|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2025 విజయదశమి: తేదీ, పండుగ విశిష్టత, అమ్మవారి పూజ విధానం

Published: 09-09-2025, 5:45 AM

హిందువుల పవిత్రమైన పండుగ విజయదశమి 2025లో అక్టోబర్ 2న వచ్చింది. నవరాత్రులతో ప్రారంభమయ్యే ఈ పండుగలో ప్రతిరోజూ వివిధ అమ్మవారి రూపాలను పూజిస్తారు. ఈ కథనంలో దసరా పండుగ ప్రాముఖ్యత, పూజా విధానాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

2025 విజయదశమి అక్టోబర్ 2న జరిగింది.

2

నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరిగాయి.

4

మహిషాసురమర్ధిని దేవిని పూజించడం దసరా పండుగ ప్రధాన ఉద్దేశం.

2025 విజయదశమి తేదీ

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి. దసరా పండుగను 11 రోజులు పాటు జరుపుకుంటారు. చెడుపై మంచి గెలిచిందని, విజయానికి ప్రత్యేకతగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? దసరా పండుగ విశిష్టత ఏంటి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దసరా 2025 ప్రారంభ తేదీ, ముగింపు తేదీ

ఈ సంవత్సరం నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలై అక్టోబర్ 2 వరకు ఉంటాయి. ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 2న వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజూ కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను కూడా సమర్పిస్తారు.

దసరా పండుగ రాక్షస సంహారానికి ప్రతీక. చెడుపై మంచే గెలుస్తుందని చెప్పే రోజు ఇది. దసరాకి సంబంధించి చాలా పురాణ గాథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మహిషాసుర వధ. మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ దేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు ఏ పురుషుడి చేతిలో కూడా ప్రాణం పోకూడదని వరాన్ని కోరుకుంటాడు.

ఆ వరంతోనే అందరినీ హింసించడం మొదలుపెడతాడు. అప్పుడు దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్లి మహిషాసురుడి నుంచి రక్షించాలని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడుని చంపే శక్తిని సృష్టిస్తానని అంటాడు. దేవతలందరి శక్తిని చేర్చి స్త్రీ రూపంలో మహిషాసురమర్దినిని సృష్టిస్తారు. తొమ్మిది రోజులు మహిషాసురుడితో ఆమె యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాదీ మహిషాసురుని సంహరించిన రోజుగా దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది.

సెప్టెంబర్‌ 22 – శ్రీ బాలాత్రిపురసుందరి

నవరాత్రుల ప్రాముఖ్యత

సెప్టెంబర్‌ 23 – శ్రీ గాయత్రి దేవి

సెప్టెంబర్‌ 24 – శ్రీ అన్నపూర్ణ దేవి

సెప్టెంబర్‌ 25 – శ్రీ కాత్యాయినీ దేవి

సెప్టెంబర్‌ 26 – శ్రీ మహా లక్ష్మీ దేవి

సెప్టెంబర్‌ 27 – శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

సెప్టెంబర్‌ 28 – శ్రీ మహా చండీదేవి

ప్రతిరోజు పూజించే అమ్మవారు

సెప్టెంబర్‌ 29 – శ్రీసరస్వతి దేవి

సెప్టెంబర్‌ 30 – శ్రీ దుర్గా దేవి

అక్టోబర్‌ 1 – శ్రీ మహిషాసురమర్ధిని దేవి

అక్టోబర్‌ 2 – శ్రీ రాజరాజేశ్వరి దేవి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

విజయదశమి పండుగ శుభాకాంక్షలు! చెడుపై మంచి విజయం సూచించే ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.