
బిగ్ బాస్ ఫేమ్ నటి భానుశ్రీ ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో పాడిన పాటకు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ విషయం గురించి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లతో తన అనుభవాన్ని పంచుకుంది.
Key Points
భానుశ్రీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాడిన పాటకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
సోషల్ మీడియాలో భానుశ్రీని ట్రోల్ చేసి, బూతులు తిట్టారు.
రెండు రోజులు నిరంతరం ఏడ్చినట్లు భానుశ్రీ వెల్లడించింది.
నేటి తరం నటీనటులపై సోషల్ మీడియా దాడుల గురించి ఆమె తన ఆందోళనను వ్యక్తం చేసింది.
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో పాట
బిగ్‌బాస్(Bigg Boss) ఫేమ్ యాక్టర్ భానుశ్రీ(Bhanusri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలు మెప్పిస్తుంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈ చిన్నది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company) అనే టీవీ షోలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గెలుపు తలుపులే సాంగ్‌ను పాడిన సంగతి తెలిసిందే. తను ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినందుకు షోలో ఉన్న వాళ్లంతా ఆమెను అభినందించారు. కానీ, బయట ఫ్యాన్స్, ఆ సాంగ్ లవర్స్ మాత్రం పాటని చెడగొట్టావు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో భానుశ్రీని ఈ విషయంలో తెగ ట్రోల్ కూడా చేశారు.
సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా వచ్చిన బాధ
అయితే తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. భానుశ్రీ మాట్లాడుతూ.. ‘నేను ఆ రోజు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే పాట పాడాను. అంతకుముందు కూడా చాలా పాటలు పాడాను, అభినందనలు వచ్చాయి. అందుకే ఆ పాట పాడాను. నేను ప్రొఫెషనల్ సింగర్ కాదు కేవలం ప్రేక్షకుల కోసం పాడాను. సెట్‌లో అందరూ అభినందించారు. కానీ బయట సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ వల్ల చాలా సఫర్ అయ్యాను.
భానుశ్రీ ఎమోషనల్ కామెంట్స్
నాతో పాటు ఇంట్లో అమ్మ, నాన్నలను, ఫ్యామిలీని కూడా ట్రోల్ చేశారు. ట్రోలర్స్, మీమర్స్‌కి ఒకటే చెప్తున్నా మా మీద డబ్బులు సంపాదించుకోండి కానీ మా ఇంట్లో వాళ్ళ మీదకు ఎందుకు. ఇది నాన్సెన్స్. చాలా మంది యాక్టర్స్ ఈ ట్రోల్స్ వల్ల సఫర్ అవుతున్నారు. నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. నా వాయిస్ గురించి బూతులతో తిడుతూ మాట్లాడారు. రెండు రోజులు ఏడ్చాను కూడా. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ మోటివేట్ చేశారు. ఇప్పుడైతే అసలు ట్రోల్స్ గురించి పట్టించుకోను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భాను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భానుశ్రీ అనుభవం సోషల్ మీడియా ద్వారా వచ్చే ట్రోలింగ్ ప్రమాదాలను హైలైట్ చేస్తుంది. నటీనటులకు మానసిక బలం అవసరం అని ఈ ఘటన చూపుతుంది.


