|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అబ్బాయిల కంటే తనే నయం అంటూ తన బెస్ట్ ఫ్రెండ్‌కి తాళి కట్టిన నటి.. షాకింగ్ వీడియో వైరల్

Published: 02-07-2025, 6:17 AM

మలయాళ సీరియల్ నటి ప్రార్థన కృష్ణ నాయర్ తన బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో ఆమె నిజాన్ని వెల్లడించింది.

Key Points

1

మలయాళ నటి ప్రార్థన తన బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి వీడియోను షేర్ చేసింది.

2

వీడియోలో వారు తాళి కట్టుకుని, ముద్దులు పెట్టుకున్నారు.

3

తరువాత, ఇది కేవలం షూటింగ్ కోసం అని ప్రార్థన వెల్లడించింది.

4

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రార్థన కృష్ణ నాయర్ వైరల్ వీడియో

మలయాళ నటి ప్రార్థన కృష్ణ నాయర్(Prarthanakrishna Nair) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం పలు సీరియల్స్, షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడయాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ప్రార్థన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. జూన్ 29న తన బెస్ట్ ఫ్రెండ్ అన్సియా( Ansia)ను గుడిలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. నుదుటన కుంకుమ దిద్ది జంటగా అడుగులు వేశారు. అంతేకాకుండా ఇందులో ఒకరికొకరు మెడలో తాళి కట్టుకుని దండలు మార్చుకుని ముద్దులు కూడా పెట్టుకున్నారు. పవిత్రమైన గుడిలో ముద్దులతో రెచ్చిపోయారు.

వీరిద్దరు తెలుపు, ఎరుపు రంగు చీరలు కట్టుకుని కనిపించారు. అలాగే ఈ వీడియోకు.. ‘‘రియల్ లైఫ్‌లో నటించేవారికి మా జీవితాల్లో చోటు లేదు. టాక్సిక్ అబ్బాయిల కంటే నా ఫ్రెండ్ నయం. ఆడవాళ్లందరూ మీ చేతిలో కీలుబొమ్మలు కాదు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అంతేకాకుండా అత్యధిక వ్యూస్‌ను కూడా సాధించింది. ఈక్రమంలో.. తాజాగా, ప్రార్థన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరో వీడియోను షేర్ చేసి పెళ్లి గురించి నిజాన్ని బయటపెట్టింది. ‘‘మేము చాలా వైరల్ అయిపోయాము. అయితే మేము ఇటీవల చేసుకున్న పెళ్లిలో ఎలాంటి నిజం లేదు. అది కేవలం షూటింగ్ కోసం మాత్రమే చేశాము.

పెళ్లి వీడియో నిజానిజాలు

అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. వేరే ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నటులు అలాగే చేశారు.. కాబట్టి మేము కూడా ట్రై చేశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్ తనకు ఇదివరకే పెళ్లైంది. ఓ బాబు కూడా ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చింది. అలాగే తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది కాలంగా చాలామంది వైరల్ అయ్యేందుకు ఎలాంటి పనిని అయినా చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరికొందరు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చే పనులు చేస్తూ అందరి చేత తిట్లు పడుతున్నారు. ఇక ఇప్పుడు నటి ప్రార్థన కూడా వైరల్ కావడానికి అలా చేశాను అనడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

A post shared by Prarthana KriShna N Nair (@_actress_prarthanakrishnanair_)

సోషల్ మీడియా ప్రతిచర్య

Love Affair: స్టూడెంట్ తో మహిళా టీచర్ ఎఫైర్.. టాబ్లెట్స్ ఇచ్చి మరీ..

అమ్మమ్మను పెళ్లి చేసుకున్న మనవడు.. తాత పోయాక జరిగిందదే మరి..

చివరకు, ప్రార్థన ఈ వీడియో కేవలం షూటింగ్ కోసం అని వెల్లడించడంతో, ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడింది. వైరల్ కావడానికి చేసే ప్రయత్నాలపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.