
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘కే-ర్యాంప్’ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటుంది. దీపావళి సెలవులతో పాటు, హీరో థియేటర్‌లో అభిమానులతో కలిసి వేసిన ఊర మాస్ స్టెప్పులు సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Key Points
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'కే-ర్యాంప్' సినిమా తాజాగా విడుదలైంది.
థియేటర్‌లో అభిమానులతో కలిసి కిరణ్ అబ్బవరం ఊర మాస్ స్టెప్పులు వేశారు.
సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి, దీపావళి హాలిడేస్ కూడా కలిసొచ్చాయి.
కిరణ్ అబ్బవరం డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కిరణ్ అబ్బవరం ‘కే-ర్యాంప్’ సందడి
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ కుర్రాడు కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా నటించిన సినిమా కే-ర్యాంప్ (K-Ramp). గత ఏడాది దీపావళికి క సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు ఈ సినిమాతో వచ్చి ఆకట్టుకుంటున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా జనాలను బాగానే ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన వాళ్లు కూడా మంచి రివ్యూ రేటింగ్ ఇస్తున్న నేపథ్యంలో… థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. దానికి తోడు దీపావళి హాలిడేస్ రావడంతో, కిరణ్ అబ్బవరం సినిమాకు మైలేజ్ బాగానే వస్తోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో నేరుగా థియేటర్లలోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ థియేటర్ లో నిన్న ఫాన్స్ తో కలిసి స్టెప్పులు కూడా వేశారు. సినిమాలో సాంగ్ రాగానే, తన డాన్స్ తానే వేసుకుంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం తెప్పించాడు. ఇలా థియేటర్లలో హీరో డాన్స్ చేయడంతో అభిమానులు కూడా అతనితో ఊర మాస్ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్ గా మెరిశారు. క్లిక్
థియేటర్‌లో హీరో ఊర మాస్ స్టెప్పులు
వైరల్ అవుతున్న వీడియో: అభిమానుల హుషారు
మొత్తంగా, ‘కే-ర్యాంప్’ సినిమా విడుదల, కిరణ్ అబ్బవరం థియేటర్లలో చేసిన సందడితో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ ఊర మాస్ స్టెప్పుల వీడియో సినిమాకు అదనపు ప్రచారాన్ని అందిస్తూ వైరల్ అవుతోంది.


