#Savitri #Satyamurthy
అరవై యేళ్ళ మహిళకు, పాతికేళ్ళ యువకుడు ఎలా భర్త అయ్యాడు అనే కథాంశంతో తెరకెక్కుతోంది 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా. పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోగుల నరేంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో బుధవారం ఈ వినోదాత్మక చిత్రం షూటింగ్ మొదలైంది. అరవై యేళ్ళ మహిళగా శ్రీలక్ష్మి, ఆమె పాతికేళ్ళ భర్తగా 'కేరింత' ఫేమ్ పార్వతీశం నటిస్తున్నారు. హైదరాబాద్ లో 25 రోజులు, అవుట్ డోర్ లొకేషన్లలో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేశామని, మొత్తం సినిమా ఈ 45 రోజుల్లో పూర్తవుతుందని నిర్మాత నరేంద్ర తెలిపారు.
ఇన్నేళ సినీ ప్రయాణంలో ఎన్నో భిన్నమైన పాత్రలు చేసినా, పాతికేళ్ళ యువకుడికి భార్యగా ఇంతవరకూ నటించలేదని, ఇదో కొత్త అనుభవమని శ్రీలక్ష్మి అన్నారు. సంగీత దర్శకుడిగా ఇప్పటికి 18 సినిమాలు చేశానని, అయితే ఇందులో ఉన్న మూడు కమర్షియల్ సాంగ్స్ తో తనకు బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉందని ఖుద్దూస్ చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఆషి రాయ్, గీత్ షా, ముస్కాన్ అరోరా నటిస్తున్నారు.
Please Share this article
Related:
Tagged with: wo
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category