|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్ రేపు 3’ ట్రైలర్ రిలీజ్

Published: 16-07-2025, 12:37 PM

45 మిలియన్లకు పైగా వ్యూస్‌తో విజయవంతమైన ‘ఆ గ్యాంగ్ రేపు’ షార్ట్ ఫిల్మ్‌కు కొనసాగింపుగా ‘ఆ గ్యాంగ్ రేపు 3’ తెరకెక్కింది. నరేన్ అన్నసాగరం మరియు ప్రీతి సుందర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది.

Key Points

1

45 మిలియన్లకు పైగా వ్యూస్‌తో వైరల్ అయిన ‘ఆ గ్యాంగ్ రేపు’ షార్ట్ ఫిల్మ్‌కు కొనసాగింపు ‘ఆ గ్యాంగ్ రేపు 3’

2

నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు

4

త్వరలో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది

‘ఆ గ్యాంగ్ రేపు 3’ ట్రైలర్ విడుదల

45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందింది ‘ఆ గ్యాంగ్‌ రేపు’ షార్ట్ ఫిలిమ్. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందడంతో దీనికి స్వీకెల్‌గా ‘ఆ గ్యాంగ్‌ రేపు-2’ రూపొందించారు. ఇప్పుడు ఈ ప్రాంచైజీలో మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’ తెరకెక్కించారు. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మింస్తున్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అండ్ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించబడనున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే తాజాగా ఈ షార్ట్ ఫిలిమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘2015లో అనుకోకుండా నాకున్న చిన్న ప్రయత్నం వైరల్‌ అయిపోయి గుర్తింపు తెచ్చింది. గ్యాంగ్‌ రేపు 2 కూడా హిట్‌ అయ్యింది. నా స్నేహితుడు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశాడు. ఆ గ్యాంగ్‌ రేపు 3 టైటిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. నిర్మాత నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోచేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందర్ని అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఆటా సందీప్‌ ఆ గ్యాంగ్‌ రేప్‌, గ్యాంగ్‌ రేప్‌ 2లో చేశాడు. కానీ ఈ సినిమాలో ఆయనను విలన్‌గా చేపించడం ఇష్టం లేదు అందుకే చేయించలేదు. అందుకే కొత్తవాళ్లతో చేశాను’ అన్నారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

ఓటీటీ విడుదల వివరాలు

‘ఆ గ్యాంగ్ రేపు 3’ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించబడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.