తీహార్‌ జైలు నుంచి కవిత విడుదల

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి.. దాదాపు 5 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తీహాడ్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. సుప్రీంకోర్ట్ ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైలులో విడుదలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ముగిసిన అనంతరం ఆమె జైలు నుంచి బయట అడుగుపెట్టారు.

జైలు వెలుపల బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత కొడుకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. బయటకు వచ్చిన కొడుకును ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ వెంటనే అన్న కేటీఆర్‌ను అప్యాయంగా హత్తుకున్నారు. అక్కడ ఉన్న నేతలను పలకరించారు.

జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని పార్టీ ఆఫీస్‌కి కవిత వెళ్లనున్నారని తెలుస్తోంది. ఆమె వెంటనే సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఉండనున్నారు. ఇవాళ రాత్రికి ఆమె పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:45 ఫ్లైట్‌కి హైదరాబాద్ బయలుదేరానున్నారని సమాచారం. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కలిసి రానున్నారని తెలుస్తోంది.

ఎట్టకేలకు కవితకు బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్‌ జైలులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఇవాళ ఉపశమనం దక్కింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూర్ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్‌ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని, మహిళగా కూడా పరిగణించాల్సి ఉన్నందున బెయిల్ ఇస్తున్నట్టు ధర్మాసనం కారణాలుగా పేర్కొంది. నిందితురాలు ప్రస్తుతం జైలులో ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా కవిత తరఫున సీనియర్‌ లాయర్ ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు.దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి.. దాదాపు 5 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తీహాడ్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. సుప్రీంకోర్ట్ ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైలులో విడుదలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ముగిసిన అనంతరం ఆమె జైలు నుంచి బయట అడుగుపెట్టారు.

See also  Kavitha meets father KCR, celebrations as party leaders gather

జైలు వెలుపల బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత కొడుకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. బయటకు వచ్చిన కొడుకును ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ వెంటనే అన్న కేటీఆర్‌ను అప్యాయంగా హత్తుకున్నారు. అక్కడ ఉన్న నేతలను పలకరించారు.

జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని పార్టీ ఆఫీస్‌కి కవిత వెళ్లనున్నారని తెలుస్తోంది. ఆమె వెంటనే సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఉండనున్నారు. ఇవాళ రాత్రికి ఆమె పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:45 ఫ్లైట్‌కి హైదరాబాద్ బయలుదేరానున్నారని సమాచారం. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కలిసి రానున్నారని తెలుస్తోంది.

ఎట్టకేలకు కవితకు బెయిల్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్‌ జైలులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఇవాళ ఉపశమనం దక్కింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూర్ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్‌ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని, మహిళగా కూడా పరిగణించాల్సి ఉన్నందున బెయిల్ ఇస్తున్నట్టు ధర్మాసనం కారణాలుగా పేర్కొంది. నిందితురాలు ప్రస్తుతం జైలులో ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా కవిత తరఫున సీనియర్‌ లాయర్ ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు.

Related Posts

  • September 13, 2024
ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

Share this… Facebook Twitter Whatsapp Linkedin పూనమ్ కౌర్: తెలుగు ప్రేక్షకులకు అందాల…

  • September 13, 2024
భ‌లే ఉన్నాడే రివ్యూ

Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: భ‌లే ఉన్నాడేన‌టీన‌టులు: రాజ్‌త‌రుణ్‌, మ‌నీషా…

You Missed

సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

  • September 13, 2024
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

  • September 13, 2024
ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

  • September 13, 2024
బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

భ‌లే ఉన్నాడే రివ్యూ

  • September 13, 2024
భ‌లే ఉన్నాడే  రివ్యూ

Movie Review: Bhale Unnadu

  • September 13, 2024
Movie Review: Bhale Unnadu

Movie Review: Mathu Vadalara 2

  • September 13, 2024
Movie Review: Mathu Vadalara 2