'శతమానంభవతి' సినిమా చూశాక ప్రతి ఒక్కరికీ తమ చిన్ననాటి అనుభూతులు గుర్తుకు వస్తాయి. మంచి ఫీల్‌గుడ్ చిత్రమిది' అని అంటున్నారు శర్వానంద్. సతీష్ వెగేశ్న దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన చిత్రం 'శతమానం భవతి'. ఈ నెల 14న విడుదల కానున్న ఈ చిత్రం గురించి శర్వానంద్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..ప్లాన్ చేసింది కాదు.. గతేడాది నేను నటించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' ఇదే సంక్రాంతి సందర్భంగా విడుదలై పెద్ద హిట్ అయింది. సరిగ్గా ఏడాది తర్వాత 'శతమానంభవతి' రావడం ఆనందంగా ఉంది. సంక్రాంతికే విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేయలేదు. అయితే ఈ చిత్ర కథ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉంటుంది. సంక్రాంతికి తాత, మామయ్య, చిన్నాన్న...ఇలా బంధువులందరూ ఇంటికొచ్చి ఎలా వెళ్ళిపోతారో సినిమా కూడా అలానే ఉంటుంది. బంధాలను దగ్గర చేసేలా..ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఏదో ఒక రోజు ఇంటికి వెళ్ళినా వాళ్ళతో మనస్ఫూర్తిగా గడపలేకపోతున్నాం. ఇలాంటి సందర్భంలో దూరమవుతున్న బంధాలను దగ్గర చేయాలని చేసిన చిత్రమిది. తల్లిదండ్రులతో మనం కాసేపు గడపాలని చెబుతుంది. ఇందులో విలేజ్ కుర్రాడిగా కనిపిస్తాను. నగరాల్లో ఏముంటుంది, గ్రామాల్లో వ్యవసాయం చేసి బతకడంలోనే అసలైన మజా ఉందని చెప్పే పాత్ర, ఆనందాన్ని పది మందికి పంచాలిగాని, బాధలను కాదని చెప్పే పాత్ర. దూరంగా ఉన్న తాతను, బాబాయిలను కలిపేందుకు తపిస్తాను. అందరికీి పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాను. 'రన్ రాజా రన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా'లో ఉన్న ఎనర్జీ ఇందులో ఉండదు. సెటిల్డ్‌గా ఉంటూ ప్రతి ఒక్కరికి నా పాత్ర కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వందేండ్లు ఆనందంగా బతకాలనేది టైటిల్ జస్టిఫికేషన్. నాకూ గుర్తుకొచ్చాయి.. రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరిపాం. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో 'ఇదేంట్రాబాబు ఇక్కడ పడేశార'నిపించింది. కానీ సినిమాలో ఫ్యామిలీ అంతా ఒక్కచోటుకి చేరి గడిపే సన్నివేశాలుంటాయి. ఆ సీన్స్‌లో నటించేటప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో బంధువులందరితో గడిపిన సంఘటనలు గుర్తొచ్చాయి. దర్శకుడితో ఇదే విషయం చెబితే అందుకే కదా.. ఈ సినిమా చేస్తున్నామన్నారు. నాకు గుర్తు వచ్చినట్టే సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తమ చిన్ననాటి అనుభూతులను గుర్తుకొస్తాయి. సినిమా చూశాక కచ్చితంగా తమ ఇంటికి ఫోన్ చేస్తారు.రైటర్ దర్శకుడైతే ఆ సౌలభ్యం ఉంటుంది.. ఈ చిత్రం చేయడానికి ఫస్ట్ అంతగా ఆసక్తి చూపలేదు. సాయిధరమ్ తేజ్ కథ విను నీకు బాగుంటుందని చెప్పాడు. కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. దర్శకుడు సతీష్ మంచి రైటర్. స్క్రిప్టు ముందుగానే లాక్ చేశారు. రచయిత దర్శకుడైతే ఈ సౌలభ్యం ఉంటుంది. స్క్రిప్ట్ మార్చడానికి ఏం ఉండదు. దీనికితోడు దర్శకుడి మేకింగ్, కెమెరా వర్క్, సంగీతం వంటివన్నీ సినిమాకు సపోర్ట్నిస్తాయి. ఈ కథ కొత్తది కాకపోయినప్పటికీ దర్శకుడు సతీష్ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. గతంలో వచ్చిన సినిమాలాగానే ఉందనే ఫీలింగ్ ఒక్క శాతం కూడా అనిపించదు. మంచి ఫీల్‌గుడ్ చిత్రమని ప్రేక్షకులు ఫీలవ్వడం ఖాయం. మిక్కీ.జె.మేయర్ మంచి బాణీలను అందించారు. ఇందులో ప్రకాష్‌రాజ్, జయసుధ, నరేష్ వంటి సీనియర్ నటీనటులతో నటించడం వల్ల వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా నాకు తండ్రి పాత్రలో నరేష్ ఎక్స్ట్రార్డినరీగా నటించారు.ఎన్ని సినిమాలైనా ఆడతాయి.. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య మా చిత్రాన్ని ఎందుకు విడుదల చేస్తున్నారని అడుగుతున్నారు. గత సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకులు చూస్తారు. మా చిత్రాన్ని కూడా చూస్తారని నమ్ముతున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రస్తుతం బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఓ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో చంద్రమోహన్ అనే నూతన దర్శకుడు ఇండిస్టీకి పరిచయం అవుతున్నాడు. ఇది మంచి మాస్, కామెడీ ఎంటర్టైనర్. తదుపరి చిత్రం మారుతి దర్శకత్వంలో ఉంటుంది. ఇకపై కూడా ఎప్పటికప్పుడు నవ్యకథలతో ప్రేక్షకులను అలరించేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. పెళ్ళి గురించి చెప్పలేను.. పెళ్ళి గురించి ఇంకా నేనేం ప్లాన్ చేసుకోలేదు. పెద్దలు కుదిర్చే పెళ్ళా, ప్రేమ వివాహమా అనేదానిపై నాకు క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే దాని గురించి ఆలోచించే టైమ్ లేదు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా (నవ్వుతూ).
Please Share this article
Related:
Tagged with: shatamanam bhavati sharwanand interview
పెళ్లి సందడిలో కాజల్ అగర్వాల్
సరిలేరు నుంచి సెకండ్ సాంగ్
నాలుగేళ్ళ తర్వాత ఛాన్స్ వచ్చింది, హిట్ అందుకుంటాడా?
కార్ యాక్సిడెంట్ పై స్పందించిన రవి
దీపికా పదుకొనె సినిమా ట్రైలర్ రేపే
సమస్యల్లో చిక్కుకున్న పానిపత్ మూవీ
నిర్భయ తల్లిని కలసిన పూనమ్ కౌర్
తాప్సి పాత్ర సమంతకు బాగుంటుంది
నూర్ భాయ్ కుటుంబానికి చెర్రీ 10 లక్షలు సాయం
జంటగా రాహుల్, పునర్నవి
హాట్ ఫోటో పోస్ట్ చేసిన పాయల్
నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరి ఇకలేరు
90ML మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది
బాలీవుడ్ లోకి హాలీవుడ్ నటుడు
డిసెంబర్ 11న అల టీజర్
బాబుగారు అతనికి మీ ఆటోగ్రాఫ్ కావాలట
Read More From This Category