వరుస ఫ్లాపుల తర్వాత తననుతానూ ప్రూవ్ చేసుకోవాలనే గట్టి ప్రయత్నంలో విజయం సాధించి స్టార్ హీరోగా నిలబడ్డాడు నితిన్ ఈ హాట్రిక్ హిట్స్ తర్వాత నితిన్ నటించిన చిత్రం ‘చిన్నదాన నీకోసం’. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మిస్ర్తి చక్రవర్తి హీరోయిన్గా పరిచయం అవుతుంది. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా నితిన్‌తో ఇంటర్వ్యూ
కరుణాకరన్ స్టైల్లో.. ప్రేమకథలు తీయడంలో కరుణాకరన్ శైలే వేరు. ఆయన శైలిలో సాగిపోయే ఓ అందమైన ప్రేమకథే ‘చిన్నదాన నీకోసం.’ కుటుంబ బంధాలకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో నేను పవన్‌కళ్యాణ్ అభిమానిని. పేరు నితినే. క్లైమాక్స్‌లో మాత్రం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. నా మొదటి సినిమానుండి కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకునేవాడిని. 20 సినిమాల తర్వాత కుదిరింది. ఇప్పుడు చాలా సంతోషంగా వుంది.
అఖిల్ సినిమా... వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అఖిల్ అనుకున్నాడు. తను నాకు మంచి ఫ్రెండ్. మొదట మేము వినాయక్గారిని అప్రోచ్ అయ్యాం. మంచి కథతో నాగార్జునగారిని కలిశాం. కథ నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. నాగార్జున, నాన్న మంచి స్నేహితులు. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం మా శ్రేష్ఠ మూవీస్‌కి లభించింది. నిజంగా అదృష్టం. వినాయక్, డైరెక్టర్,అఖిల్ హీరో కాంబినేషన్లో సినిమా అంటే డెఫినెట్ ఒక మార్కెట్ వుంటుంది. దానికి తగిన బడ్జెట్లోనే ఆ సినిమా చెయ్యడం జరుగుతుంది. మా హీరో అఖిల్‌కి ఎంత నాలెడ్జ్ వుందంటే తన ఫస్ట్ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, బడ్జెట్లోనే చెయ్యమని చెప్తున్నాడు. కావాలంటే వేరే విషయాల్లో కాంప్రమైజ్ అవుదాం అని ఖరాఖండిగా చెప్తున్నాడు.
నాకోసమే ఈ బ్యానర్... వరుస సినిమాలు పోవడంతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే సొంత బ్యానర్లో సినిమాలు చేస్తున్నా. వరుస ఈ బ్యానర్లోనే సినిమాలు చేయను. ఇప్పటికే ‘హార్ట్ఎటాక్’, ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ సినిమాలు బయటి నిర్మాణ సంస్థలలో చేసినవే. మంచి ప్రొడక్షన్ హౌస్‌లో అవకాశంవస్తే తప్పకుండా నటిస్తాను. హోం బ్యానర్లో సినిమా చేయడం వలన బడ్జెట్, స్క్రిప్ట్ విషయాలలో జాగ్రత్తవహించడానికి ఆస్కారం ఉంటుంది. సినిమాను హీరో మార్కెట్‌నుబట్టి ఆ పరిధిలో తీయడం ముఖ్యం. మనతో సినిమా తీసిన నిర్మాతకు లాభాలు రావడం కూడా ముఖ్యమే. నిర్మాత లేకపోతే సినిమా లేదు.
వరుస అపజయాల తరువాత... 12 ప్లాపుల తర్వాత కథ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని నిర్ణయంచుకున్నా. కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఉన్నా, కథ చెప్పిన తర్వాతే సినిమా స్టార్ట్‌చేశాం. కథ, స్క్రిప్ట్, బడ్జెట్ ఇలా అన్నీ ఓకే అనుకున్న తర్వాత సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చా. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా.
హీరోయిన్ మంచి మార్కులు కొట్టేస్తుంది... ఈ కథ ప్రకారం కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించాం. తర్వాత కరుణాకరన్ మిస్ర్తి చక్రవర్తిని సెలెక్ట్ చేశారు. హిందీలో సుభాష్ఘై ‘కాంచి’లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో బాగా చేసింది. సాధారణంగా కరుణాకరన్, తన ప్రతి సినిమాలో హీరోయిన్లను అందంగా చూపిస్తారు. మిస్ర్తిని కూడా బ్యూటిఫుల్‌గా ప్రజెంట్ చేశారు.
మాది క్రేజీ కాంబినేషన్.. - మూడు సినిమాలు చేసిన తర్వాత నాలుగో సినిమా కూడా అనూప్తోనే చేస్తే మొనాటనీ వచ్చేస్తుందేమో అన్నాను. కానీ, డైరెక్టర్‌గారు మాత్రం అనూప్ స్టైల్ నాకు ఇష్టం. అతనితో నేను చేయించుకుంటాను అని చెప్పారు. తను చెప్పినట్టుగానే మంచి మ్యూజిక్ చేయించుకున్నారు. ఆ మూడు సినిమాల మ్యూజిక్‌కి సంబంధం లేకుండా అనూప్ చాలా డిఫరెంట్‌గా ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు.
తరువాతి చిత్రాలు... ఇప్పటికే నేను నటించిన ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ త్వరలోనే ఉంటుంది. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం సాధిస్తుందనే నమ్మకముంది. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రేమకథలకు పూర్తి భిన్నమైన సినిమా. ఒక డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతుంది. తెలుగువెర్షన్కి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇంకా వేరే సినిమాలు ఏవీ కమిట్ అవ్వలేదు.
పెళ్ళి గురించి... త్వరలోనే చేసుకుంటాను. అప్పుడు తప్పకుండా తెలియచేస్తా.
Please Share this article
Related:
Tagged with: nitininterview
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
మార్చి 11న మంచు విష్ణు మోసగాళ్లు
క్రాక్’ 13 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి
ప్రామిస్ చేస్తున్న ప్రదీప్ మాచిరాజు
స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
సమంత పాత్రని ఎమోజీగా
రష్మిక కు బిగ్ షాక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు
Read More From This Category