ఎదిగే ఆడపిల్లలకు ఉప్పు ఎంత తక్కువగా తినిపిస్తే అంత మంచిది అని అమెరికాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆడపిల్లలకు రుతుక్రమం మొదలవడానికి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రుతుక్రమం మొదలవడం ఆలస్యమైతే ఒత్తిడీ, ప్రవర్తనాపరమైన మార్పులూ, ఇతరత్రా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రభావం సంతానోత్పత్తి వ్యవస్థ మీదా పడుతుంది. అందుకే రుతుక్రమం సక్రమంగా మొదలవ్వాలంటే .. పదేళ్ల వయసు నుంచే ఆడపిల్లలకు ఉప్పు ఎంత తక్కువ తినిపిస్తే అంత మంచిది. ఉప్పు అధికంగా ఉన్న జంక్‌ఫుడ్, ఇతర తినుబండారాలూ పరిమితంగా ఇవ్వాలి. లేదంటే ఉప్పుతో కూడుకున్న కొవ్వులు హాని చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్రకారం, ప్రతిరోజూ ఆ వయసు ఆడపిల్లలకి గరిష్ఠంగా ఐదు గ్రాముల ఉప్పు అందితే చాలు. అంతకు మించితే సమస్యలు ఎదురవుతాయి. సోడియం సమస్యను పెంచుతుంది. ఐదు గ్రాముల ఉప్పు కచ్చితంగా సరిపోతుంది. కానీ ప్రాసెస్ చేసిన ఆహారం, సోయా సాస్, గుడ్లూ, పాలూ.. వంటివి తీసుకున్నప్పుడూ సహజంగానే సోడియం అందుతుంది.
Please Share this article
Related:
Tagged with: saltissuesforgirlsabove10yrs1476455
రాగి పాత్రలోని నీళ్లు తాగండి
అమ్మాయులు ఉప్పు తగ్గించాలి
అల్బకర తో అందంగా..
వ్యాయామాలకు ఏ టైం మంచిది?
కడుపుబ్బరం తగ్గటానికి కి చిట్కాలు
గ్రీన్ టీ తాగితే గుండెనొప్పి దూరం
సోయాతో చక్కని ఆరోగ్యం
హైపర్‌టెన్షన్ నియంత్రణకు ఆహార నియమాలు అవసరం
నిమ్మకాయ సుగుణాలు
బొప్పాయి పండు తింటే
చిట్కాలు - 4
చిట్కాలు - 3
చిట్కాలు - 2
తిండి తగ్గిస్తే ఏమవుతుంది?
సూపర్ హెల్త్ కి చిట్కాలు
ఆలస్యంగా లేస్తే.. అంతేమరి..!
Read More From This Category