దృశ్యం, భలే భలే మగాడివోయ్, అ..ఆ, గుంటూర్ టాకీస్ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు సీనియర్ నరేష్. తాజాగా విడుదలైన ‘ఘటన’ చిత్రంలో సైకిక్ విలన్‌గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్.జె సత్తార్ హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో సీనియర్ నరేష్ చెప్పిన విశేషాలు…
నాకు ఇన్స్పిరేషన్ ఎస్.వి.రంగారావు…క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాకు ఎస్.వి.రంగారావు ఇన్స్పిరేషన్. భారతదేశంలో ఆయన వంటి గొప్ప నటుడు ఎవరూ లేరని నా భావన. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ అన్ని రకాల క్యారెక్టర్లలో ప్రేక్షకులను మెప్పించాను.ఆ కోరిక తీరిపోయింది…ఏ సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ చేయలేదనే భావన నా మనసులో ఉండిపోయింది. ‘ఘటన’ సినిమాతో విలన్‌గా నటించాలనే నా కోరిక తీరిపోయింది. సోషల్ మీడియాలో నా పాత్రకు మంచి పేరు వచ్చింది. విలన్‌గా నాకు మంచి గుర్తింపు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది.నాకు మైల్స్టోన్…‘ఘటన’లో ఈ పాత్ర నాకు మైల్స్టోన్ అనవచ్చు. ఇప్పుడు నేను పూర్తిస్థాయి విలన్ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను చిన్న, పెద్ద సినిమాలని కాకుండా మంచి దర్శకుడు, మంచి బ్యానర్లో పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తున్నాను.నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా…ప్రస్తుతం ‘శతమానం భవతి’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే రావుగారి అబ్బాయి-రాజుగారి అమ్మాయి చిత్రంలో రావుగారి పాత్రలో నటిస్తున్నాను. గుంటూరు టాకీస్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నా.వి.ఆర్.చలన చిత్ర బ్యానర్లో రానున్న సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాను.ద్విభాషా చిత్రంలో…నా వయసుకు తగిన విధంగా లీడ్ రోల్ చేస్తూ రెండు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ఇవికాకుండా మరో ఐదు సినిమాలు చర్చల దశలోనే ఉన్నాయి.తెలుగు నటులను ప్రోత్సహించాలి…నేడు తెలుగులో ఎంతో ప్రతిభావంతమైన నటీనటులున్నారు. వారిని ప్రోత్సహించాలని ఫిల్మ్‌మేకర్స్‌ను కోరుతున్నాను. పరభాషా నటులను అవసరం మేరకే ప్రోత్సహించాలి.
Please Share this article
Related:
రాజమౌళిని ఆశ్చర్యపరిచిన ఓ సంఘటన...
యదార్థ సంఘటనతో 'ప్రతిఘటన'....
ప్రతి ఘటన సెన్సిటివ్ సినిమా : ఛార్మి
15 న ప్రతిఘటన ఆడియో విడుదల !
Tagged with: ghatana naresh.
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
మార్చి 11న మంచు విష్ణు మోసగాళ్లు
క్రాక్’ 13 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి
ప్రామిస్ చేస్తున్న ప్రదీప్ మాచిరాజు
స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
సమంత పాత్రని ఎమోజీగా
రష్మిక కు బిగ్ షాక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొత్త ఆఫీసు
Read More From This Category