#KrackMovieREview #Krack #Raviteja #Shurtihasan
రవితేజకు పోలీస్ కథలు చేసిన ప్రతీసారీ హిట్టు దక్కించుకుంటూనే ఉన్నాడు. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్ రాజా..ఆ తర్వాత బలుపులోనూ మరోసారి పోలీస్ గా దుమ్ము రేపారు. ఇదిగో ఇప్పుడు క్రాక్ సినిమాతో పోతరాజు వీర శంకర్‌గా పోలీస్ అవతారం ఎత్తాడు.వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ పోలీస్ డ్రస్ తో ఒడ్డున పడదాముకున్నాడు. ఈ సినిమాతో హిట్టు పడితే… తన కెరీర్ మళ్లీ గాడిన పడుతుందన్న ఆశగా ఉన్నాడు. దానికి తోడు `క్రాక్` ట్రైలర్ చూస్తూంటే మంచి కమర్షియల్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా అనిపించింది. పాటలూ మాస్ కి బాగా ఎక్కాయి. అన్నిటికన్నా ముందు కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న మాస్ సినిమా ఇదే. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినీ పందెం కోడి..ఏ మేరకు అభిమానులను అలరించింది. హిట్ టాక్ తో దూసుకుపోతుందా. రవితేజం మళ్లీ గత వైభవం తెచ్చుకోగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ:
వీరశంకర్ పోతురాజు(రవితేజ) ఓ పవర్ఫుల్ సిఐ. తన కంట్రోల్ లో ఉన్న ఏరియాలో ఎవడు ఏ తప్పు చేసినా వాడి తాట తీస్తాడు. అలాగే ఎవడైనా ‘బ్యాక్ గ్రౌండ్’ అనే మాట వాడితో కంట్రోల్ తప్పుతాడు, అవతల వాడు ఎంత వాడైనా వాడి గూబ పగిలిపోద్ది. అలాంటి శంకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీంని పట్టుకున్నాడని కడపకి షిఫ్ట్ చేస్తారు. ఆ టైములో కడపలో ఓ చిన్న క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యున్న కొండారెడ్డి(రవి శంకర్)కి ఎస్.పి వార్నింగ్ ఇస్తాడు. వచ్చే వాడు పెద్ద క్రాక్ గాడు, వాడి గురించి తెలియాలంటే రాజమండ్రి జైల్లో ఒకడున్నాడు వెళ్లి కలవు అనగానే.. వెళ్లి జైల్లో ఉన్న కటారి శ్రీను(సముద్ర ఖని)ని కలుస్తాడు. ఒకప్పుడు ఒంగోలుకి కింగ్ మేకర్ లా బ్రతికిన కటారి శ్రీను జైల్లో ఎందుకు ఉన్నాడు? వీర శంకర్ కి – కటారి శ్రీనుకి మధ్య ఏం జరిగింది? ఏ విషయంలో కటారి శ్రీను తప్పు చేసి వీర శంకర్ కి దొరికాడు. ఎవరి మీద ఎవరి గెలిచారు? కటారి కథ విన్నాక కొండారెడ్డి ఏం చేసాడు? అనేది తెలియాలి అంటే క్రాక్ చూడాల్సిందే..
ప్రతిభ
రవితేజ మళ్లీ ఫామ్ అందుకునేలా చేసే చిత్రమిది. ఇదివరకటి హుషారైన రవితేజ ఇందులో కనిపించారు. పోతరాజు వీరశంకర్‌గా ఆయన పాత్రలో ఒదిగిపోయిన విధానం, అందులో తన మార్క్ ఎనర్జీని ప్రదర్శించిన తీరు, టైమింగ్ అలరిస్తుంది.
శ్రుతిహాసన్ పాత్ర పాటల కోసమేనా అన్నట్టుగా సాగిపోతున్న దశలో ద్వితీయార్థంలో ఆశ్చర్యకరంగా కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ పాత్రలు, వారి నటన చిత్రానికి ప్రాణం పోశాయి. దేవిప్రసాద్, వంశీచాగంటి, సుధాకర్ కోమాకుల తదితరుల పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.
టెక్నికల్ : సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా డైరక్టర్ గోపీచంద్ మలినేని గురించి చెప్పుకోవాలి. ఒక మాస్ హీరో సినిమా నుంచి ఏయే అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూనే, ఎమోషన్‌ను ఎక్కడా పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఆయా ఎమోషన్స్‌ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో దర్శకుడి ప్రతిభ ఏంటో మనకు చెప్తుంది. కథ పరంగా రొటీన్ స్టోరీ లైన్ ను ఎంచుకున్నా, దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో, స్క్రీన్ ప్లే డిజైన్ లో రచయితగా సక్సెస్ అయ్యాడు.సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు ప్రతిభను మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్‌ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగానూ బాగా ఎలివేట్ చేసారు. అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సీన్స్ ను తమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్ళాయి. అలాగే కొన్ని చోట్ల అవసరం లేదు అనిపించే చోట కూడా హై మ్యూజిక్ ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకాస్త షార్ప్ చేయచ్చు. ఇక సాయిమాధవ్ బుర్రా ఇన్నాళ్లూ పద్దతిగల సినిమాలకే డైలాగులు రాసారు. ఇప్పుడు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే పంచ్ డైలాగ్స్ రాసి తన పెన్నుకు ఆ పవర్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. మధు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే
పాజిటివ్:
– రవితేజ మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్– సుధాకర్ మర్డర్ సీన్ ఎపిసోడ్– బస్ స్టాండ్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్– కొన్ని హీరో – విలన్ ఛాలెంజింగ్ సీన్స్
నెగిటివ్:
– వీక్ క్యారెక్టరైజేషన్స్– విలన్ స్ట్రాంగ్ అనిపించకపోవడం– రొటీన్ కథ– ఊహించిన కథనం– రవితేజ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం– సాగదీసిన రన్ టైం– వీక్ డైరెక్షన్
విశ్లేషణ:
మాస్ మహారాజ్ రవితేజ పవర్ఫుల్ కాప్ రోల్, అందులోనూ టైటిలే ‘క్రాక్’ అని పెట్టారు కాబట్టి అటు ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, ఇటు మంచి హీరోయిజం ఉంటదని అనుకొని థియేటర్ కి వెళ్లిన ప్రతి ఒక్కరూ థియేటర్ లో నిరుత్సాహ పడడం ఖాయం. అంతే కాకుండా తీసిన కథలే, తీసిన సీన్లే, కెమెరా అటు మార్చి ఇటు మార్చి ఇంకెన్ని రోజులు తీస్తారయ్యా అనుకుంటారు. రవితేజ సినిమాలో ఉండే ఒక్క పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ తప్ప ఇంకేమీ లేవు. ఓవరాల్ గా చూసేసిన సినిమాకి ‘క్రాక్’ అనే టైటిల్ తో రంగులేసి సేల్ చేద్దామనుకున్నారు కానీ ఆడియన్స్ రియాక్షన్స్ బెడిసి కొట్టేసింది. రవితేజకి కావాల్సిన హిట్ ని క్రాక్ కూడా ఇవ్వలేకపోయింది
Please Share this article
Related:
Tagged with:
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
బన్నీ, స్నేహల వివాహ బంధానికి పదేళ్లు
కల్లు గ్లాస్ పట్టుకున్న సునీత!
మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ చూసారా
నా క్యారెక్టర్‌కు ఫైట్స్ లేవు - శ్రుతీహాసన్
శర్వానంద్, రష్మిక కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల
బుమ్రా, అనుపమ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది
మహా సముద్రం నుండి శర్వనంద్ ఫస్ట్ లుక్ విడుదల
శర్వానంద్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్
Read More From This Category