
📌 Key Points
- నటుడు శివాజీ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రాధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
- ఆయన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ తీవ్రంగా ఖండించారు.
- మంచు మనోజ్, నవదీప్ వంటి హీరోలు కూడా శివాజీ మాటలను తప్పుబట్టారు.
- వివాదం తర్వాత శివాజీ వీడియో విడుదల చేసి తన వ్యాఖ్యలకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు.
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రాధారణపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన అనుచిత కామెంట్స్ ను ప్రముఖులు ఖండించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో, శివాజీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం, శివాజీ వివరణపై పూర్తి కథనం.
అసలేం జరిగింది? శివాజీ వ్యాఖ్యలు
Shivaji Reacts on His Comments: నటుడు శివాజీ వెనక్కి తగ్గాడు . హీరోయిన్లపై ఆయన చేసిన కామెంట్స్ కి క్షమాపణలు కోరాడు . ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశాడు . నిన్న జరిగిన దండోర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్ల వస్త్రాధారణపై ఆసభ్యకరమైన కామెంట్స్ చేసింది . నిండుతనమే అందమంటూ .. సామాన్లు చూపించడంలో అందం లేదంటూ అసభ్యకర రీతిలో మాటలు వదిలారు .
అంతేకాదు అలాంటి వారిని దరిద్రపు ము **** అంటారంటూ అనుచిత కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది . ఆయన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి . ఆయన కామెంట్స్ సింగర్ చిన్మయి , యాంకర్ అనసూయలు తీవ్రంగా ఖండించారు . ఇక హీరోలు మంచు మనోజ్ , నవదీప్ శివాజీ తప్పుగా మాట్లాడారని , ఆయన హద్దులు దాటారంటూ వ్యతిరేకించారు . ఈ క్రమంలో నటుడు శివాజీ తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు .
ఇండస్ట్రీలో దుమారం, ప్రముఖుల స్పందన
“ హాలో అండి .. ఇన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడ్డ సంఘటనలపై రెండు మంచి మాటలను చెప్పాలని చూశాను . ఆ సందర్భంలో రెండు అన్ పార్లమెంటరీ పదాలు వాడాను . ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎవరికైనా ఇలాంటి మాటలు ఎవరి మనోభవాలైన దెబ్బతీస్తాయి . కానీ , నేను మాట్లాడింది అందరు అమ్మాయిలను ఉద్దేశించి కాదు . హీరోయిన్ల వస్త్రాధారణ బాగుంటే మీకు ఇబ్బంది ఉండదమ్మా అనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశాను . నేను ఎవరిని అవమానపరచాలని మాట్లాడాలను . కానీ ఏదేమైన రెండు అన్ పార్లమెంటరీ పదాలు మాట దొర్లాయి . దీనికి నాహృదయ పూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా .
శివాజీ క్షమాపణ – వీడియోలో ఏమన్నారంటే?
నేనేప్పుడు స్త్రీ అంటే పరాశక్తి .. అమ్మవారనే అనుకుంట . అలాంటి స్త్రీని ఎవరూ తప్పుగా చూడోద్దు . అలాంటి అవకాశం ఇవ్వోద్దనే చెప్పే ఉద్దేశంతో ఊరు మాటలు వచ్చాయి . అది చాలా తప్పు . మంచి ఉద్దేశంతోనే మాట్లాడాలను .. కానీ , ఆ రెండు పదాలు రాకుండ ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు . మరోసారి మీ అందరికి ఓ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను . మంచి చెప్పాలనే ఉద్దేశం తప్పా .. అవమానపరచాలి , కించపరిచాలని ఉద్దేశం నాకేప్పుడు లేదు . ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభవాలు దెబ్బతిన్నందుకు .. మహిళలు ఎవరినైనా నా కమెంట్స్ బాధపడిన ఉంటే వారందరికి నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నా ” అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు .
శివాజీ వ్యాఖ్యల వివాదం ఆయన క్షమాపణతో ముగిసింది. మంచి ఉద్దేశంతోనే మాట్లాడినా, పదజాలం సరికాదని ఆయన అంగీకరించారు. ఈ సంఘటన ఇండస్ట్రీలో భాషా వినియోగం, మహిళల పట్ల గౌరవంపై మరోసారి చర్చకు దారితీసింది.


