|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లికానుకలు సరిపోవని వరకట్నం కోసం నటుడి వేధింపులు!

Published: 12-09-2025, 6:12 AM
పెళ్లికానుకలు సరిపోవని వరకట్నం కోసం నటుడి వేధింపులు!

కన్నడ దర్శక, నటుడు ఎస్. నారాయణ్‌పై ఆయన కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. పెళ్లి కానుకలు సరిపోవడం లేదని ఆయన కుటుంబం వేధిస్తోందని ఆరోపణ. పోలీసులు విచారణ చేపట్టారు.

Key Points

1

కన్నడ నటుడు ఎస్. నారాయణ్‌పై కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.

2

పెళ్లి కానుకలు సరిపోవడం లేదని నారాయణ్ కుటుంబం వేధింపులకు దిగిందని ఆరోపణ.

4

పోలీసులు నారాయణ్, ఆయన భార్య, కుమారుడికి నోటీసులు జారీ చేశారు.

కోడలు పోలీసులకు ఫిర్యాదు

కన్నడ దర్శకనటుడు ఎస్‌ నారాయణ్‌ ( S Narayan )పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్‌ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్‌, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్‌కు నోటీసులు పంపారు.

ఫిర్యాదులో ఏముందంటే? ‘నా భర్త పవన్‌ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్‌ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు.

వరకట్న వేధింపుల ఆరోపణలు

నేను సంపాదించి పోషించా.. తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్‌ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్‌కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్‌ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం’ అని పవిత్ర పేర్కొంది.

సినిమా చైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్‌ దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్‌ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్‌ కురిగలు, హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్‌ మాంక్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు.

పోలీసుల విచారణ

ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల విచారణ ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది. వరకట్న వ్యవస్థను నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.