
📌 Key Points
- 7/G బృందావన కాలనీ 2లో హీరోయిన్‌గా అనస్వర రాజన్ ఎంపిక.
- అనిత పాత్రలో అనస్వర రాజన్ నటించనున్నారు.
- రవికృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.
- ఈ సినిమాలోని పాటలకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
రవికృష్ణ హీరోగా నటించిన 7/G బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్‌గా 7/G బృందావన్ కాలనీ 2 తెరకెక్కుతోంది. ఇందులో అనిత పాత్రలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నటించనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అనిత పాత్రలో అనస్వర రాజన్
7/G Brundavan Colony 2:ప్రముఖ నిర్మాత, సినీ నటుడు ఏ.ఎం.రత్నం కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవికృష్ణ(Ravikrishna ) 7/G బృందావన కాలనీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2004లో విడుదలైన భారతీయ ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ భాషల్లో ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ సినిమాలో సోనియా అగర్వాల్ కథానాయికగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. కాలక్రమేనా యువతలో విపరీతమైన ఆదరణ పొంది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ ను సెల్వరాఘవన్ వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.. ఇక దాంతో మళ్లీ సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న 7/జీ బృందావన కాలనీ సినిమాలో హీరోయిన్గా అనిత పాత్రలో ఎవరు నటించబోతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు రాగా.. తాజాగా యంగ్ బ్యూటీని ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
7/G బృందావన కాలనీ సీక్వెల్
విషయంలోకి వెళ్తే.. ఇటీవల రోషన్ మేక హీరోగా నటించిన ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan). రోషన్ మేక హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది . ఇందులో అనస్వర రాజన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా అందించిన విజయంతో ఇప్పుడు ఈమెకు బంపర్ ఆఫర్ లభించింది. సౌత్ ఇండియాలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన 7/జీ బృందావన కాలనీ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 7/జీ బృందావన్ కాలనీ 2లో హీరోయిన్గా ఎంపికయింది. ఇక త్వరలోనే దీనిపై కీలక ప్రకటన చేయనున్నారు. సుమారుగా రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ప్రేమ కథకు కొనసాగింపు వస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రవికృష్ణ హీరోగా రీ ఎంట్రీ
ఇకపోతే మొదటి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ ఈ సీక్వెల్ లో కూడా హీరోగా నటిస్తున్నారు. అనస్వరరాజన్ అనిత పాత్రలో మెరవనుంది. ఇప్పటికే అనస్వరాకి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగిందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాజెక్టులో అవకాశం అందుకోవడం నిజంగా గొప్ప ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. ఇక సీక్వెల్ కి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని..జూలై లేదా ఆగస్టులో ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అసలు ఆ మ్యాజిక్ ను ఈ సీక్వెల్ క్రియేట్ చేస్తుందా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అనిత క్యారెక్టర్ ను అనస్వర ఏవిధంగా హ్యాండిల్ చేయగలదో చూడాలి.
మొత్తానికి అనస్వర రాజన్ కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మంచి ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


