|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హేమ షాకింగ్ కామెంట్స్: ఆ టైమ్‌లో సూసైడ్ చేసుకోవాలనిపించింది! క్లీన్ చిట్ మామూలు షాక్ కాదు!!

Published: 30-03-2026, 8:35 AM
  • నటి హేమ: డ్రగ్స్ కేసు ఆరోపణలతో తీవ్ర మనోవేదన, సూసైడ్ ఆలోచనలు వచ్చాయన్న హేమ.
  • మాదక ద్రవ్యాల కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని కొన్ని మీడియా సంస్థలపై హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • దాదాపు 36 ఏళ్లుగా 250-300 సినిమాల్లో నటించిన హేమ కెరీర్లో ఇది ఒక మాయని మచ్చ.
  • కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని, ఇది చాలా కఠినమైన కాలమని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.

టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ కేసు వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తాను ఎంతలా కుంగిపోయానో, సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందో స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

డ్రగ్స్ కేసులో హేమ సంచలన ఆరోపణలు!

నటి హేమ తెలుగులో అనేక సినిమాలు చేసి మెప్పించింది. తనదైన కామెడీతోనూ మెప్పించింది. ఎక్కువగా బ్రహ్మానందంతో జోడీగా చేసిన అలరించింది. నవ్వులు పూయించింది. ఈ క్రమంలో ఆ మధ్య నటి హేమ మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుంది. రేవ్‌ పార్టీలో దొరికిపోయినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఇది పెద్ద ఇష్యూ అయ్యింది. మీడియాలో చాలా రోజులు దీనిపై చర్చ నడిచింది. కానీ తాను ఆ రేవ్‌ పార్టీలో లేనని తెలిపింది. ఈ మేరకు వీడియో రిలీజ్‌ చేసింది. కానీ దాన్ని ఎవరూ నమ్మలేదు.

ఈ క్రమంలో హేమకి ఈ మాదక ద్రవ్యాల కేసులో ఉపశమనం లభించింది. ఆమెకి క్లీన్‌ చిట్‌ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో నటి హేమ పాల్గొంది. ఈ ఆరోపణల వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, దాని వల్ల తన కుటుంబం ఎలా సఫర్‌ అయ్యిందనే విషయాన్ని ఆమె వెల్లడించింది.

కుటుంబం పడిన కష్టాలను వెల్లడించిన హేమ!

నటి హేమ మాట్లాడుతూ, ఈ మాదక ద్రవ్యాల కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించిందని సంచలన కామెంట్‌ చేసింది. అంతగా మానసికంగా కుంగిపోయినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల కేసు వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించింది. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పింది. `నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం` అని ఆమె పేర్కొంది. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు సపోర్ట్ గా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపింది.

క్లీన్ చిట్ వెనుక అసలు నిజాలు ఇవేనా?

దాదాపు 36ఏళ్లుగా సినిమాల్లో ఉన్న నటి హేమ ఇప్పటి వరకు 250-300కిపైగా చిత్రాలు చేసింది. `బాల గోపాలుడు`, `భలే దొంగ`, `జయమ్ము నిశ్చయమ్మురా`, `అగ్గిరాముడు`, `రౌడీగారి పెళ్లాం`, `క్షణం క్షణం`, `మనీ`, `వారసుడు`, `మెకానిక్‌ అల్లుడు`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `మురారి`, `జయం మనదేరా`, `నీ స్నేహం`, `వసంతం`, `పల్లికిలో పెళ్లికూతురు`, `మల్లీశ్వరి`, `శ్రావణమాసం`, `అందరివాడు`, `సోగ్గాడు`, `అతడు`, `టాటా బీర్లా మధ్యలో లైలా` ఇలా అనేక చిత్రాలు చేసింది. ఇందులో `అతడు`లో ఆమె కామెడీ మాత్రం వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఆమె సినిమాల్లో కనిపించడం తగ్గింది. కానీ వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. మరి ఇకపై సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.

హేమ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె క్లీన్ చిట్‌తో బయటపడినప్పటికీ, ఆనాటి సంఘటనలు ఆమెను ఇంకా వెంటాడుతున్నాయని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.