హాట్ ఫొటోలకు పోజులివ్వడం ఒక్క అనుపమ పరమేశ్వరన్ కే చెల్లింది. అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 ఏళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో 2015లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో ఆమె ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
కేవలం 4 రూ.కోట్లలో బడ్డెట్ సినిమాగా వచ్చిన ప్రేమమ్ సినిమా ఏకంగా రూ.70 కోట్లు సంపాదించింది. ఆ తరువాత అనుపమ కు తెలుగు, తమిళం, కన్నడ సినిమాలలో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. సినిమాల్లో అనుపమ ముందు అంతా హోమ్లీ పాత్రలే చేసింది.
కుందనపు బొమ్మలా అనిపించే అనుపమ ‘అ ఆ’, ‘శతమానం భవతి’ సినిమాలలో తను పోషించిన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత అనుపమ నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో అనుపత తన రూటు మార్చింది అనుపమ ఒక్కసారి బరువు తగ్గి టోన్డ్ ఫిజిక్ సాధించింది.
ఆ తరువాత టిల్లు స్క్వేర్ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించింది. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ తన నటనతో పాటు అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. ఆమె పాత్ర కూడా అందుకు తగ్గట్టు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సిద్దు జొన్నలగడ్డతో చేసిన రొమాంటిక్ సీన్ల ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.
సినిమాలో అనుపమ కిస్సింగ్ సన్నివేశాలు, గ్లామర్ సీన్లలో ఏ మాత్రం సంకుచితంగా అనిపించలేదు. సినిమా ప్రెస్ మీట్ లో మీడియా ఆమెకు ఇంత డిఫరెంట్ గా ఫుల్ రొమాంటిక్ సీన్లు ఎలా చేశారు? అని అడిగితే.. రోజూ ఒకే భోజనం చేస్తే బోర్ కొడుతుంది.
అందుకే డిఫరెంట్ ఉండాలని, వెరైటీ కోసం చేశాను అని చెప్పింది. కథ నచ్చితే బోల్డ్ గా నటించేందుకు సై అంటు ప్రకటన కూడా చేసేసింది.