
📌 Key Points
- ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
- సుమ, జరీనా వాహబ్, దర్శకుడు మారుతిలపై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు.
- దాదాపు 15 ఏళ్ల తర్వాత హారర్ కామెడీతో రాబోతున్నానని ప్రభాస్ వెల్లడించారు.
- సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలు, తమ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావాలని కోరారు.
ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. 15 ఏళ్ల తర్వాత పూర్తి వినోదంతో హారర్ కామెడీ చిత్రంతో వస్తున్నానని ప్రభాస్ ప్రకటించారు. సంక్రాంతి సినిమాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుమ, జరీనా, మారుతిలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
The Raja Saab Pre release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈయన నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ముందుగా సుమా గురించి ప్రభాస్ మాట్లాడారు సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని ఆవిడ ఈవెంట్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ జోష్ ఇస్తుంది అంటూ తనపై ప్రశంసల కురిపించారు. జరీనా వాహబ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మా నాన్నమ్మ. మా నాన్నమ్మ సీన్స్ చూసి నేను కూడా నా సీన్స్ మర్చిపోయానని ప్రభాస్ తెలిపారు.
ఈ సినిమా ద్వారా నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయానని ,ఇది నానమ్మ మనవడి కథ అంటూ తెలియజేశారు .ఇక హీరోయిన్ల గురించి అలాగే దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ గురించి, తమన్ గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఇక ఈ సినిమాకు ముందు మారుతిని కలిసిన తర్వాత అన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అభిమానుల కోసం ఇవ్వాలి అని అడిగాను. ఫైనల్లీ మారుతి నాకోసం హర్రర్ కామెడీ తీసుకువచ్చారని, మారుతి గారి రైటింగ్ కు తాను ఫ్యాన్ అయిపోయానని తెలిపారు . ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా సినిమా పట్ల అంచనాలను పెంచేస్తూ మాట్లాడారు.
15 ఏళ్ల తర్వాత పూర్తి వినోదం: ప్రభాస్ హామీ
దాదాపు 15 ఏళ్ల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ఇక ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత మీదేనని తెలిపారు . అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సంక్రాంతి సినిమాల గురించి కూడా ప్రభాస్ మాట్లాడారు. ఈ సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని తెలిపారు. ఇక సంక్రాంతి బరిలో కూడా సీనియర్ల తర్వాతనే మేము అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలతో పాటు మా సినిమాని కూడా సక్సెస్ చేయండి అంటూ ఈయన తెలియచేశారు.
ఇక ప్రభాస్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా బాహుబలి వచ్చాడంటూ నినాదాలు చేయడంతో ప్రభాస్ వెరైటీగా స్పందించారు నేను మాట్లాడుతుంటే అందరికీ బోర్ కొడుతుంది కదా అందుకే ఇలా బాహుబలి డైలాగ్ చెబుతున్నారు అంటూ సరదాగా ఆట పట్టించారు. మీకోసం ఓసారి బాగా మాట్లాడుతాను స్టేజ్ పైనే ఎంటర్టైన్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పటిలాగే అభిమానుల పట్ల చూపించిన ప్రేమకు అభిమానులకి ఫిదా అవుతున్నారు.
సంక్రాంతి సినిమాలు, అభిమానుల బాధ్యతపై ప్రభాస్
ప్రభాస్ తన కొత్త చిత్రంపై భారీ అంచనాలు పెంచుతూ, అభిమానులకు సరికొత్త వినోదాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. సంక్రాంతి బరిలో ఉన్న అన్ని చిత్రాలను, తమ సినిమాను కూడా ఆదరించాలని కోరారు.


