|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aamir Khan: ‘మహాభారతం’లో నాకిష్టమైన క్యారెక్టర్ అదే.. కుదిరితే ఆ పాత్రలోనే నటిస్తా.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్

Published: 08-05-2025, 12:14 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్‌గా ‘మహాభారతం’ సినిమాను అభివృద్ధి చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తనకు ఇష్టమైన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

Key Points

1

అమీర్ ఖాన్ 'మహాభారతం' సినిమాను తన కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

2

కృష్ణుడి పాత్ర అతనికి అత్యంత ఇష్టమైనది.

3

అవకాశం దొరికితే ఆ పాత్రలో నటించాలని ఆయన కోరుకుంటున్నారు.

4

ప్రస్తుతం 'మహాభారతం' చిత్రానికి సంబంధించిన టీంను ఏర్పాటు చేస్తున్నారు.

అమీర్ ఖాన్ కలల ప్రాజెక్ట్

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan).. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ (Mahabharata)తో బిజీగా ఉన్నాడు. తన కలల ప్రాజెక్ట్‌(Dream project)గా రాబోతున్న ఈ సినిమాను ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీన్ ఖాన్ ‘మహాభారతం’ చిత్రం గురించే మాట్లాడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. అందులో తనకు ఇష్టమైన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.

‘‘మహాభారతం’ తెరకెక్కించడం నా కల. ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ నిరాశపరచవు. అయితే దీని కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ‘మహాభారతం’లో కృష్ణుడి (Krishna) పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అది నాకు చాలా ఇష్టమైన రోల్. అవకాశం వస్తే ఆ క్యారెక్టర్‌లో కనిపించాలనుకుంటున్నా. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడే దీని గురించి ఎలాంటి వివరాలు నేను చెప్పలేను. ఈ మూవీ కోసం ఓ టీంను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో విషయాలపై అన్వేషిస్తున్నాము.. ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చారు.

కృష్ణుడి పాత్ర ఆకర్షణ

‘మహాభారతం’ టీం ఏర్పాటు

అమీర్ ఖాన్ ‘మహాభారతం’ చిత్రంపై చూపిస్తున్న ఆసక్తి అభిమానులను ఆకట్టుకుంటోంది. కృష్ణుడి పాత్రలో అతని నటనను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.