సినిమా : పహిల్వాన్ రేటింగ్ : 2.5/5నిర్మాణ సంస్థ : జీ స్టూడియోస్, ఆర్.ఆర్.ఆర్ మోషన్ పిక్చర్స్, వారాహి చలనచిత్రం నిర్మాత : స్వప్న కృష్ణ సంగీతం : అర్జున్ జన్వా దర్శకత్వం : ఎస్.కృష్ణ నటీనటులు : సుదీప్, ఆకాంక్ష సింగ్, సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, అవినాష్
కన్నడలో స్టార్ హోదా దక్కించుకున్న నటుడు సుదీప్. తెలుగులో కూడా ఈ హీరోకి మంచి పేరుంది. ముఖ్యంగా ఈగ లాంటి సినిమాలతో ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలను కన్నడలో రీమేక్ చేసి అక్కడ మాస్ కి మరింత దగ్గరయ్యాడు. సుదీప్ ఇమేజ్ కి తగ్గ కథతో పహిల్వాన్ తెరకెక్కింది. అది తెలుగులోనూ విడుదల అయ్యింది. మరి సుదీప్ పహిల్వాన్ గా ఎంతవరకు మెప్పించాడు? తెలుగులోనూ సుదీప్ హిట్ దక్కిందా? అనేది ఈ రివ్యూ లో చూద్దాం.
చిత్ర కథ :కిచ్చ సుదీప్ ఓ అనాధ. అతడిని కుస్తీ పహిల్వాన్ సునీల్ శెట్టి చేరదీస్తాడు. చిన్నతనం నుంచి తన దగ్గరే ఉంచుకొని పెంచి పెద్ద చేస్తాడు. సుదీప్ చిన్నప్పటి నుంచి కుస్తీ వాతావరణంలో పెరగడం వలన గురువు దగ్గర ఆ విద్యను నేర్చుకుంటాడు. కుస్తీ పోటీల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో సుదీప్ కు ఆకాంక్ష సింగ్ కనిపిస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడుతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ కుస్తీని నిర్లక్ష్యం చేస్తాడు. విషయం తెలిసిన సునీల్ శెట్టి మందలించినా వినడు. ఆకాంక్ష సింగ్ ను వివాహం చేసుకుంటాడు. గురువు సునీల్ శెట్టికి ఇది నచ్చదు. దాంతో తన దగ్గర నేర్చుకున్న కుస్తీని ఎక్కడ ప్రదర్శించవద్దని చెప్పి, సుదీప్ ను ఇంటి నుంచి పంపించేస్తాడు. గురువు ఆజ్ఞను జవదాటని సుదీప్ అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తాడు. ఆ తర్వాత ఎలా బాక్సర్ గా మారాడు.... తిరిగి గురువు సునీల్ శెట్టిని ఎలా కలిశాడు అనేది సినిమా కథ. నటీనటుల ప్రతిభ :సుదీప్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశారు ఈ సినిమాలో. అందుకు తగ్గట్లుగానే సుదీప్ కూడా ఆ పాత్రలో రెచ్చిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. మేకోవర్ కూడా నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ లో మరింత ఈజ్ చూపించాడు. గురువుగా సునీల్ శెట్టిని తీసుకోవడం కలసివచ్చింది. ఆ పాత్రలో ఓ కొత్త నటుడిని చూసే అవకాశం దక్షిణాది ప్రేక్షకులకు దక్కింది. ఆకాంక్ష సింగ్ పాత్ర మరి అంత ప్రభావవంతంగా ఏమి లేదు. కబీర్ విలనిజం రొటీన్ గా ఉన్నది. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక నైపుణ్యం :పహిల్వాన్ కథను ఎంచుకొని, దానికి సుదీప్ ను హీరోగా తీసుకొని మంచి పని చేశాడు దర్శకుడు కృష్ణ. అయితే, కథను నడిపించే విషయంలో అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో జానీ సినిమాలో లాగ సెంటిమెంట్ ఎక్కువైంది. ఇదే సినిమాకు డ్రా బ్యాక్ అయ్యింది. అర్జున్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కరుణాకర సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్:సుదీప్ యాక్షన్ సన్నివేశాలు సాంకేతిక విలువలు మైనస్ పాయింట్స్ :రొటీన్ కథ, కథనం భారంగా సాగె ద్వితీయార్ధంవిశ్లేషణ :భారీ అంచనాలతో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో స్పోర్ట్స్ కి సంబందించిన స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సిక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. అయితే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడం, దర్శకుడు తీసుకున్న ఎమోషనల్ కంటెంట్ ను స్క్రీన్ పై ఆసక్తి కలిగించేలా ఎలివేట్ చేయలేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో సరైన ఫ్లో మిస్ అవ్వడంతో వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీస్తాయి. చివరిగా : పహిల్వాన్ ఇంకాస్త బలంగా ఉంటె బాగుండు.
Please Share this article
Related:
Tagged with: sudheep pahilvan
వంశీ పైడిపల్లితో మహేష్ తదుపరి సినిమా
రానా స్టార్ కాదు: శ్రీయ
వన్ డే టీచర్ గా నిధి అగర్వాల్
జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
త్రివిక్రమ్ వలన ఇబ్బంది పడుతున్నాడట
దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై చిత్ర పరిశ్రమ స్పందన
బిజీగా ఉన్న అల్లు బ్రదర్
ఈ అమ్మడు చాలా హాట్ గురూ
శేఖర్ కమ్ముల రూట్ మార్చాడా?
అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు
కమిట్ అయ్యాను కాబట్టి వదిలిపెట్టను: రష్మిక
విజిల్ రిలీజ్ ఆపేసిన కోర్టు
సెక్సీయెస్ట్ ఏషియన్ మేల్ 2019 గా హ్రితిక్
అమితాబ్ ని వెంటాడుతున్న అలనాటి వ్యాఖ్యలు
రూట్ మార్చిన నాని
షకీలా సినిమాకు సెన్సార్ సమస్యలు
Read More From This Category