
ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, నాగచైతన్య ‘NC-24’ మూవీ మేకర్స్ తమ తదుపరి అప్‌డేట్ విడుదల వాయిదా వేస్తూ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
Key Points
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, తెలుగు రాష్ట్రాల్లో విషాదం.
ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఈ సంఘటనపై సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
నాగచైతన్య 'NC-24' మూవీ మేకర్స్ తమ తదుపరి అప్‌డేట్ విడుదల వాయిదా వేశారు.
మీనాక్షి చౌదరి క్యారెక్టర్ పోస్టర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన NC-24 బృందం.
ఘోర బస్సు ప్రమాదం: 21 మంది మృతి
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు జరుగుతూ జనాలకు వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదం కారణంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువముందే.. చేవెళ్ల మండల పరిధిలో ఈరోజు ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో మొత్తం 21 మంది మృతి చెందినట్లు సమాచారం.
NC-24 మేకర్స్ కీలక నిర్ణయం
ఇక ఈ విషాధ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ సంఘటనతో నాగచైతన్య ‘NC-24’ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబాలను సానుభూతి తెలియజేస్తూ.. విడుదల చేస్తామని ప్రకటించి అప్డేట్‌ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో నోట్ రిలీజ్ చేశారు. ‘‘చేవెళ్లలో జరిగిన దురదృష్టకర సంఘటనలో బాధిత కుటుంబాలకు ‘NC24’ బృందం సంఘీభావం తెలుపుతోంది. అందరికీ శాంతి కలగాలని కోరుకుంటున్నాము.
మీనాక్షి చౌదరి పోస్టర్ విడుదల వాయిదా
రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జరిగిన విషాద సంఘటన మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ దురదృష్టకర సంఘటన దృష్ట్యా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury)క్యారెక్టర్ పోస్టర్ విడుదలను వాయిదా వేయాలని ‘NC-24’ టీమ్ నిర్ణయించింది. ఈ విషాదం వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, శాంతి కలగాలని కోరుతున్నాం’’ అని రాసుకొచ్చారు. దీంతో మీనాక్షి అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
చేవెళ్ల దుర్ఘటన కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ పరిస్థితుల్లో NC-24 మూవీ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తారని ఆశిద్దాం.


