సినిమా : పలాస 1978రేటింగ్ : 2.75/5నిర్మాణ సంస్థ : సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత: ధ్యాన్ అట్లూరి సంగీతం : రఘు కుంచె దర్శకత్వం : కరుణ కుమార్ నటీనటులు : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్, శృతి, జగదీశ్, రఘు కుంచె తదితరులు సినిమాలు వినోదం పంచడమే కాదు, అప్పుడప్పుడు సినిమాల ద్వారా సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ప్రేక్షకులకు సుతిమెత్తగా ఒక పాఠం చెప్పాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కొంతమంది దర్శకులు అటువంటివి తెరకెక్కించడంలో కొంత విఫలమవుతారు. చాలామంది దర్శకులు మాత్రం తెలివిగా తాము చెప్పాలనుకున్న విషయాన్నీ సగటు ప్రేక్షకుడు ఆస్వాదించేలా వినోదాన్ని మేళవించి చెబుతుంటారు. పలాస 1978 సినిమా కూడా ఈ కోవకే చెందిన సినిమానే. మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. సినిమా కథ : 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అప్పటి రాజకీయ నాయకులూ ప్రజలను ఉన్నత కులాలు, తక్కువ కులాలు అని వేరు చేస్తుంటారు. పలాస ఊరి షావుకారు(జన్ని) అతని తమ్ముడు గురుమూర్తి (రఘు కుంచె) ఊరికి పెద్దలుగా వ్యవహరిస్తుంటారు. అన్నదమ్ములైనప్పటికీ వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటారు.
వీరి కనుసన్నల్లోనే ఊరు ఉంటుంది. వీరు అక్కడి ప్రజలపై తమ ఆధిపత్యం చూపిస్తుంటారు. చిన్న కులాలు అంటూ కొంతమందిని తక్కువగా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవుడు ముందు గజ్జకట్టి ఆడే కులానికి చెందిన యువకుడు మోహనరావు(రక్షిత్) తన వాడకు చెందిన అమ్మాయి(నక్షత్ర)ను ప్రేమిస్తాడు. మోహన్ రావు అన్నయ్య రంగారావు (తిరువీర్) ఊరి పెద్దలు చేసే అన్యాయానికి ఎదురు తిరుగుతారు.
అన్నయ్య పెద్ద షావుకారుని ఎదిరించిన అన్నదమ్ములను చిన్న షావుకారు గురుమూర్తి చేరదీస్తాడు. క్రమంగా రంగారావు, మోహన్ రావు మధ్య మనస్పర్థలు వస్తాయి. దాంతో రంగారావు మళ్ళీ షావుకారు దగ్గరకు వెళ్ళిపోతాడు. వారి మధ్య మనస్పర్థలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి. అన్నదమ్ములను ఎవరు చంపాలని అనుకుంటారు? అన్నదమ్ములు ఒక్కటయ్యారా? తమ పోరాటంలో విజయం సాధించారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటుల ప్రతిభ :దాదాపు అంతా కొత్తవారే. పెద్దగా పరిచయం లేని పేర్లు. ఈ సినిమాలో రంగారావు, మోహన్ రావు పాత్రలు ప్రధానమైనవి. ఈ రెండు పాత్రలకు తిరువీర్, రక్షిత్ లు న్యాయం చేశారు. ముఖ్యంగా రక్షిత్ అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించాడు. బాధ, కోపం, ప్రేమ ఇలా అన్ని భావాలను చక్కగా పలికించాడు. యాక్షన్ సీన్స్ లో కూడా దుమ్మురేపాడు. అయితే నటుడిగా ఇంకాస్త మెరుగుపడాలి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత లేదు. అయితే ఉన్న కొన్ని సీన్స్ లో అయినా నక్షత్ర ఆకట్టుకుంది. నేచురల్ గా, అందంగా కనిపిస్తుంది. నెగిటివ్ రోల్ లో కనిపించిన రఘు కుంచె పలు సన్నివేశాల్లో రావు రమేష్ ను తలపిస్తాడు. తన అనుభవంతో గురుమూర్తి పాత్రలో ఒదిగిపోయాడు. లక్ష్మణ్, తిరువీర్ లు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మిగిలినవారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. సాంకేతిక నైపుణ్యం :రఘు కుంచె సంగీత దర్శకుడిగానూ తన పనితనం చూపించాడు. శ్రీకాకుళం నేటివిటీ అడ్డం పెట్టె పాత కాలం నాటి జానపదాలు.... సినిమా మూడ్ కు తగ్గ నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఒకప్పటి శ్రీకాకుళం వాతావరణం చూపించడంలో విన్సేంట్ అరుళ్ ఛాయాగ్రహణం, ఆర్ట్ డైరెక్టర్ పనితనం మెప్పించాయి. నిర్మాత కూడా అభినందించాలి.
దర్శకుడు కరుణ కుమార్ తోలి ప్రయత్నంలో పలాస లాంటి సినిమాను ఎంచుకోవడం గొప్ప విషయం. నేటివిటీ పై అతడి పట్టు.....డీటైలింగ్ఆకట్టుకుంటాయి . సన్నివేశాలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో అతడి ప్రతిభ కూడా మెప్పిస్తుంది. కానీ, కథాకథనాల విషయంలో అతను మరింత కసరత్తు చేయాల్సింది. ప్లస్ పాయింట్స్ : కథ, కథనంనటీనటులు సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నరేషన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం యాక్షన్ ఘట్టాల మోతాదు విశ్లేషణ : రెగ్యులర్ సినిమాల పరంపరలో నలిగిపోతున్న ప్రేక్షకులకు చాలా రోజుల తర్వాత అర్ధవంతమైన కంటెంట్ తో, విలువైన మెసేజ్ తో పాటు సహజమైన పాత్రలు, ఆ పాత్రల తాలూకు బలమైన సంఘర్షణలతో మరియు సున్నితమైన భావోద్వేగాలతో సాగే ఈ సినిమా.... కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, మోటివ్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సిందనే ఫీలింగ్ కలగడం, అందరు నూతన నటీనటులతోనే సినిమా తెరకెక్కించడం వంటి అంశాలు సినిమాలకు మైనస్ గా మారింది. అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఓ ప్రాంతంలో జరిగిన ఈ సినిమా ప్రత్యేక ముద్ర వేసుకుంది. మంచి సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు, ఈ సినిమా మంచి ఛాయస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిగా : పలాస 1978 ఓకే అనిపించే యాక్షన్ డ్రామా.
Please Share this article
Related:
కబాలి సీన్స్ లీక్
ఎన్టీఆర్ నిజాయితీకి షాక్ అవ్వాల్సిందే
చిరు చిత్రానికి చెర్రీ సమస్య అయ్యాడు
కార్తీకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట
నాగ్ మాయాబజార్ ని ఓపెన్ చేసిన దర్శకేంద్రుడు
Tagged with: palasa movie rakshith nakshatra raghu kunche tiruvur janardhan lakshman shruthi jagadeesh raghu kunche
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
మార్చి 11న మంచు విష్ణు మోసగాళ్లు
క్రాక్’ 13 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి
ప్రామిస్ చేస్తున్న ప్రదీప్ మాచిరాజు
స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
సమంత పాత్రని ఎమోజీగా
రష్మిక కు బిగ్ షాక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు
Read More From This Category