పౌరాణికాలు, సాంఘీకాలు, జానపద చిత్రాలు ఇలా సినిమా, పాత్ర ఏదైనా అవలీలగా చేయగలిగే నటధీశాలి ఎన్టీఆర్. తెలుగు సినిమాకు అర్థం చెప్పిన నటులు ఎన్టీఆర్. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది ఆయనే. ఒక రాముడిగా, కృష్ణుడిగా, భీముడిగా, కర్ణుడిగా ఇలా మేటి పాత్రలకు ఆయన రూపమే కనిపిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమను దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నడిపించి, ముందు తరాలకు దారి చూపిన ఎన్టీఆర్ వర్థంతి నేడు(జనవరి 18). 400పైగా చిత్రాల్లో నటించిన ఆయన సినిమాల్లో కొన్ని మచ్చుతునకల గురించి క్లుప్తంగా..
ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన సినిమా 'మాయా బజార్'. 1957లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడు పాత్రలో జీవించారు. అభిమాన్యుడిగా ఏఎన్నార్, శశిరేఖగా సావిత్రి, ఘటోత్కచుడిగా ఎస్వీరంగారావు వంటి మహానటులు ప్రధాన పాత్రలో నటించారు. అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనంగా నిలిచిపోయిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్గ్రీన్ చిత్రంగా నిలిచింది. ఎన్టీర్ నటవిశ్వరూపానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలై 58 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు ఇటీవల ఈ సినిమాను కలర్‌గా మార్చి విడుదల చేశారు. అప్పుడూ మంచి స్పందన వచ్చింది. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టించింది. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించగా.. పింగళి నాగేంద్రరావు రచన అందించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావులతో కూడిన సంగీతం స్వరాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మహా భారతంలో జరగని ఓ కల్పిత గాథ ఆధారంగా రూపొందించారు. దుర్యోధనుని కుమారుడైన లక్షణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం. కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించడం మొత్తం సినిమా.
రామాయణ ఉత్తరకాండం ఈ సినిమా కథాంశం. తెలుగులో మొదటి సారి పూర్తి నిడివి కలర్‌తో రూపొందించిన చిత్రంగా ఇది చరిత్రకెక్కుతుంది. సి పుల్లయ్య, సిఎస్ రావు సంయుక్త దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఓ యజ్ఞంలా తెరకెక్కించారు. లవకుశలపై ప్రధానంగా సాగే ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటించారు. రాముడంటే ఇలానే ఉంటాడని చూపించిన ఈ సినిమా పౌరాణిక చిత్రంగా ఘన విజయం సాధించింది. సీత పాత్రలో అంజలీదేవి, వాల్మీకి పాత్రలో చిత్తూరు నాగయ్య, లక్ష్మణుడిగా కాంతారావు నటించారు. మొదట ఈ చిత్రాన్ని 1934లో తీసి విడుదల చేశారు. అప్పు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1963లో మరోసారి కలర్లో తీసి కథలో కొన్ని మార్పులు చేసి విడుదల చేశారు. అప్పుడూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడలో ఒకేసారి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన హావభావాలతో రాముని పాత్రలో ఉదాతంగా నటించారు.
విజయాసంస్థ నిర్మించిన చిత్రాలలో ఆఖరి విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం. కాని గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. ఇందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్ తన నట విశ్వరూపం చూపించారు. వీరికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు రచన, బినాగిరెడ్డి, చక్రపాణి నిర్మాణం తోడవ్వడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. పౌరాణిక చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎన్టీఆర్ ఇలాంటి కుటుంబాకథా చిత్రాల్లోనూ తన సత్తా చాటుతాడని నిరూపించారు.
మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమైన సినిమా 'నర్తనశాల'. 1963లో విడుదలైన ఈ సినిమా పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను చాటింది. రాష్ట్రపతి అవార్డులు, విదేశాల్లోనూ పలు బహుమతులు గెలుచుకుంది. ఇందులో ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహన్నలగా నటించారు. ఆయన నటన సినిమాను నడిపించింది. బృహన్నలగా ఆయన ప్రేక్షకులను మైమరపించారు. మరపురాని మహోన్నతమైన నటనాని ఎన్టీఆర్ ప్రదర్శించారు.
ఎన్టీఆర్ నటనలోంచి వచ్చిన పౌరాణిక చిత్ర రాజం 'దాన వీర శూర కర్ణ'. 1977లో విడుదలైన ఈ చిత్రం ఎన్నో సంచనలనాలను సృష్టించింది. కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మూడు ప్రధాన పాత్రల్లో నటించి తనకు తానే సాటి అని చాటుకున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్, కొండవీటి వెంకట కవి కలసి తీశారు. కేవలం పది లక్షలతో రూపొందించిన ఈ చిత్రం దాదాపు కోటికిపైగా వసూలు చేసి సంచలనాలు సృష్టించింది. అంతేకాదు 1994లో మరోసారి విడుదల చేశారు. అప్పుడు కూడా కోటిరూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. ఇందులో విశేషమేమంటే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించడమే కాకుండా.. దర్శకత్వం, నిర్మాణ పాత్రలు కూడా నిర్వహించారు. మహాభారతం నుంచి తీసుకున్న ఈ కథాంశానికి ఎన్టీఆర్ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రానికి రూపం ఇచ్చారు. పాత్రల్లో జీవించి ప్రేక్షకులకు అమితానందాన్ని అందించారు. ఇక ఈ చిత్రంలో అభిమాన్యుగా బాలకృష్ణ నటించారు. రీ చిత్రంలో ఎన్టీఆర్ నటన ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. ఒక సినిమాకు అన్నీ తానై నడిపించిన ఏకైక నటుడు కూడా ఎన్టీఆర్ అనే చెప్పవచ్చు.
Please Share this article
Related:
Tagged with: ntrvardantispecial
నేను మా ఇంట్లో ఎలా ఉంటానో -కల్యాణ్‌రామ్ ఇంటర్వ్యూ
ఊరంతా ఏమనుకుంటున్నారు?- శ్రీనివాస్ అవసరాల
చరణ్ చేయకపోతే నేనే చేస్తా - వరుణ్ తేజ్
అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టా
స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా-లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
సంపూర్నేష్‌బాబు ఇంటర్వ్యూ
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ జోడి బాగాలేదా ? డాలీ ఇంటర్వ్యూ
ఎన్ని సినిమాలైనా ఆడతాయి-శర్వానంద్ ముచ్చట్లు
ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ -చిరంజీవి ఇంటర్వ్యూ హైలైట్స్
ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే
అదే జనాలను కూర్చోపెడుతుంది-చరణ్ ఇంటర్వ్యూ
విలన్‌గా నటించాలనే నా కోరిక తీరిపోయింది
నా దగ్గర పదేండ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయి-పూరీ ఇంటర్వ్యూ
త్వరలోనే నిర్మాతగా
మెచ్చ్యూరిటీ పెరిగిందిరామ్ ఇంటర్వ్యూ
Read More From This Category