|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు మరాఠీ రాదు, దమ్ముంటే నన్ను తరిమేయండి.. నటుడి సవాల్‌

Published: 06-07-2025, 7:12 AM
నాకు మరాఠీ రాదు, దమ్ముంటే నన్ను తరిమేయండి.. నటుడి సవాల్‌

మరాఠీ మాట్లాడనందుకు ఓ స్వీట్ షాప్ యజమానిని కొట్టిన ఘటనపై భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్ లాల్ యాదవ్ స్పందించారు. తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయమని సవాల్ విసిరారు.

Key Points

1

మరాఠీ మాట్లాడకపోవడం వల్ల స్వీట్ షాప్ యజమానిపై దాడి జరిగింది.

2

భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్ లాల్ యాదవ్ మరాఠీ మాట్లాడలేదని తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు.

4

భాష నేర్చుకోకపోవడం తప్పు కాదని, రాజకీయాలను ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని ఆయన అన్నారు.

మరాఠీలో మాట్లాడకపోవడం వల్ల దాడి

మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్‌ షాప్‌ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది. అయితే తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయండి అని సవాల్‌ విసిరారు భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్‌ లాల్‌ యాదవ్‌ ( Dinesh Lal Yadav ). ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హమర్‌ నామ్‌ బా కన్హయ్య.

చెత్త రాజకీయాలు ఈ సినిమా ప్రమోషన్స్‌లో దినేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మరాఠీ మాట్లాడలేదని దాడి చేస్తారా? ఇవన్నీ చెత్త రాజకీయాలు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారు అలాంటివాటికి దూరంగా ఉంటే బాగుంటుంది. మీకంత దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టండి చూద్దాం.. నేను మరాఠీ మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను సవాల్‌ విసురుతున్నా.. నేను ఇక్కడే ఉంటాను. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి.

దినేశ్ లాల్ యాదవ్ సవాల్

నేర్చుకోకపోతే తప్పేం కాదు నేను కూడా రాజకీయ నాయకుడినే.. పాలిటిక్స్‌ అనేవి.. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప వారిని నిలువుదోపిడీ చేయడానికి కాదు. ఎవరికైనా ఐదు భాషలు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటారు. మరాఠీ అందమైన భాష. భోజ్‌పురి, తెలుగు, తమిళం, గుజరాతీ.. ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవచ్చు. ఎవరూ నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు. అలా అని ఎందుకు ఫలానా భాష నేర్చుకోలేదని టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చారు. దినేశ్‌ లాల్‌ యాదవ్‌ను నిరాహువా అని కూడా పిలుస్తుంటారు. భోజ్‌పురిలో అనేక సినిమాలు చేసిన ఈయన హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు.

చెత్త రాజకీయాలు అని దినేశ్ యాదవ్ ఆరోపణ

దినేశ్ లాల్ యాదవ్ రాజకీయాలను ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని, భాష నేర్చుకోకపోవడం తప్పు కాదని స్పష్టం చేశారు. ఈ వివాదం రాజకీయ చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.