్తుంటే నాజర్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారనడంతో ఆశ్చర్యపోతున్నారు. నాజర్ ఆయన సినిమాలకు రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు తీసుకుంటారని సమాచారం. అయితే ఇప్పుడు సడెన్ గా సినిమాల నుంచి తప్పుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్న చర్చ మొదలైంది.
అయితే కరోనా పాండమిక్ లో నాజర్ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడ్డారు. అప్పటి నుంచి ఆయన సినిమాలు కూడా తగ్గిస్తూ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి రెస్ట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రీసెంట్గా ఆచార్య సెట్లో నాజర్ చిరంజీవితో మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఇది తన చివరి మజిలీ అన్నారని సమాచారం. అలాగే పలు ఇంటర్వ్యూల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు నాజర్. సినిమాలపై ఆసక్తి ఉన్నా హెల్త్ పరంగా సహకరించడం లేదని చెప్పారట. అయితే ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సినిమాలు పూర్తి చేసి ఇక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండనున్నారని అంటున్నారు
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
పెద్దవి చూస్తే నోరూరుతుందా అంటూ!- శ్రీరెడ్డి
కమల్ హాసన్‌తో సిమ్రాన్ బ్రేకప్ వెనక ఎవరో తెలుసా ?
శ్రీముఖికీ అది వేసుకునే అలవాటు లేదా?
కృతి స్పీడుకి బ్రేకులు పడ్డట్లే
బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న 'కార్తికేయ-2'
కేటీఆర్ ట్వీట్‌కు అనసూయ రిప్లై రాజకీయం చేయవద్దంటూ రిక్వెస్ట్
కృష్ణమ్మ-ఫస్ట్ సింగిల్ విడుదల
టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట
వాంటెడ్ పండుగాడ్ రివ్యూ-తట్టుకుంటే కోటి
తీస్ మార్ ఖాన్ రివ్యూ
మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు!?
‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ భారీ షాక్
చార్మీ కెరీర్ లో ఇన్ని కోట్లు సంపాదించిందా!
జబర్దస్త్ లో ఈ బూతు డైలాగులేంట్రా బాబు
ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి అప్పుడే వర్క్ అవుట్ అవుతుంది-అనసూయ
కార్తీకేయ 2కు దిమ్మతిరిగిపోయే లాభాలు
Read More From This Category