వడ్డీతో సహా చెల్లిస్తా-ఎమ్మెల్సీ కవిత

తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర రూ. 10 లక్షల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. కాగా.. కవిత విడుదలకు కొన్ని గంటల పాటు ప్రాసెస్ జరిగింది. మరోవైపు.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కవిత కోసం వేచి చూశారు. కాగా.. కవిత జైలు నుంచి విడుదల కాగానే, ఆమెకు ఘన స్వాగతం పలికారు.

కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన.. కవిత జైలులో నుంచి బయటకు రాగానే.. మొదటగా కొడుకు దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురైంది. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం.. అందరికీ అభివాదం చేసింది. ఈ సందర్భంగా.. కవిత మీడియాతో మాట్లాడింది. 18 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నానని తెలిపింది. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నానని.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పింది. కేసీఆర్‌ బిడ్డను, మొండిదాన్ని, తప్పుచేయకున్నా జైలుకు పంపారు.. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.

రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ.. కాగా.. జైలు నుంచి విడుదలైన కవిత.. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు అక్కడే బస చేయనున్నారు. తీహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రేపు సీబీఐ ఛార్జీషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. ఆ విచారణకు కవిత ఆన్ లైన్లో హాజరుకానున్నారు. అనంతరం.. హైదరాబాద్ కు రానున్నారు.

See also  తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
  • Related Posts

    • September 11, 2024
    బండి సంజయ్‌: కేసీఆర్‌ రీ ఎంట్రీ ఇక కలగానే మిగిలిపోతుంది

    Share this… Facebook Twitter Whatsapp Linkedin లోక్‌ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ…

    • September 10, 2024
    హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం కు తెలంగాణ హైకోర్టు అనుమతి

    Share this… Facebook Twitter Whatsapp Linkedin హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ లో వినాయక…

    You Missed

    సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

    • September 13, 2024
    సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

    ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

    • September 13, 2024
    ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

    బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

    • September 13, 2024
    బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

    భ‌లే ఉన్నాడే రివ్యూ

    • September 13, 2024
    భ‌లే ఉన్నాడే  రివ్యూ

    Movie Review: Bhale Unnadu

    • September 13, 2024
    Movie Review: Bhale Unnadu

    Movie Review: Mathu Vadalara 2

    • September 13, 2024
    Movie Review: Mathu Vadalara 2