#Prabhas #Yash #PrashanthNeel
#Salaar #SalaarSagaBegins
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ''సలార్'' సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ అతిథిగా హాజరయ్యారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఒకే చోట కనిపించిన 'సలార్' ప్రారంభోత్సవ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేస్తూ.. ''నాకు అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ గారికి ప్రభాస్ గారికి ధన్యవాదాలు. అలాగే నా ప్రియమైన రాకింగ్ స్టార్ యష్ ఈరోజు మాతో కలవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమ ఆశీర్వాదాలు అందిస్తున్న అందరికీ థాంక్స్. 'సలార్' మిమ్మల్ని నిరాశపరచదు'' అని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి చివరి వారం నుంచి జరుపుకోనుంది. ఇప్పటికే 'రాధేశ్యామ్' చిత్రీకరణ చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. 'సలార్' చిత్రాన్ని కూడా ఇదే ఏడాదిపూర్తి చేస్తాడని తెలుస్తోంది.
Finally #Prabhas arrived to pooja ceremony 🤩🤩🤩#SalaarSagaBegins || #Prabhas pic.twitter.com/MtpAoi1Sb7 — Prabhas (@ActorRebelstar) January 15, 2021
Finally #Prabhas arrived to pooja ceremony 🤩🤩🤩#SalaarSagaBegins || #Prabhas pic.twitter.com/MtpAoi1Sb7
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category