|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో బెటర్ క్వాలిటీతో రాబోతుంది.. స్టేజ్‌పైనే నోరు జారిన మూవీ టీమ్.. నెట్టింట ట్రోల్స్

Published: 23-06-2025, 8:53 AM

‘8 వసంతాలు’ సినిమా విడుదల తర్వాత సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం, ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో సినిమాటోగ్రాఫర్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన నోరు జారడంతో నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.

Key Points

1

8 వసంతాలు సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

2

సినిమాటోగ్రాఫర్ ఓటీటీలో బెటర్ క్వాలిటీ ఉంటుందని వెల్లడించారు.

3

ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

4

థియేటర్ వర్సెస్ ఓటీటీ చర్చ మళ్లీ రేగుతోంది.

8 వసంతాలు సినిమా సక్సెస్

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ (Anantika Sunil Kumar) తాజాగా ‘8 వసంతాలు’ (8 Vasanthalu) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఫణీంద్ర దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న థియేటర్స్‌లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ మీడియాతో ముచ్చటిస్తున్నారు.

ఈ మేరకు.. రీసెంట్‌గా సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న డీఓపీ విశ్వనాథ్ (సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి) మాట్లాడుతూ నోరు జారేశారు. ‘ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్ రాబోతుంది. థియేటర్లో కంటే ‘8 వసంతాలు’ ఓటీటీలో బెటర్ క్వాలిటీతో రాబోతుంది.. అందులో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మీరే సినిమా ఓటీటీలో ఇంకా బెటర్‌గా ఉంటుందని చెప్తుంటే థియేటర్స్‌కు ఎవరు వెళ్తారు అని ప్రశ్నించగా.. ఆయన తప్పుని సరిచేసుకుంటూ నటీనటుల యాక్టింగ్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్ వివాదాస్పద వ్యాఖ్యలు

నెటిజన్ల ట్రోలింగ్

చిత్ర బృందం యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీశాయి. థియేటర్ విడుదల తర్వాత ఓటీటీలో చిత్రం యొక్క నాణ్యతపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.