#A1ExpressOnMarch5th #A1Express #SundeepKishan #A1Express #LavanyaTripathi
టైటిల్ : ఏ1 ఎక్స్ ప్రెస్జానర్ : స్పోర్ట్స్ డ్రామానటీనటులు : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ తదితరులునిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలనుసంగీతం : హిప్ హాప్ తమిళ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్విడుదల తేది : మార్చి 05, 2021
సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెన్నిస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “ఏ1 ఎక్స్ ప్రెస్”. మంచి అంచనాలు మరియు బజ్ నడుమ ఈ చిత్రం ఈరోజే సిల్వర్ స్క్రీన్స్ ను హిట్ చేసేందుకు వచ్చింది. మరి ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ
యానాం షాట్స్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌కి ఒక చరిత్ర ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. హాకీ కోచ్ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్ అంటే కోచ్ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్(రావు రమేశ్)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్ ఫర్ఫార్మింగ్ లిస్ట్‌లో వేస్తాడు.
మరోవైపు.. నేషనల్ లెవల్ టోర్నమెంట్ గెలిస్తే.. తమ గ్రౌండ్ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళి.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కట్ చేస్తే... హైదరాబాద్ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్(సందీప్ కిషన్) తొలి చూపులోనే హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్ విని షాకవుతారు. అసలు సందీప్ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్ మరళికి సందీప్ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.
నటీనటులు
నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం సందీప్ కిషన్ పడ్డ కష్టం ప్రతీ సీన్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా సందీప్ కిషన్ అవలీలగా నటించేశాడు. ఇక హాకీ క్రీడాకారిణిగా త్రిపాఠి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. టామ్ బాయ్ రోల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది.
ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారో కళ్లకుగట్టారు. హీరో స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఆకట్టుకున్నారురు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం ఖచ్చితంగా స్పెషల్ గా ఉన్నాయని చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చెయ్యడమే కాకుండా అన్ని విభాగాల్లో కూడా టెక్నిషియన్స్ మంచి అవుట్ పుట్ ను అందించారు. ముఖ్యంగా కెవిన్ రాజ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. అలాగే హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది.
ఇక దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను విషయానికి వస్తే..ఆల్రెడీ తాను చేసింది రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్ లైన్ లో చెప్పడానికి ఏమీ లేదు కానీ దానిని ఎలా హ్యాండిల్ చేసాడు అన్నదే ఇక్క పాయింట్. ఈ విషయంలో మాత్రం డెన్నిస్ కు తన మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వెయ్యొచ్చు. నటీనటుల నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లను ఈ దర్శకుడు రాబట్టుకున్నాడు. అంతే కాకుండా కొన్ని ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ లో నరేషన్ పై ఇంకా ఎక్కువ దృష్టి పెడితే పెడితే బాగుండేది. మిగతా అంతా తన వరకు చెయ్యగలిగింది వంద శాతం చేసాడు.
ప్లస్ పాయింట్స్
సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్సంగీతంసినిమా చివరి 20 నిమిషాలు
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్రొటీన్ స్టోరీప్రత్యర్థి హాకీ టీం కోచ్ బలంగా లేకపోవడం
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే “ఏ1 ఎక్స్ ప్రెస్”..ఓ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాలి. కామెడీ, యాక్షన్ సహా ఇంట్రెస్టింగ్ గా అనిపించే హాకీ ఎపిసోడ్స్ మరియు నటీ నటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు చాలా బాగుంటాయి. కాకపోతే స్టోరీ లైన్ కాస్త ఊహించినదగినదే అనిపిస్తుంది కానీ దానిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది.
Please Share this article
Related:
Tagged with: 1
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category