దావుడి’ పాటకు 30 మిలియన్ల వ్యూస్ తో ట్రేండింగ్

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ‘దేవర’ అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో “దేవర: పార్ట్ 1” ఒకటి. ఇప్పటికే రెండు చార్ట్-టాపింగ్ సింగిల్స్‌తో “దేవర” సెన్సేషన్ సృష్టించింది. “ఫియర్ సాంగ్” మరియు రొమాంటిక్ “చుట్టమల్లె” తరువాత మూడవ సింగిల్ “దావుడి” సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న “దేవర: పార్ట్ 1” ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

See also  సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు

Related Posts

  • September 13, 2024
ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

Share this… Facebook Twitter Whatsapp Linkedin పూనమ్ కౌర్: తెలుగు ప్రేక్షకులకు అందాల…

  • September 13, 2024
భ‌లే ఉన్నాడే రివ్యూ

Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: భ‌లే ఉన్నాడేన‌టీన‌టులు: రాజ్‌త‌రుణ్‌, మ‌నీషా…

You Missed

సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

  • September 13, 2024
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

  • September 13, 2024
ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

  • September 13, 2024
బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

భ‌లే ఉన్నాడే రివ్యూ

  • September 13, 2024
భ‌లే ఉన్నాడే  రివ్యూ

Movie Review: Bhale Unnadu

  • September 13, 2024
Movie Review: Bhale Unnadu

Movie Review: Mathu Vadalara 2

  • September 13, 2024
Movie Review: Mathu Vadalara 2